Posts

Showing posts from December, 2021

ఓం సాయి రామ్

Image
                             ఓం సాయి రామ్

మీనాక్షి పంచ రత్నమాల 🙏(స్తోత్రం)

Image
  ఓం శ్రీ మాత్రే నమః 🙏 "సుందరేశ్వరుడు" సాక్షాత్తు శివుడు. ఆయన భార్య పార్వతీదేవి మానవరూపంలో అవతరించి పాండ్య రాజ పుత్రికగా రాజ్యాన్ని పరిపాలించి, భక్తుల రక్షణ కోసం దివ్య మహిమలు ప్రదర్శించి, పరమశివుని సతీమణి అయింది. మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతిదేవి చిన్న పాప రూపంలో భూమి మీదకు వచ్చింది.  మీనాక్షి నామధేయంతో పెరిగి పెద్దదైంది. ఆమెను పెళ్లాడటానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించాడు.                           మీనాక్షి పంచ రత్నమాల 🙏(స్తోత్రం) ఉద్యద్భాను సహస్రకోటి సదృశం కేయూర హారోజ్వలాం బింబోష్టిస్మిత దంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం (1) 🌹ఉదయించుచున్న వేలకోట్ల సూర్యులతో సమానమైనది, కంకణములతో, హారములతో ప్రకాశించుచున్నది, దొండపండ్లు వంటి పెదవులు కలది, చిరునవ్వులొలుకు దంతముల కాంతి కలది, పీతాంబరములను ధరించినది, విష్ణు- బ్రహ్మ- దేవేంద్రులచే సేవించబడునది. తత్త్వస్వరూపిణియైనది, శుభము కల్గించునద...

ఓం దుర్గాయై నమః🙏

Image
ఓం శ్రీ మాత్రే నమః 🙏 ఓం దుర్గాయై నమః🙏 మంగళ శ్లోకం🙏 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే🙏 మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటిదేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతీ, ఓ దుర్గాదేవీ, ఓ నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను🙏 దుర్గ అనే నామంలో 'ద'కారం దైత్యనాశనానికి, 'ర'కారం రోగ నాశనానికి, 'గ' కారం జ్ఞానానికి సంకేతాలు. దైత్యులు అంటే రాక్షసులు. అహంకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడి చేయడం, అబద్దాలు చెప్పడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం... వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, స్త్రీలను గౌరవించకపోవడం, పరస్త్రీలను కామభావనతో చూడడం మొదలైనవి రాక్షస లక్షణాలు. ఈలక్షణాలు వ్యక్తిని సర్వనాశనం చేస్తాయి. ఇటువంటి రాక్షస లక్షణాలను తన ఉపసాకుల నుంచి తొలగిస్తుంది "దుర్గా" నామంలో ఉండే 'ద'కారం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితః అన్నారు.  పూర్వజన్మలో చ...

ఓం సాయి రామ్

Image
                                ఓం సాయి రామ్

ఓం సాయి రామ్

Image
                                ఓం సాయి రామ్

ఓం నమో భగవతే రమణాయ నమః🙏

Image
  ఓం నమో భగవతే రమణాయ నమః 🙏 🌹 భగవాన్ శ్రీ రమణుల జయంతి🙏 🌹"నాకు జ్ఞానోదయం కావాలి స్వామీ నేను అజ్ఞానిని" అని ఒక భక్తుడు రమణుల్ని ఆశ్రయించాడు.  ‘నువ్వు అజ్ఞానివా, ఆ విషయం నీకు నిజంగా తెలుసా’ అని రమణులు అతణ్ని ప్రశ్నించారు. ‘తెలుసు స్వామీ నేను  పరమ అజ్ఞానిని’ అన్నాడు భక్తుడు.  ‘నీ గురించి నీకు తెలిసింది కదా... నువ్వు జ్ఞానివే.  ఇక నీకు నాతో పని లేదు’ అన్నారు మహర్షి.  🌹ఆత్మ విచారం ద్వారా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి.  జీవన్ముక్తి అంటే జీవితం నుంచి ముక్తులు అని కాదు. ఈ జీవితంలోనే ముక్తిని పొందాలి.  🌹ముక్తి అంటే మరణానంతరం పొందేది కాదు. పరంజ్యోతి గుండె గూటిలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగులో నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి.  నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి’ అని రమణులు సూచించారు. 🌹భగవాన్ శ్రీరమణులు తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రం) నాడు అళగమ్మాళ్, సుందరేశం అయ్యర్లు దంపతులకు జన్మించారు. 🌹తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భక్తులు  భగవాన్ అని కూడా సంభో...

నిత్య సత్యావతారం దత్త అవతారం🙏

Image
వందే దత్తాత్రేయం 🙏 జగదుత్పత్తికర్త్రేచ, స్థితి సంహారహేతవే భవనాశ విముక్తాయ దత్తాత్రేయ! నమోస్తుతే॥ ఆదౌ బ్రహా హరిర్మధ్యేహ్యంతే దేవస్సదాశివః మూర్తిత్రయస్వరూపాయ, దత్తాత్రేయ! నమోస్తుతే॥ జరాజన్మవినాశాయ, దేహశుద్ధికరాయచ దిగంబర! దయామూర్తే! దత్తాత్రేయ! నమోస్తుతే 🌹త్రిమూర్తి స్వరూపం, గురుస్వరూపమై, లోకోద్ధరణకు అవతరించిన శ్రీ మహావిష్ణువు రూపమే దత్తాత్రేయుడు. 🌹బ్రహ్మ అంశతోనూ, శివ అంశతోనూ పుట్టిన బిడ్డలు తపస్సు నిమిత్తం వెళ్తూ, వారి తేజస్సును విష్ణుఅంశతో పుట్టిన దత్తుడిలో మిళితం చేశారు. అప్పటి నుంచి దత్తుడు మూడుమూర్తుల అవతారంగా దత్తాత్రేయమూర్తిగా విరాజిల్లాడు. 🌹దత్తవతారం దశావతారాలకంటే ఎంతో పురాతనమైనది.  అన్ని అవతారాలు తమకు నిర్ధేశించిన కార్యము పూర్తిచేసుకొని ఈ లోకమునుండి నిష్క్రమించాయి.  🌹దత్త అవతారం మాత్రం నిత్య సత్యావతారంగా విరాజిల్లుతూనే ఉంది.  ఇది శిష్టరక్షణకు, దుష్టశిక్షణ కొరకే గాక, ప్రజలకు జ్ఞానప్రభోధం చేసి, వారిని సన్మార్గంలో చేయడానికి వచ్చిన విలక్షణ అవతారం 🌹 ప్రతి మనిషిలో కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే రాక్షసులు మద్య నలిగి విలవిలలాడుతున్నాడు.  ఇది కలి ప్రభావం వ...

హరిహరసుతనే శరణమయ్యప్ప

Image
 హరిహరసుతనే శరణమయ్యప్ప 🙏 🌹మాతా-పితా-గురు-దైవమే శరణమయ్యప్ప 🙏 🌹 కన్నెస్వాములు 🙏 🌹దత్తాత్రేయుడి భార్య లీలావతి... పతి శాపంతో మహిషాసురుడి సోదరి మహిషి గా జన్మించింది.  🌹ప్రజలను పట్టిపీడిస్తున్న మహిషాసురుని... లోకమాత సంహరించడంతో పతి శాపంతో మహిషిగా పట్టిన లీలావతి రాక్షసులకు రాజుగా సింహాసనం అదిష్ఠించింది. 🌹దేవతలపై ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేసి, శక్తులు పొందిన మహిషి ప్రజలను హింసించసాగింది.  🌹హరిహరసుతుడు అయ్యప్ప మహిషితో యుద్ధం మొదలుపెడతాడు. పశువైన మహిషి ఛాతి మీదకెక్కి అయ్యప్ప నృత్యం చేస్తాడు.  ఈ నృత్యం చేసేది సాక్షాత్ హరిహర పుత్రుడేనని మహిషికి అర్దమై మణికంఠునికి సాష్టాంగ ప్రణామం చేసి మరణిస్తుంది. 🌹తనకు శాప విమోచనం లభించడంతో అయ్యప్పస్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది.  ఆమె కోరికను విన్న స్వామి తిరస్కరిస్తాడు.  🌹అయినా ఆమె పట్టువీడకపోవడంతో... ఎప్పుడైతే నన్ను దర్శించడానికి కన్నెస్వామి రాడో అప్పుడు పెళ్ళి చేసుకుంటాను, అప్పటి వరకు బ్రహ్మచారిగానే ఉంటాను" అని చెప్తాడు 🌹వారి రాకకు గుర్తుగా శరంగుత్తిలో బాణాలు ఉంచుతారని,  అక్కడ ఎప్పుడైతే ఒక్క ...

హేరంబగణపతి 🙏మంత్రం

Image
 ఓం గం గణపతయే నమః 🙏 🌹 మంత్రం ♦️అభయ వరదహస్తః పాశదంతాక్షమాలః    పరశుమధ త్రీశీర్షం ముద్గరం మోదకం చ    విదధతు నరసింహః పంచమాతంగ వక్త్రః   కనక రుచిర వర్ణః పాతు హేరంబ నామా♦️ 🌹 హేరంబగణపతి🙏 🌹ప్రాణులంతా ఎలా దుఃఖాలను పోగొట్టుకొని సుఖాలను పొందాలంటే ఎం చేయాలి...   దానికి సంబంధించిన ఉపాయాన్ని చెప్పమని పార్వతి అడిగినప్పుడు...  హేరంబోపనిషత్‌ ప్రారంభంలో సాక్షాత్తూ పరమేశ్వరుడు తన అనుభవంలోకి వచ్చిన విషయాన్నే ఆమెకు ఇలా  చెప్పాడు. 🌹పూర్వం త్రిపురాసుర సంహారం దేవతలందరికీ గొప్ప కష్టాన్ని తెచ్చిపెట్టింది.  ఎంత మంది దేవతలు ఎన్ని విధాలుగా పోరాడినా ఫలితం లేకపోయింది.  చివరకు లయకారకుడైన ఈశ్వరుడే స్వయంగా యుద్ధ రంగంలోకి దిగాడు.  తన యోగబలంతో సహా ఎన్ని బలాలను ప్రయోగించినా శత్రు సంహారం సాధ్యం కాలేదు. అప్పుడు హేరంబ గణపతిని ధ్యానించి పరమాత్మ సారభూతమైన ఆ గణపతి శక్తిని పొంది దాన్ని తన బాణంలో నిక్షిప్తం చేసి శత్రువు మీదకు సంధించాడు శివుడు. ఆ మరుక్షణంలోనే త్రిపుర సంహారం జరిగిపోయింది. 🌹విఘ్నరాజు ప్రభువులకే ప్రభువు.  ఆయనను ఉపాసించి సంసార సాగరం నుంచి, క...

ఓం సాయి రామ్

Image
                                 ఓం సాయి రామ్

ఓం సాయి రామ్

Image
                                  ఓం సాయి రామ్

సర్వభయ నివారణ సర్వజయ శ్రీమారుతి స్తోత్రం

Image
  శ్రీ ఆంజనేయం 🙏 సర్వభయ నివారణ సర్వజయ శ్రీమారుతి స్తోత్రం ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే మోహ శోక వినాశాయ సీతా శోక వినాశినే భాగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రానదాయచ వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ జన్మ మృత్యు భయఘ్నాయ సర్వ క్లేశ హరాయచ నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయ హారినే యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే బలినా మగ్ర గన్యాయ నమో నమః పాహి మారుతే లాభ దోషిత్వ మేవాశు హనుమాన్ రాక్షసాంతక యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ స్వాశ్రితా నా భయదం య ఏవమ్ స్తౌతి మారుతిం హానిహి కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్                                  ⚜️♦️⚜️♦️⚜️ 🌹మొదటి అక్షరాలన్నీ కలిపితే "ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బలాయ స్వాహా" అని రావటం ఇందులో ప్రత్యేకత. ...

ఓం నమః శివాయ ఋణానుబంధం

Image
 ఓం నమః శివాయ 🙏 ఋణానుబంధం 🌹అన్నిటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాటి మండుటెండలో వెడుతూ ఎండకి ఓర్చుకోలేక, ఒక చెప్పులు కుట్టే వాడు దారిలో పెట్టిన చెప్పులపై కొంత సేపు నిలబడ్డాడు. 🌹ఆ మాత్రం నిలబడినందున, ఆ ఋణం తీర్చు కోవడానికి మరుజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు – అనే దంపతులకు సునందుడు అను పేరుతో పుట్టాడు. 🌹జాతకం చూపిస్తే, పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తారు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు.  "వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి.  అతడికి మీరే అన్నీ ఇస్తూండండి" అని చెప్తారు. 🌹నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. పూర్వజన్మ గుర్తున్నందున ఆపిల్లవాడు వారి రుణం తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. 🌹ఒకరోజు రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా తాను రాజనగరుకు కాపలా కాయవలసి వచ్చింది. అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు నగరప్రజలను హెచ్చరిస్తూ హితవు ఒకటి చెబుతుండే వాడు. 🌹రాజుగారు మారువేషంలో తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు. మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్...

ఓం సాయి రామ్

Image
                                  ఓం సాయి రామ్

ఓం సాయి రామ్

Image
                               ఓం సాయి రామ్

లోకసాక్షి ఓం శ్రీ సూర్యనారాయణాయ నమో నమ:

Image
 ఓం శ్రీ సూర్యనారాయణాయ నమో నమ:🙏 " ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వ రధమారూఢమ్ ప్రచండం కశ్యపాత్మజమ్ శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్" 🌹భావం ఆది దేవుడైన శ్రీ సూర్య నారాయణమూర్తికి నమస్కరిస్తున్నాను.  ఏడు గుర్రాలు గల రధాన్ని ఎక్కినట్టివాడు, ప్రచండుడు, కశ్యప ప్రజాపతికి పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరించినట్టివాడు అయిన ఆ సూర్యభగవానుడికి ప్రణామములు అర్పిస్తున్నాను.                              🌹భగవంతుడు‬ లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు.  ఆయన ప్రత్యక్ష దైవం... లోకసాక్షి‬... జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాల నియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే.  సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు.  ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. 🌹ప్రత్యక్ష ‪నారాయణుడైన‬ సూర్యుడు పచ్చని ‪‎గుర్రాలను‬ పూన్చిన రథంలో ప్రయాణిస్తుంటాడు.  ఈ పచ్చదనం లోకకల్యాణ సూచకం.  దినస్పతి అని కీర్తిని ...

ధర్మాన్ని ఆచరించిన శ్రీరాముడు

Image
 జై శ్రీ రామ్🙏 ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ | లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||   🌹తండ్రి మాట కోసం వనవాసానికి... సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు.  🌹అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు.  🌹మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు.  🌹అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు.  🌹దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు.  🌹అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు.  🌹ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది.  తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది.  🌹కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు.  🌹నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు.  నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పా...

మూలవిరాట్టు గడ్డం క్రింద నిత్యం పచ్చకర్పూరం తో అలంకరిస్తారు

Image
 ఓం నమో వేంకటేశాయ 🙏 🌹తిరుమల... ఆ పేరు వినగానే మనసు ఆనందభరితమవుతుంది. పరమపవిత్ర భావం మది నిండా పాకుతుంది. 🌹ఏడుకొండలపై శ్రీనివాసుడు భక్తులకు కల్పతరువు, వరాలవేల్పు. 🌹శ్రీ వేంకటేశ్వరుని లీలా విశేషాలు, భక్తులు అద్భుత అనుభవాలు చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు కదా... 🌹తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని మూలవిరాట్టు గడ్డం క్రింద నిత్యం పచ్చకర్పూరం తో అలంకరిస్తారు. 🌹శ్రీవారికి సేవచేస్తూ తరించిన భక్తుడు శ్రీఅనంతాళ్వార్‌.  ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు.  ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు.  పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని, మొదలు పెడతాడు.  🌹ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు.  చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు.  అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది.  అంతలో ...

ఓం సాయి రామ్

Image
                   ఓం సాయి రామ్

ఓం సాయి రామ్

Image
                   ఓం సాయి రామ్

వేదమాత గాయత్రి 🙏

Image
  ఓం శ్రీ మాత్రే నమః 🙏            వేదమాత గాయత్రి ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్ గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే 🌹 భావము ముత్యపు వర్ణము, పగడపు వర్ణము, బంగారపు వర్ణము, నీలవర్ణము, తెల్లని వర్ణము గల ఐదు ముఖములు కలిగినదియు,  ప్రతి ముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు,  చంద్రకళతో కూడిన కిరీటము కలదియు,  పరమార్థ వివరాణత్మక బీజాక్షరములు కలిగినదియు, వరద మరియు అభయముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైన గాయత్రీదేవిని సేవించెదను. గాయత్రీ వేదజననీ గాయత్రీ లోకపావనీ న గాయత్ర్యాః పరం జప్యం ఏతద్విజ్ఞానముచ్యతే 🌹గాయత్రియే వేదమాత, త్రిలోకవాసులకు జ్ఞానమును ప్రసాదించే పావని.  గాయత్రీ మంత్ర జపమును మించినది మరొకటి లేదు. న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్ 🌹తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేవు. 🌹దైవముగా చూడవలసిన వారిలో మొదటి స్థానము మాతృమూర్తిదే....

ఓం శ్రీ సాయి రామ్ 🙏

Image
  ఓం శ్రీ సాయి రామ్ 🙏 🌹ఒక బాబా భక్తురాలు రొట్టెలు చేస్తూ చేస్తూ "ఓంసాయి శ్రీ సాయి జయ జయ సాయి" అని జపం చేస్తున్నది.  ఆవిడ విడిగా పూజ చేయడానికి సమయం కుదరదు పాపం.  అందువల్ల పని చేస్తూ చేస్తూ సాయి నామాన్ని చేసుకునేది. 🌹ఇంతలో ఒక్కసారిగా ధమ్మని గట్టిగా పెద్ద శబ్దం వచ్చి బాధతో కూడిన అరుపు వినిపించింది.  ఆమె ఇంటి ప్రాంగణం వైపు పరుగున వెళ్లి చూసేసరికి గుండె ఆగిపోయినంత పనైంది.  ఎనిమిదేళ్ళ బాబు రక్తంతో తడిసి పడి ఉన్నాడు. గట్టిగా అరిచి ఏడవాలి అనిపించింది.  🌹కానీ ఇంట్లో ఆమె తప్ప ఎవరు లేరు.  ఏడ్చి మాత్రం ఎవరిని పిలవ గలదు? ఇటు బాబును కూడా చూసుకోవాలి కదా.  పరుగున కిందకు వెళ్ళి చూసింది.  బాబు సగం స్పృహలో “అమ్మ అమ్మ” అని కలవరిస్తున్నాడు.  ఆమె లోపల మమత కళ్ళలో నుండి జారి తన అస్తిత్వాన్ని ఆమెకు తెలియ చెప్పించింది. 🌹పదిరోజుల క్రితం చేయించుకున్న అపెండిక్స్ ఆపరేషన్ ను కూడా పట్టించుకోకుండా, ఎక్కడినుంచి అంత శక్తి వచ్చిందో మరి, బాబును భుజాన వేసుకుని, ఆ వీథిలోనే ఉన్న వైద్యాలయానికి పరుగు పెట్టింది.  బాబా ని ఆసుపత్రికి తీసుకొని వెళుతూ దారిలో అంతా మనసులో సాయ...

జై గురు దత్త దత్త' అనే రెండక్షర నామమే మహామంత్రం.

Image
                    జై గురు దత్త 🙏 మాలా కమండలు రథః కరపద్మ యుగ్మే మధ్యస్థ పాణి యుగళే ఢమరు త్రిశూలే యస్యస్త ఊర్ధ్వ కరయోశ్శుభశంఖచక్రే వందే తమత్రి వరదం భుజషట్కయుక్తమ్ దత్తాత్రేయం శివం శాంతం సచ్చిదానంద మద్వయం ఆత్మరూపం పరం దివ్యం అవధూత ముపాస్మ హే 🌹బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన దత్తాత్రేయులవారి రూపంలో ముమ్మూర్తుల ఏకత్వం ప్రకాశిస్తోంది. స్వామి ఆరు చేతులతో ప్రకాశిస్తున్నాడు.  క్రింది రెండు చేతులలో అక్షమాల, కమండలం ధరించాడు (బ్రహ్మ), మధ్య చేతుల్లో ఢమరుకం, త్రిశూలం దాల్చాడు (శివుడు), పైరెండు చేతుల్లో శంఖు చక్రాలు ధరించాడు (విష్ణువు)  ఇలా ఆరు చేతులతో ప్రకాశిస్తూ, అత్రికి వరాన్ని అందించిన దత్తాత్రేయునికి వందనం... శాంత స్వరూపంతో దీపించే సచ్చిదానందరూపుడు, అద్వయుడు, ఆత్మరూపుడు, సర్వోన్నతుడు, దివ్యుడు, అవధూత దత్తాత్రేయుని ఉపాసిస్తున్నాను. 🌹దత్త’ ఇత్యక్షరద్వయమ్ 🌹‘దత్త' అనే రెండక్షర నామమే మహామంత్రం.  ఆ నామాన్ని స్మరించినంత మాత్రానికే స్వామి అనుగ్రహిస్తాడు.  🌹‘దత్తా దత్తా’ అని పిలిచినంతనే, ఆయన భక్తుల ప్రక్కనే నిలిచి, వారి కష్టనష్టాలను, ...

ఓం నమః శివాయ భోగాలనే చేపను పట్టుకున్నంత కాలం, కష్టాలనే కాకులు, కర్మలనే కాకులు వెంబడిస్తూనే ఉంటాయి.

Image
 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏 🌹నేను చదివిన కథ ఒకచోట బెస్తలు చేపలు పడుతున్నారు.  దూరంగా ఎక్కడినుంచో ఒక గ్రద్ద వచ్చి చటుక్కున ఒక చేపను నోట కరచుకొని వెళ్ళిపోయింది.  అలా చేపను పట్టుకొని వెళ్ళిపోతున్న గ్రద్దను కాకుల గుంపు చూసింది.  వెంటనే వందలాది కాకులు ఆ చేపకోసం దానిని తరమసాగాయి.  ’కావ్ కావ్’ అని అరుస్తూ దాన్ని చుట్టుముట్టాయి.  గ్రద్ద దక్షిణం కేసి ఎగిరితే, కాకులూ దక్షిణం వైపుకు వెళ్ళాయి.  ఉత్తరం వైపునకు వెళ్తే అవి కూడా ఉత్తరం వైపుకు వెళ్ళాయి.  తరువాత గ్రద్ద పాపం. తూర్పు, పడమర దిశల్లో కూడా ఎగిరి చూసింది.  ఎటుపోయినా, కాకుల గుంపు మాత్రం వెంబడించడం మానలేదు.  వాటిని తప్పించుకునేందుకు గరుడపక్షి విశ్వప్రయత్నం చేస్తూ ఆ హడావిడిలో నోటినుంచి చేపను జారవిడచుకుందు.  అంతే! ఒక్కసారిగా కాకులన్నీ చేపపడ్డ చోటుకేసి దూసుకుపోయాయి.  గ్రద్దను వదిలేశాయి.  అప్పుడు ఆ పక్షి నిశ్చింతగా ఓ చెట్టుపై కూర్చొని తనలో తాను ’ఈ చేపే కదా, ఇంత గందరగోళానికి కారణం. ఇప్పుడు ఆ చేపా నా చెంత లేదు; చింతా నా చెంత లేదు’ అనుకుంది.               ...

ఓం సాయి రామ్

Image
                                ఓం సాయి రామ్

ఓం గం గణపతయే నమః 🙏ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్

Image
 ఓం గం గణపతయే నమః 🙏 శ్లోకం  తొలుత నవిఘ్నమనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను బ్రస్తుతి జేసెద నేకదంత మా వలపలి చేతిగంటమున వాక్కుననెప్పుడు బాయకుండు మా తలపుల లోన నీవెగతి దేవ, వినాయక, లోకనాయకా 🌹"శివపుత్రుడా" అవిఘ్నమస్తు అంటూ మొట్టమొదటగా నీకు మొక్కుతున్నాను.  నాకు చక్కని ఫలితాలను ఈయవయ్యా.  నిన్ను పొగుడుతున్నాను.  ఓ ఏకదంతా నా కలంలో, వాక్కులో నువ్వే నెలకొని వుండు.  నిన్నే నమ్ముకుని ఉన్నాను.  ఓ దేవా వినాయకా లోక నాయకా🙏                 🌹ఆయన చేతులలోని ఆయుధాలు కూడ ఎన్నో లోతైన విషయాలను విడమరచి చెబుతున్నట్లుగా ఉంటాయి. 🌹పాశం  పాశాన్ని పై ఎడమ చేత్తో పట్టుకుని దర్శనమిస్తుంటాడు.  రాగద్వేషాలను అదుపులో ఉంచుకోమని స్వామివారి చేతిలోనున్న పాశం మనకు అవగతపరుస్తోంది.  🌹అంకుశం  స్వామి చేతిలోనున్న అంకుశం మనకు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉంటుంది. 🌹గండ్రగొడ్డలి ఈ ఆయుధాన్ని గణేశునికి పరశురాముడు బహుకరించాడని... పరశురామునికి శివుడు బహుకరించాడు అని అంటారు. ఇది మనలోని చెడుభావాలను దూరంగా ఉంచమని చెబుతోంది...

ఓం సాయి రామ్

Image
                                ఓం సాయి రామ్

కావడి మొక్కులు🙏

Image
ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః🙏                  కావడి మొక్కులు🙏 🌹పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు.  🌹వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు.  🌹ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు.  🌹కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు.  కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది.  మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా...  🌹దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు.  కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు.  🌹ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు.  ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞ...

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం🙏

Image
శ్రీ ఆంజనేయం 🙏        శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం🙏 🌹మాణిక్యం  తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః | ఇయేష పదమన్వేష్టుం చారణా చరితే పథి || (1) 🌹ముత్యం  యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ | స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి || (2) 🌹ప్రవాలం  అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ | అనిర్వేదో హి సతతం సర్వార్డేషు ప్రవర్తకః || (3) 🌹మరకతం  నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యె చ తస్యై జనకాత్మజాయై | నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః || (4) 🌹పుష్యరాగం  ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ | తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్(5) 🌹హీరకం  రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః | రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే || (6) 🌹ఇంద్రనీలం  జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః | రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః | దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః | హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః || (7) 🌹గోమేధికం  యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః | యది వాస్త్యేకపత్నీత్వం శీతో...

మృత్యుంజయ మంత్రం... పూర్తి అర్థముతో🙏

Image
  ఓం నమఃశివాయ 🙏 🌹 మృత్యుంజయ మంత్రం... పూర్తి అర్థముతో🙏 🌹మానవుడికి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది...  "మహా మృత్యుంజయ మంత్రం" 🌹మృత్యుంజయ మంత్రం ఋగ్వేదం లోని ఒక మంత్రం.  దీనినే "త్రయంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టి వర్ధనం| ఉర్వారుకమివ బంధనాన్, మృత్యోర్ ముక్షీయ మామృతాత్|| 🌹 ఓం  అ-ఉ-మ ల సంగమమే ఓంకారం.  ఋగ్వేదం నుండి "అ" కారం.  యజుర్వేదం నుండి "ఉ" కారం,  సామవేదం నుండి "మ" కారాలు పుట్టి...  ఆ మూడింటి సంగమంతో ఓంకారం  ఉద్భవించింది.  ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవత్ రూపం.  ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది.  సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం.  కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది.  🌹 త్రయంబకం త్రయంబక మంటే మూడు నేత్రాలని అర్థం. ఇంద్ర, అగ్ని, సామ తత...

ఓం సాయి రామ్ శరణాగతి

Image
                  ఓం సాయి రామ్

🌹శ్రీ శివ ద్వాదశ నామస్మరణ 🙏

Image
  ఓం నమః శివాయ 🙏 🌹శివ అంటే మంగళం, భద్రం, కళ్యాణం, క్షేమం.  🌹పరమశివునికి 63 లీలా స్వరూపములు ఉన్నాయి.  వాటిలో అత్యంత ప్రస్తుతి చేయబడే స్వరూపం ఒకచేత "త్రిశూలం", ఒకచేత "ఢమరుకం" ధరించిన రూపం. త్రైగుణ్యం శూలమే తస్య పరశు సత్య నిష్ఠతా త్రిశూలం రూపంలో మూడు గుణములు ఆయన చేతిలో ఉంటాయి. 🌹"ఓ శివా నీకు నమస్కారము"🙏 అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము. 🌹శివనామము గంగ వంటిది.  విభూతి యమున వంటిది.  రుద్రాక్ష సర్వ పాపములను పోగొట్టే సరస్వతీనది వంటిది. 🌹 ఎవనియందు అత్యంత శుభకరములగు "శివనామము", "విభూతి", "రుద్రాక్షలు" అనే మూడు ఉండునో... అట్టివాని దర్శన మాత్రము చేత త్రివేణీ సంగమంలో స్నానము చేసిన ఫలము లభిస్తుంది.  వాని దర్శనము పాపములను పోగొట్టును.  🌹ఈమూడు ఎవని శరీరమునందు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ సంగమ స్నానము వలన లభించు పుణ్యమును మరియొకవైపు ఉంచి... బ్రహ్మ పోల్చి చూసెను.  రెండింటి ఫలము సమానముగ ఉండెను. 🌹శివనామము అనే దావాగ్ని యెదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికీ సత్యము. 🌹భవానీ శంకరులలో భవా...

ఓం సాయి రామ్

Image
                               ఓం సాయి రామ్

ఓం సాయి రామ్

Image
                                ఓం సాయి రామ్

శివుని రూపాలు

Image
ఓం నమః శివాయ 🙏 🌹అగోచరము అయిన "ఈశ్వరుని"గా, మంగళకరుడైన ‘శంభుని’గా,  లౌక్యం తెలియని ‘భోళాశంకరుని' గా, సకల వేదాలూ, శాస్త్రాలూ, తంత్రాలూ బోధించిన గొప్ప గురువు ‘దక్షిణామూర్తి’గా,  ఎవరినైనా ఇట్టే క్షమించేసే ‘అశుతోషుని’గా, ఆ సృష్టికర్త రక్తాన్నే శరీరానికి అలుముకున్న ‘కాలభైరవుని'గా, ప్రశాంతతకు ప్రతిరూపమైన ‘అచలేశ్వరుని' గా, బ్రహ్మాండ నృత్యకారుడైన ‘నటరాజు’గా పరమేశ్వరుడుకి ఎన్నో రూపాలు ఉన్నాయి.  🌹ఆయన "అల్ప సంతోషి", "నిరాడంబరుడు", "భక్తవశంకరుడు", "శుభాలనిచ్చేవాడు", "బోళా శంకరుడు", "విభూతి ప్రియుడు", "చితాభస్మధారి", "శ్మశాన వాసి", "జలాభిషేక ప్రియుడు", "సదా ధ్యానప్రియుడు", "భూతగణాధి సేవితుడు", "కైలాస నివాసి", "సహస్ర నామధేయుడు", "సర్వాంతర్యామి"🙏  🌹శివుడు లింగరూపుడు. పంచభూత సమన్వితుడు. సృష్టికి మూలం ఆ స్వరూపమే. 🌹శివుడి వాహనం వృషభం . ఒకమారు ఆయన హిమాలయాల్లో ధ్యానంలో ఉన్నప్పుడు, సమీపంలోని ఒక తల్లిఆవు పొదుగు నుంచి... లేగదూడ పాలు తాగుతుంటుంద...

దత్త జయంతి

Image
 🌹మార్గశిర పౌర్ణమి దత్త జయంతి🙏 🌹ధర్మావతారాల్లో... రాముడిగా... కృష్ణుడిగా రాక్షస సంహారం ద్వారా ధర్మసంస్థాపన జరిపిన నారాయణుడే... దత్తాత్రేయుడి అవతారంలో సమర్థ గురువుగా జ్ఞానప్రబోధ చేశాడు. 🌹దత్తాత్రేయుడు ఆది గురువు... గురుతత్వానికి ఆద్యుడు. దేవతలకూ జ్ఞాన బోధ చేసిన వాడు. సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏక స్వరూపం దత్తాత్రేయుడిది.  దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ | ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ || భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ | చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ 🌹అత్రి మహర్షి, అనసూయ దంపతుల తనయుడిగా జన్మించాడు బాలదత్తుడు.  🌹దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము “సమర్పించుకున్నారు” కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది.  🌹అత్రి…అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరూ వచ్చింది. 🌹దత్తుడిది జ్ఞానావతారం🙏  దత్త తత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి.  శరణాగతి సూత్రాన్ని పాటించాలి. ...

శ్రీవారి నైవేద్యం

Image
  ఓం నమో వేంకటేశాయ 🙏 🌹 శ్రీవారి నైవేద్యం 🌹తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది కానీ... స్వామి వారికి సకల విధమైన నైవేద్యం ఉంటుంది. 🌹సర్వజగద్రక్షకుడైన ఏడుకొండల వాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ... ఆగమశాస్త్రం ప్రకారమే  జరుగుతుంది. 🌹చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే కదా... 🌹ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు. 🌹ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు.  వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు.  🌹ఇక శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు. 🌹ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు. గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. 🌹వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు. 🌹స్వామి... ప్రసాదాలు, నైవేద్...

ఓం సాయి రామ్

Image
                     ఓం సాయి రామ్

గోదాదేవి🙏 (ఆండాళ్)

Image
  ఓం శ్రీ మాత్రే నమః 🙏 🌹 గోదాదేవి🙏 (ఆండాళ్) 🌹 శ్రీమహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది. 🌹 శ్రీవిల్లిపుత్తూరు లో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు.  విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు.  నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది. కాబట్టి ఆయనకు ఆ బిరుదు దక్కింది. 🌹ఆయన అక్కడి ఆలయంలోని ప్రధాన దైవం అయిన శ్రీకృష్ణునికి నిత్యం పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు.  🌹ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది.  ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి... ఆమెకు #కోదై అని పేరు పెట్టి పెంచుకోసాగాడు. 🌹తమిళంలో కోదై అనగా "తులసి మాల" అని అర్థం. తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు.  క్రమేపి ఆపేరే గోదా గామారింది. 🌹గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగింది.  యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది.  🌹తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది.  🌹అంతేకాదు... తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతు...