ఓం శ్రీ సాయి రామ్ 🙏

 ఓం శ్రీ సాయి రామ్ 🙏


🌹ఒక బాబా భక్తురాలు రొట్టెలు చేస్తూ చేస్తూ "ఓంసాయి శ్రీ సాయి జయ జయ సాయి" అని జపం చేస్తున్నది. 

ఆవిడ విడిగా పూజ చేయడానికి సమయం కుదరదు పాపం. 

అందువల్ల పని చేస్తూ చేస్తూ సాయి నామాన్ని చేసుకునేది.


🌹ఇంతలో ఒక్కసారిగా ధమ్మని గట్టిగా పెద్ద శబ్దం వచ్చి బాధతో కూడిన అరుపు వినిపించింది. 

ఆమె ఇంటి ప్రాంగణం వైపు పరుగున వెళ్లి చూసేసరికి గుండె ఆగిపోయినంత పనైంది. 

ఎనిమిదేళ్ళ బాబు రక్తంతో తడిసి పడి ఉన్నాడు.

గట్టిగా అరిచి ఏడవాలి అనిపించింది. 


🌹కానీ ఇంట్లో ఆమె తప్ప ఎవరు లేరు. 

ఏడ్చి మాత్రం ఎవరిని పిలవ గలదు? ఇటు బాబును కూడా చూసుకోవాలి కదా. 

పరుగున కిందకు వెళ్ళి చూసింది. 

బాబు సగం స్పృహలో “అమ్మ అమ్మ” అని కలవరిస్తున్నాడు. 

ఆమె లోపల మమత కళ్ళలో నుండి జారి తన అస్తిత్వాన్ని ఆమెకు తెలియ చెప్పించింది.


🌹పదిరోజుల క్రితం చేయించుకున్న అపెండిక్స్ ఆపరేషన్ ను కూడా పట్టించుకోకుండా, ఎక్కడినుంచి అంత శక్తి వచ్చిందో మరి, బాబును భుజాన వేసుకుని, ఆ వీథిలోనే ఉన్న వైద్యాలయానికి పరుగు పెట్టింది. 

బాబా ని ఆసుపత్రికి తీసుకొని వెళుతూ దారిలో అంతా మనసులో సాయిబాబాను తిట్టుకో సాగింది.


🌹“ఓ సాయిదేవా! నీకు ఏమి అన్యాయం చేశాను? నా పిల్లవాడికి ఇంత గతి పట్టిస్తావా?” అని కోపంతో తిడుతూనే ఉంది. 

సరే, అక్కడ డాక్టర్ ను కలిసి బాబు కి చికిత్స సమయానికి అందింది. 

బాబు పూర్తిగా నయమైపోయాడు. 

దెబ్బలు అంతగా ఏమి తగలలేదు. 

అందువల్ల ఎక్కువ ఇబ్బంది కలగలేదు. 

2 రోజులలో ఇంకా ఏమి ఉండదు అని డాక్టర్ చెప్పి పంపించేసారు.


🌹రాత్రికి ఇంటిదగ్గర అందరూ టీవీ చూస్తున్నారు.

అప్పుడు సాయిభక్తురాలి మనస్సు జరిగినది అంతా తలచుకొని ఆలోచనలో ఉంది.

సాయిబాబా అంటేనే విరక్తి కలగసాగింది. 

ఒక తల్లి మమత సద్గురు దేవుడు ఉనికిని ఎదిరిస్తోంది.

ఆమె బుర్రలో ఆరోజు జరిగిన ఘటనాక్రమం అంతా చక్రంలాగా తిరగింది.


🌹బాబు ఇంటిముందు ఎట్లా కిందపడ్డాడో తలుచుకుంటే అంతరాత్మ కంపించింది. 

నిన్ననే పాత మోటరు పైపు ప్రాంగణం నుండి తీయించివేశారు. 

సరిగ్గా అదే స్థలంలో బాబు కిందపడ్డాడు. 

ఒకవేళ నిన్న మేస్త్రీ రాకపోయి ఉంటే? 

ఆమె చేయి ఒక్కసారి తన పొట్ట దగ్గర పెట్టుకుంది. ఇంకా ఆ చోట కుట్లు పచ్చిగానే ఉన్నాయి. 

ఆశ్చర్యం వేసింది. ఆమె 20-22 కిలోల బాబును ఎట్లా అరకిలోమీటరు దూరం వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది.

బాబు పువ్వు లాగా తేలికగా అనిపించాడప్పుడు. 


🌹ఆమె బట్టల బకెట్ పట్టుకుని మేడ మీదకు తీసుకొని వెళ్ళలేక పోతుండేది మామూలుగా అయితే.

మళ్ళీ ఆమెకు గుర్తుకు వచ్చింది- డాక్టర్ గారు రోజూ రెండు గంటల వరకే ఉంటాడు. 

ఆమె అక్కడకు వెళ్ళినప్పుడు మూడు గంటలు అయింది. ఆమె వెళ్ళంగానే చికిత్స జరిగింది. 

ఎవరో ఆయనను ఆపి పెట్టినట్టుగా ఆయన ఉన్నాడక్కడ.


🌹అప్పుడు ఆమె శ్రీ సాయిబాబా చరణాలపై ఆమె తల శ్రద్ధగా వాల్చింది. 

ఆమెకు ఇప్పుడు మొత్తం ఆట అంతా అర్థమయింది. మనస్సులోనే ఆ శ్రీ సాయిపరమాత్ముని తన తప్పుడు మాటలకు క్షమాపణ కోరింది.




టీవీలో ప్రవచనం వస్తున్నది-


🌹భగవంతుడు ఇట్లా అంటాడు... 

“నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను. 

కానీ నీకు దానిని సులువుగా దాటటానికి శక్తిని ఇవ్వగలను.

నీ దారిని సరళంగా చేయగలను.

కేవలం ధర్మ మార్గంలో సాగుతూ ఉండు. అంతే”


🌹అప్పుడు ఆ భక్తురాలు ఇంట్లో దేవ మందిరం వైపు చూసింది- సద్గురు సాయిబాబా వారు ఆమె చూస్తున్న ఫొటోలో నవ్వుతూ కనిపించినట్లు అనిపించింది.


🌹మనం అందరం కూడా ఆయన పిల్లలం అందుకు మనము కూడా ఓర్పు,సహనం తో ఒక్కసారి ఎదురు చూసి ఆలోచిద్దాం. 

మన వెనుక ఉండి ఆయన చేసిన లీలలు చూద్దాం.

మనసున నిలుపుకొని మనసారా సాయి నామాన్ని చేద్దాం.


🌹అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై🌹🙏


Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం