ఓం గం గణపతయే నమః 🙏ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్
ఓం గం గణపతయే నమః 🙏
శ్లోకం
తొలుత నవిఘ్నమనుచు
ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య
నిను బ్రస్తుతి జేసెద నేకదంత మా
వలపలి చేతిగంటమున
వాక్కుననెప్పుడు బాయకుండు మా
తలపుల లోన నీవెగతి దేవ,
వినాయక, లోకనాయకా
🌹"శివపుత్రుడా" అవిఘ్నమస్తు అంటూ మొట్టమొదటగా నీకు మొక్కుతున్నాను.
నాకు చక్కని ఫలితాలను ఈయవయ్యా.
నిన్ను పొగుడుతున్నాను.
ఓ ఏకదంతా నా కలంలో, వాక్కులో నువ్వే నెలకొని వుండు.
నిన్నే నమ్ముకుని ఉన్నాను.
ఓ దేవా వినాయకా లోక నాయకా🙏
🌹ఆయన చేతులలోని ఆయుధాలు కూడ ఎన్నో లోతైన విషయాలను విడమరచి చెబుతున్నట్లుగా ఉంటాయి.
🌹పాశం
పాశాన్ని పై ఎడమ చేత్తో పట్టుకుని దర్శనమిస్తుంటాడు.
రాగద్వేషాలను అదుపులో ఉంచుకోమని స్వామివారి చేతిలోనున్న పాశం మనకు అవగతపరుస్తోంది.
🌹అంకుశం
స్వామి చేతిలోనున్న అంకుశం మనకు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉంటుంది.
🌹గండ్రగొడ్డలి
ఈ ఆయుధాన్ని గణేశునికి పరశురాముడు బహుకరించాడని... పరశురామునికి శివుడు బహుకరించాడు అని అంటారు.
ఇది మనలోని చెడుభావాలను దూరంగా ఉంచమని చెబుతోంది.
వీర, సిద్ధి, విఘ్న, హేరంబ, నృత్య గణపతుల చేతుల్లో ఈ గండ్రగొడ్డలి చూడగలం.
🌹విల్లు
ఒకసారి పార్వతీదేవి దగ్గరనుంచి శివుని విల్లు పినాకమును తీసుకున్న గణపతి, దానిని భూమిపైకి విసిరేసాడని ఒక కథ.
ఈ విల్లు చెడుకు దూరంగా ఉండమని మనకు చెబుతోంది.
🌹బాణం
స్వామి చేతిలోని బాణం, మనలను చీకటి నుండి వెలుగులోకి పయనించమని చెబుతోంది.
🌹ఒకసారి త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి వెళ్ళిన శివుడు, గణపతిని స్మరించకుండానే ఆ పనికి ఉద్యుక్తుడయ్యాడు.
ఫలితంగా ఎంతగా ప్రయత్నించినప్పటికీ శివుని చేతిలో త్రిపురాసురుడు హతమవడం లేదు.
కొంతసేపటి తర్వాత విషయాన్ని గ్రహించిన శివుడు గణేశుని ప్రార్థించగా, ఆయన ‘ఓం’ అనే బీజమంత్రాన్ని బాణంపై వ్రాసి ప్రయోగించామన్నాడట.
శివపరమాత్మ అలాగే చేయగా త్రిపురాసుర సంహారం విజయవంతంగా జరిగింది.
🌹కత్తి
స్వామివారి గంధక ఖడ్గప్రియ అనే కత్తి మన మనసులోని తలెత్తే చెడు ఆలోచలనలను మొగ్గలోనే తుంచేయమని చెబుతోంది.
🌹గునపం
వ్యవసాయదారులు ఉపయోగించే గునపం పంటలు బాగా పండించుకునేందుకు వీలవుతుంది.
అలాగే మనలోని భావనలను ఆలోచన అనే గునపంతో తిరగేసి జీవితంలో పురోభివృద్ధి సాధించమని గునపము పేర్కొంటుంది.
🌹శతధరవరాయుధం
ఈ ఆయుధం మంచి చెడులను వేరు చేసి చూడమంటోంది.
🌹గద
వినాయకుడు గణాధిపత్యం పొందకమునుపే పార్వతీదేవి ఆజ్ఞప్రకారం, ఆమె భవనానికి కాపలాకాస్తూ శివగణాలతో యుద్ధానికి దిగుతాడు. అప్పుడు ఆయన చేతిలో గదాయుధం ఉంది.
ఈ ఆయుధం సమస్యలను ఎదిరించి నిలబడి పోరాడమని మనకు సూచిస్తోంది.
🌹త్రిశూలం
వీర గణపతి చేతిలో త్రిశూలాన్ని చూడగలం.
ఈ త్రిశూలం ఆపదలు, లేక విపత్తులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి పోరాడమని మనకు సూచిస్తోంది.
🌹డాలు
ఈ ఆయుధం ఇతరులు మనకు చేసే చెడు నుంచి రక్షించుకోమని సూచిస్తోంది.
Comments
Post a Comment