దత్త జయంతి
🌹మార్గశిర పౌర్ణమి దత్త జయంతి🙏
🌹ధర్మావతారాల్లో... రాముడిగా... కృష్ణుడిగా రాక్షస సంహారం ద్వారా ధర్మసంస్థాపన జరిపిన నారాయణుడే... దత్తాత్రేయుడి అవతారంలో సమర్థ గురువుగా జ్ఞానప్రబోధ చేశాడు.
🌹దత్తాత్రేయుడు ఆది గురువు... గురుతత్వానికి ఆద్యుడు.
దేవతలకూ జ్ఞాన బోధ చేసిన వాడు.
సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏక స్వరూపం దత్తాత్రేయుడిది.
దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ |
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ||
భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ |
చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్
🌹అత్రి మహర్షి, అనసూయ దంపతుల తనయుడిగా జన్మించాడు బాలదత్తుడు.
🌹దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది.
త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము “సమర్పించుకున్నారు” కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది.
🌹అత్రి…అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం.
అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరూ వచ్చింది.
🌹దత్తుడిది జ్ఞానావతారం🙏
దత్త తత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి.
శరణాగతి సూత్రాన్ని పాటించాలి.
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః
🌹దత్తాత్రేయుడిని పూజించడం వల్ల... సకల దోషాలు పోతాయని, ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
🌹త్రిమూర్తి స్వరూపుడు కావడం వల్ల దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుంటే... బ్రహ్మ, శ్రీమహావిష్ణువు, పరమేశ్వరుడి ఆశీర్వాదం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః
తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే
Comments
Post a Comment