💥శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి💥
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏 అనంత స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కోరుకున్న వారికి కోరినన్ని వరాలను ఇచ్చే దయామయుడు. అందుకే ఆ స్వామిని '#కోటివరాలదేవుడు' అని పిలుస్తున్నారు. ఆ స్వామి నామస్మరణ సకల శుభకరం. ఆ స్వామి 'నారాయణ' నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అన్ని రకాలైన దుఃఖాలను నేలమట్టం చేసి, సకల ఐశ్వర్యాలను ప్రసాదించి, పరమపదానికి చేరుస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం.. విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతియని, దేవదేవుడని కీర్తించింది. 💥శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి💥 ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః || 1 || న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః || 2 || మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్ మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః || 3 || నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః || 4 || రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్ కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః || 5 || య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ యజ్ఞాంగరూపిణే తుభ్యం యక...