వేదమాత గాయత్రి 🙏

 ఓం శ్రీ మాత్రే నమః 🙏


           వేదమాత గాయత్రి

ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః

యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్

గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం

శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే


🌹భావము

ముత్యపు వర్ణము, పగడపు వర్ణము, బంగారపు వర్ణము, నీలవర్ణము, తెల్లని వర్ణము గల ఐదు ముఖములు కలిగినదియు, 

ప్రతి ముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు, 

చంద్రకళతో కూడిన కిరీటము కలదియు, 

పరమార్థ వివరాణత్మక బీజాక్షరములు కలిగినదియు,

వరద మరియు అభయముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైన గాయత్రీదేవిని సేవించెదను.


గాయత్రీ వేదజననీ గాయత్రీ లోకపావనీ

న గాయత్ర్యాః పరం జప్యం ఏతద్విజ్ఞానముచ్యతే


🌹గాయత్రియే వేదమాత, త్రిలోకవాసులకు జ్ఞానమును ప్రసాదించే పావని. 

గాయత్రీ మంత్ర జపమును మించినది మరొకటి లేదు.




న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్


🌹తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేవు.


🌹దైవముగా చూడవలసిన వారిలో మొదటి స్థానము మాతృమూర్తిదే. 

ధ్యాన, జప, సంకీర్తన, స్తోత్ర పూజలలో ఏ విధముగా అయినా దైవారాధన చేయవలెనన్న కావలసినది పంచ జ్ఞానేంద్రియములతో కూడిన దేహమే కదా. 

ఆ దేహమును ఇచ్చునది తల్లియే కదా. 

కాబట్టి అన్ని దైవారాధనలకన్నా ముందు తల్లిని దైవముగా భావించి పూజించుట  ఉత్తమం.

అందుచేత, మంత్రములలో గాయత్రిని తల్లిగా పోల్చారు. 

నవమాసాలు మోసి, కని పెంచి, కంటికి రెప్పలాగా కాపాడి ఎలాగైతే తల్లి బిడ్డను పెంచునో అలాగే గాయత్రీ మాత కూడా ఉపాసకుని కాపాడును.


గాయతాం త్రాయతే ఇతి గాయత్రి

గానము చేయువాని రక్షించేది గాయత్రి. 


సర్వాత్మనాహి యాదేవీ సర్వ భూతేషు సంస్థితా

గాయత్రీ మోక్షహేతుర్వై మోక్షస్థానక లక్షణమ్


🌹భావము సర్వభూతములందు అంతర్యామినియై వర్తించు గాయత్రియే మోక్షస్వరూపము, మోక్షప్రసాదినియై ఉన్నది.

                  


🌹గాయత్రీ మంత్రం🌹🙏


ఓం భూర్భువస్సువః| ఓం తత్సవితుర్వరేణ్యమ్|

భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్|

                           

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు