నిత్య సత్యావతారం దత్త అవతారం🙏
వందే దత్తాత్రేయం🙏
జగదుత్పత్తికర్త్రేచ, స్థితి సంహారహేతవే
భవనాశ విముక్తాయ దత్తాత్రేయ! నమోస్తుతే॥
ఆదౌ బ్రహా హరిర్మధ్యేహ్యంతే దేవస్సదాశివః
మూర్తిత్రయస్వరూపాయ, దత్తాత్రేయ! నమోస్తుతే॥
జరాజన్మవినాశాయ, దేహశుద్ధికరాయచ
దిగంబర! దయామూర్తే! దత్తాత్రేయ! నమోస్తుతే
🌹త్రిమూర్తి స్వరూపం, గురుస్వరూపమై, లోకోద్ధరణకు అవతరించిన శ్రీ మహావిష్ణువు రూపమే దత్తాత్రేయుడు.
🌹బ్రహ్మ అంశతోనూ, శివ అంశతోనూ పుట్టిన బిడ్డలు తపస్సు నిమిత్తం వెళ్తూ, వారి తేజస్సును విష్ణుఅంశతో పుట్టిన దత్తుడిలో మిళితం చేశారు.
అప్పటి నుంచి దత్తుడు మూడుమూర్తుల అవతారంగా దత్తాత్రేయమూర్తిగా విరాజిల్లాడు.
🌹దత్తవతారం దశావతారాలకంటే ఎంతో పురాతనమైనది.
అన్ని అవతారాలు తమకు నిర్ధేశించిన కార్యము పూర్తిచేసుకొని ఈ లోకమునుండి నిష్క్రమించాయి.
🌹దత్త అవతారం మాత్రం నిత్య సత్యావతారంగా విరాజిల్లుతూనే ఉంది.
ఇది శిష్టరక్షణకు, దుష్టశిక్షణ కొరకే గాక, ప్రజలకు జ్ఞానప్రభోధం చేసి, వారిని సన్మార్గంలో చేయడానికి వచ్చిన విలక్షణ అవతారం
🌹 ప్రతి మనిషిలో కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే రాక్షసులు మద్య నలిగి విలవిలలాడుతున్నాడు.
ఇది కలి ప్రభావం వలన మనిషిని అధోగతి పాలుచేస్తుంది.
🌹మనిషిని మనిషిగా సాధకునిగా, మహాజ్ఞానిగా, మహయోగిగా మార్చాలని సత్సంకల్పంతో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వం, త్రిమూర్తితత్వం ఏకత్వ రూపునిగా దత్తాత్రేయుడుగా అవతరించాడు.
🌹దత్తాత్రేయులవారు సర్వజనోద్ధరణ కోసం అవతరించారు కనుక, భూమిపై జనులు ఉన్నంతవరకూ ఆయన సంచరిస్తూనే ఉంటారు. భక్తులను అనుగ్రహిస్తూనే ఉంటారు.
🌹సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపించి వారికి భక్తి బోధన చేయడం కోసం పుట్టిన మహా అవతారం దత్తాత్రేయు అవతారం.
అందుకే వారు ఆదిగురువులయ్యారు.
🌹🌹జై గురుదేవదత్త 🌹🌹
Comments
Post a Comment