శ్రీవారి నైవేద్యం
ఓం నమో వేంకటేశాయ 🙏
🌹శ్రీవారి నైవేద్యం
🌹తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది కానీ...
స్వామి వారికి సకల విధమైన నైవేద్యం ఉంటుంది.
🌹సర్వజగద్రక్షకుడైన ఏడుకొండల వాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ...
ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతుంది.
🌹చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే కదా...
🌹ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు.
పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు.
🌹ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు.
వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు.
🌹ఇక శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు.
🌹ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు.
గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు.
🌹వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు.
🌹స్వామి... ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు.
గర్భాలయం తలుపులు మూసేస్తారు.
🌹విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు.
🌹కుడిచేతితో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు
(స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.)
పవిత్ర మంత్రాలు ఉచ్ఛరిస్తూ అన్నసూక్తం నిర్వర్తిస్తారు.
🌹స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు.
🌹నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది.
ఇది స్వామికి భోజనానికి పిలుపుగా భావిస్తారు.
🌹రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు.
🌹ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవుపాలు సమర్పిస్తారు.
🌹తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు.
🌹బాలభోగం
ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు.
మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి.
🌹రాజభోగం
పది, పదకొండు గంటల మధ్య...
శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్దోజనం, శీర లేక చక్కెరన్నం.
🌹శయనభోగం
రాత్రి ఏడు - ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు.
మరీచ్యఅన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం(వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)
🌹నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు పంచుతారు.
🌹అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం) పెడతారు.
🌹ఇక పవళించే సమయం దగ్గరపడుతుంది.
ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేంచిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి ।
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥
Comments
Post a Comment