ఓం దుర్గాయై నమః🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏
ఓం దుర్గాయై నమః🙏
మంగళ శ్లోకం🙏
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే🙏
మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై,
సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటిదేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతీ, ఓ దుర్గాదేవీ, ఓ నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను🙏
దుర్గ అనే నామంలో 'ద'కారం దైత్యనాశనానికి,
'ర'కారం రోగ నాశనానికి, 'గ' కారం జ్ఞానానికి సంకేతాలు.
దైత్యులు అంటే రాక్షసులు.
అహంకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడి చేయడం, అబద్దాలు చెప్పడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం...
వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, స్త్రీలను గౌరవించకపోవడం, పరస్త్రీలను కామభావనతో చూడడం మొదలైనవి రాక్షస లక్షణాలు.
ఈలక్షణాలు వ్యక్తిని సర్వనాశనం చేస్తాయి.
ఇటువంటి రాక్షస లక్షణాలను తన ఉపసాకుల నుంచి తొలగిస్తుంది "దుర్గా" నామంలో ఉండే 'ద'కారం.
పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితః అన్నారు.
పూర్వజన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో రోగంగా పీడిస్తుంది.
రోగం అంటే మానసిక, శారీరక రోగాలు మాత్రమే కాదు.
దురాశ, శోకం, కపటత్వం, కుళ్ళు, ఇతరుల వస్తువులను పొందాలనుకోవడం, అవినీతి మొదలైనవి మనిషిని నిలువెల్లా దహించే భయానకరోగాలు.
ఇవి వ్యక్తినే కాదు, మొత్తం సమాజానికి చేటు చేస్తాయి.
దుర్గా నామంలో ఉండే 'ర'కారం సకల విధములైన రోగాలను నాశనం చేస్తుంది.
🌹ఇక 'గ'కారం జ్ఞానానికి సంకేతం.
జ్ఞానం అనగానే మన లోకానికి సంబంధించిన జ్ఞానమని ఎప్పుడు అనుకోకూడదు.
సమస్త బ్రహ్మాండాలను తన సంకల్పమాత్రం చేత సృష్టించి, పోషించి, లయం చేయగలిగిన పరమేశ్వరి మనకు ఏది తెలుసుకుంటే ఇక అన్నీ తెలుస్తాయో...
దేన్నీ తెలుసుకోవడం వలన ఇక ఏదీ తెలుసుకునే పని ఉండదో,
ఏది సనాతనమో, సత్యమో, నిత్యమో...
అటువంటి పరలోకపు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ అవసరంలేని నిర్వాణ స్థితిని ప్రసాదిస్తుంది.
మనం ఈ శరీరంకాదు, శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులమని అనుభూతిని కలిగిస్తుంది.
దుర్గ అనే నామమే పరమశక్తివంతమైనది.
🔱♦️🔱♦️🔱♦️🔱♦️🔱
Comments
Post a Comment