ఓం నమః శివాయ భోగాలనే చేపను పట్టుకున్నంత కాలం, కష్టాలనే కాకులు, కర్మలనే కాకులు వెంబడిస్తూనే ఉంటాయి.

 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏


🌹నేను చదివిన కథ

ఒకచోట బెస్తలు చేపలు పడుతున్నారు. 

దూరంగా ఎక్కడినుంచో ఒక గ్రద్ద వచ్చి చటుక్కున ఒక చేపను నోట కరచుకొని వెళ్ళిపోయింది. 

అలా చేపను పట్టుకొని వెళ్ళిపోతున్న గ్రద్దను కాకుల గుంపు చూసింది. 

వెంటనే వందలాది కాకులు ఆ చేపకోసం దానిని తరమసాగాయి. 

’కావ్ కావ్’ అని అరుస్తూ దాన్ని చుట్టుముట్టాయి. 

గ్రద్ద దక్షిణం కేసి ఎగిరితే, కాకులూ దక్షిణం వైపుకు వెళ్ళాయి. 

ఉత్తరం వైపునకు వెళ్తే అవి కూడా ఉత్తరం వైపుకు వెళ్ళాయి. 

తరువాత గ్రద్ద పాపం.

తూర్పు, పడమర దిశల్లో కూడా ఎగిరి చూసింది. 

ఎటుపోయినా, కాకుల గుంపు మాత్రం వెంబడించడం మానలేదు. 

వాటిని తప్పించుకునేందుకు గరుడపక్షి విశ్వప్రయత్నం చేస్తూ ఆ హడావిడిలో నోటినుంచి చేపను జారవిడచుకుందు. 

అంతే! ఒక్కసారిగా కాకులన్నీ చేపపడ్డ చోటుకేసి దూసుకుపోయాయి. 

గ్రద్దను వదిలేశాయి. 

అప్పుడు ఆ పక్షి నిశ్చింతగా ఓ చెట్టుపై కూర్చొని తనలో తాను ’ఈ చేపే కదా, ఇంత గందరగోళానికి కారణం.

ఇప్పుడు ఆ చేపా నా చెంత లేదు; చింతా నా చెంత లేదు’ అనుకుంది.

                      



🌹మనిషి జీవితమూ అంతే.

భోగాలనే చేపను పట్టుకున్నంత కాలం, కష్టాలనే కాకులు, కర్మలనే కాకులు వెంబడిస్తూనే ఉంటాయి. 


🌹వాటివల్ల చింత, విచారం, అశాంతి కూడా వెన్నంటే వస్తాయి. 

ఇలా భోగాల కోసం పరుగులెత్తకుండా పరిమిత వనరులతో ప్రశాంతంగా ఉండమని ప్రబోధిస్తూ...


సురమందిర తరుమూల నివాసః, శయ్యా భూతల మజినం వాసః


సర్వపరిగ్రహ భోగత్యాగః, కస్య సుఖం న కరోతి విరాగః


అంటున్నారు భజగోవిందం పరంపరలో శంకర భగవత్పాదుల శిష్యప్రముఖులు నిత్యానందులు. 


🌹దేవాలయాల్లో ఏదో చెట్టు కింద నివసిస్తూ, నేలమీద పడుకుంటూ, లేడి చర్మాన్ని ధరిస్తూ, అన్నీ వదలిపెట్టి, భోగాలను కోరని విరాగికి ఇక సుఖం ఎందుకు లభించదని ప్రశ్నిస్తున్నారు. 


🌹ఈ రోజు మనిషి జీవితం అతి దుర్భరంగా మారడానికి ప్రధాన కారణం భోగలాలసే.


🌹అవసరాన్ని మించి ఆరాటం. 

నిజానికి ఒకటి తర్వాత మరొకటి ఊరిస్తూ ఉరుకులు పెట్టిస్తూ, భోగాలు మనల్ని అవసరాన్ని మించి ఆరాటపడేలా చేస్తున్నాయి. 


🌹అందుకే భర్తృహరి...

"భోగాలను నేను అనుభవించడంలేదు. అవే నన్ను అనుభవిస్తున్నాయ’ని బాధపడుతూ, 

👉"భోగా న భుక్తా వయ మేవ భుక్తాః" అంటారు. 


🌹 ఇల్లు, వాకిలీ వదిలేసి మనుషులంతా చెట్లూ పుట్టలు, గుళ్ళూ గోపురాలు వెళ్ళమని వారి ఉద్దేశ్యం కాదు. 

కానీ శాశ్వతమైన ఆనందాన్ని సంప్రాప్తించుకునే మార్గంలో వీలయినంత వరకు బాహ్యభోగాలకు సంబంధించిన వస్తువులపై అనురక్తిని తగ్గించుకోమంటున్నారు. 


🌹మనం ధరించే దుస్తులు, వినియోగించే వస్తువులు, విహరించే వాహనాలను బట్టే మనకు విలువ ఉంటుందని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. ఇది పొరపాటు.

             

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు