హేరంబగణపతి 🙏మంత్రం
ఓం గం గణపతయే నమః 🙏
🌹మంత్రం
♦️అభయ వరదహస్తః పాశదంతాక్షమాలః
పరశుమధ త్రీశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహః పంచమాతంగ వక్త్రః
కనక రుచిర వర్ణః పాతు హేరంబ నామా♦️
🌹హేరంబగణపతి🙏
🌹ప్రాణులంతా ఎలా దుఃఖాలను పోగొట్టుకొని సుఖాలను పొందాలంటే ఎం చేయాలి...
దానికి సంబంధించిన ఉపాయాన్ని చెప్పమని పార్వతి అడిగినప్పుడు...
హేరంబోపనిషత్ ప్రారంభంలో సాక్షాత్తూ పరమేశ్వరుడు తన అనుభవంలోకి వచ్చిన విషయాన్నే ఆమెకు ఇలా చెప్పాడు.
🌹పూర్వం త్రిపురాసుర సంహారం దేవతలందరికీ గొప్ప కష్టాన్ని తెచ్చిపెట్టింది.
ఎంత మంది దేవతలు ఎన్ని విధాలుగా పోరాడినా ఫలితం లేకపోయింది.
చివరకు లయకారకుడైన ఈశ్వరుడే స్వయంగా యుద్ధ రంగంలోకి దిగాడు.
తన యోగబలంతో సహా ఎన్ని బలాలను ప్రయోగించినా శత్రు సంహారం సాధ్యం కాలేదు.
అప్పుడు హేరంబ గణపతిని ధ్యానించి పరమాత్మ సారభూతమైన ఆ గణపతి శక్తిని పొంది దాన్ని తన బాణంలో నిక్షిప్తం చేసి శత్రువు మీదకు సంధించాడు శివుడు.
ఆ మరుక్షణంలోనే త్రిపుర సంహారం జరిగిపోయింది.
🌹విఘ్నరాజు ప్రభువులకే ప్రభువు.
ఆయనను ఉపాసించి సంసార సాగరం నుంచి, కష్టాల కడలి నుంచి సుఖంగా బయటపడవచ్చని శివుడు పార్వతికి తెలియచెప్పాడు.
🌹హేరంబ గణపతికి పది చేతులుంటాయి.
అభయముద్ర, వరదముద్ర, పాశం, దంతం, రుద్రాక్షమాల, పాశం, గొడ్డలి, ముద్గరం, దండం, పద్మాలను ఆ చేతులతో ధరించి ఉంటాడు.
తొండంతో మోదకాన్ని ధరించి సింహ వాహనాన్ని ఎక్కి ఉంటాడు.
ఈ స్వామికి ఐదు గజ ముఖాలుంటాయి.
ఈ స్వామిని ధ్యానిస్తే సర్వ శుభాలు, విజయాలు చేజిక్కుతాయి.
🌹హేరంబ గణపతిని భక్తిశ్రద్ధలతో ఆరాధించేవారికి ఆపదలుండవు.
ఈయనను నిత్యం పూజించేవారు దైర్యవంతులవుతారు, సర్వ శక్తివంతులవుతారు.
Comments
Post a Comment