హరిహరసుతనే శరణమయ్యప్ప

 హరిహరసుతనే శరణమయ్యప్ప 🙏

🌹మాతా-పితా-గురు-దైవమే శరణమయ్యప్ప 🙏


🌹కన్నెస్వాములు🙏


🌹దత్తాత్రేయుడి భార్య లీలావతి... పతి శాపంతో మహిషాసురుడి సోదరి మహిషి గా జన్మించింది. 


🌹ప్రజలను పట్టిపీడిస్తున్న మహిషాసురుని... లోకమాత సంహరించడంతో పతి శాపంతో మహిషిగా పట్టిన లీలావతి రాక్షసులకు రాజుగా సింహాసనం అదిష్ఠించింది.


🌹దేవతలపై ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేసి, శక్తులు పొందిన మహిషి ప్రజలను హింసించసాగింది. 


🌹హరిహరసుతుడు అయ్యప్ప మహిషితో యుద్ధం మొదలుపెడతాడు.

పశువైన మహిషి ఛాతి మీదకెక్కి అయ్యప్ప నృత్యం చేస్తాడు. 

ఈ నృత్యం చేసేది సాక్షాత్ హరిహర పుత్రుడేనని మహిషికి అర్దమై మణికంఠునికి సాష్టాంగ ప్రణామం చేసి మరణిస్తుంది.


🌹తనకు శాప విమోచనం లభించడంతో అయ్యప్పస్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది. 

ఆమె కోరికను విన్న స్వామి తిరస్కరిస్తాడు. 





🌹అయినా ఆమె పట్టువీడకపోవడంతో...

ఎప్పుడైతే నన్ను దర్శించడానికి కన్నెస్వామి రాడో అప్పుడు పెళ్ళి చేసుకుంటాను, అప్పటి వరకు బ్రహ్మచారిగానే ఉంటాను" అని చెప్తాడు


🌹వారి రాకకు గుర్తుగా శరంగుత్తిలో బాణాలు ఉంచుతారని, 

అక్కడ ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదో ఆనాడు పెళ్లాడతానని స్వామి మాట ఇస్తాడు.


🌹అంతేకాదు శబరి కొండల్లో నీవు #మాలికాపురోత్తమ అనే పేరుతో పూజలందుకుంటావని తెలిపారు. 


🌹మహిషి వధ చూసి మనసా, శిరసా నమస్కరించి పులిగా మారి అయ్యప్పకు వాహనంగా తనమీద కూర్చొపెట్టుకొని రాజ్యానికి తీసుకొని వెళ్తాడు మహేంద్రుడు.


🌹అయ్యప్ప దీక్షను తొలిసారిగా తీసుకున్న వారిని కన్నెస్వాములు అని అంటారు. 


🌹కన్నెస్వాములు రాక ఆగడం ఎప్పటికీ జరగనిదని పరమార్థం. 

ఎందుకంటే ఇది బ్రహ్మచారి అవతారం. 

ఇందులో భాగంగానే శబరిగిరికి వచ్చిన కన్నెస్వాములు ఎరుమేలి నుంచి తెచ్చిన బాణాలను శరంగుత్తిలో గుచ్చుతారు. 


🌹ఏటా మాలికాపురత్తమ్మ ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ బాణాలను చూసి నిరాశగా వెనుదిరుగుతుంది. 


🌹కన్నెస్వాములంటే స్వామికి ఎంతో ప్రీతి. 

అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ సన్నిధానంలో ఒక్క కన్నెస్వామి ఉండాలని కోరుకుంటారు. 


🌹మొదటిసారి దీక్ష చేపట్టేవాళ్లు కన్నెస్వాములు, రెండోసారి కత్తిస్వామి, మూడోసారి గంటస్వామి, నాలుగవసారి గధాస్వామి, ఐదవసారి తెరు స్వామి, ఆరోసారి గురుస్వాములుగా పిలుస్తారు.

                

భూతనాథ సదానంద సర్వభూత దయాపర |

రక్ష రక్ష మహాబాహ శాస్త్రేతుభ్యం నమోనమః 

                           

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు