లోకసాక్షి ఓం శ్రీ సూర్యనారాయణాయ నమో నమ:

 ఓం శ్రీ సూర్యనారాయణాయ నమో నమ:🙏


"ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధమారూఢమ్ ప్రచండం కశ్యపాత్మజమ్

శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్"


🌹భావం

ఆది దేవుడైన శ్రీ సూర్య నారాయణమూర్తికి నమస్కరిస్తున్నాను. 

ఏడు గుర్రాలు గల రధాన్ని ఎక్కినట్టివాడు, ప్రచండుడు, కశ్యప ప్రజాపతికి పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరించినట్టివాడు అయిన ఆ సూర్యభగవానుడికి ప్రణామములు అర్పిస్తున్నాను.

                            

🌹భగవంతుడు‬ లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. 

ఆయన ప్రత్యక్ష దైవం... లోకసాక్షి‬... జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాల నియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. 

సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. 

ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.


🌹ప్రత్యక్ష ‪నారాయణుడైన‬ సూర్యుడు పచ్చని ‪‎గుర్రాలను‬ పూన్చిన రథంలో ప్రయాణిస్తుంటాడు. 

ఈ పచ్చదనం లోకకల్యాణ సూచకం. 

దినస్పతి అని కీర్తిని అందుకుంటున్న సూర్యుడు ‪అహోరాత్రులు‬ తన ఏక చక్ర రథంపై ఈ పృథ్వీ చక్రాన్ని అంతటిని చుట్టి వస్తుంటాడు. 


🌹‪నిస్వార్ధ కర్మకు‬ తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. 

సర్వసమానత్వానికి కూడా ఆయన ప్రతీక. 

పూరిగుడిసె మీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన.

పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు.


🌹విధినిర్వహణలో కూడా ‪‎సూర్యుడే‬ అందరికి ఆదర్శం. 

ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. 

సృష్టిలోని సంపదకు, ‪‎విద్యావిజ్ఞానాలకు‬ ఆయనే మూలపురుషుడు.


🌹వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. 

ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. 




🌹సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. ‪‎

బుద్ధిని‬ ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది‪ గాయత్రీమంత్రం‬. 

ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. 

జీవుల పుట్టుక పోషణకూ అవసరమైనవన్నీ సూర్యుని వల్లే లభిస్తున్నాయి.

                  

"రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్| 

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం||

                              

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు