🌹శ్రీ శివ ద్వాదశ నామస్మరణ 🙏

 ఓం నమః శివాయ 🙏


🌹శివ అంటే మంగళం, భద్రం, కళ్యాణం, క్షేమం. 


🌹పరమశివునికి 63 లీలా స్వరూపములు ఉన్నాయి. 

వాటిలో అత్యంత ప్రస్తుతి చేయబడే స్వరూపం ఒకచేత "త్రిశూలం", ఒకచేత "ఢమరుకం" ధరించిన రూపం.


త్రైగుణ్యం శూలమే తస్య పరశు సత్య నిష్ఠతా

త్రిశూలం రూపంలో మూడు గుణములు ఆయన చేతిలో ఉంటాయి.


🌹"ఓ శివా నీకు నమస్కారము"🙏 అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము.


🌹శివనామము గంగ వంటిది. 

విభూతి యమున వంటిది. 

రుద్రాక్ష సర్వ పాపములను పోగొట్టే సరస్వతీనది వంటిది.


🌹 ఎవనియందు అత్యంత శుభకరములగు "శివనామము", "విభూతి", "రుద్రాక్షలు" అనే మూడు ఉండునో...

అట్టివాని దర్శన మాత్రము చేత త్రివేణీ సంగమంలో స్నానము చేసిన ఫలము లభిస్తుంది. 

వాని దర్శనము పాపములను పోగొట్టును. 


🌹ఈమూడు ఎవని శరీరమునందు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ సంగమ స్నానము వలన లభించు పుణ్యమును మరియొకవైపు ఉంచి... బ్రహ్మ పోల్చి చూసెను. 

రెండింటి ఫలము సమానముగ ఉండెను.


🌹శివనామము అనే దావాగ్ని యెదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికీ సత్యము.


🌹భవానీ శంకరులలో భవానీ అంటే శ్రద్ధ, శంకరుడంటే విశ్వాసం. 

ఈ ఇద్దరి సమ్మిళత స్వరూపమే జగత్తు.



    🌹శ్రీ శివ ద్వాదశ నామస్మరణ 🙏


ప్రథమస్తు మహాదేవో ద్వితీయస్తు మహేశ్వరః |

తృతీయః శంకరో జ్ఞేయశ్చతుర్థో వృషభధ్వజః || ౧ ||


పంచమః కృత్తివాసాశ్చ షష్ఠః కామాంగనాశనః |

సప్తమో దేవదేవేశః శ్రీకంఠశ్చాష్టమః స్మృతః || ౨ ||


ఈశ్వరో నవమో జ్ఞేయో దశమః పార్వతీపతిః |

రుద్ర ఏకాదశశ్చైవ ద్వాదశః శివ ఉచ్యతే || ౩ ||


ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |

కృతఘ్నశ్చైవ గోఘ్నశ్చ బ్రహ్మహా గురుతల్పగః || ౪ ||


స్త్రీబాలఘాతుకశ్చైవ సురాపో వృషలీపతిః |

ముచ్యతే సర్వపాప్యేభ్యో రుద్రలోకం స గచ్ఛతి || ౫ ||


                                            --- స్కాందపురాణము


                        

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు