Posts

Showing posts from March, 2026

💥శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏 💥"శ్రీ రామ ఆపదుద్ధారక స్తోత్రం" అపారమైన కష్టాలు, ఆపదలు మరియు శత్రు భయాల నుండి రక్షించే అత్యంత శక్తివంతమైన ప్రార్థన. ఇది శ్రీరాముడిని ఆపదల నుండి రక్షించే దేవుడిగా, సర్వ సంపదలను ప్రసాదించేవాడిగా వర్ణిస్తూ, భక్తులకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని మరియు విజయాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక ఆపదలు, భయాలు మరియు కష్టాలు తొలగిపోతాయి. ఇది శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది మరియు యుద్ధం లేదా కఠిన పరిస్థితులలో విజయాన్ని చేకూరుస్తుంది. శ్రీరాముడు సర్వ సంపదలకు అధిపతి కాబట్టి, ఈ స్తోత్రం దారిద్ర్యాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని ఇస్తుందని నమ్మకం. అగ్ని, నీరు, వ్యాధులు మరియు భూత ప్రేత పిశాచాల వంటి ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ స్తోత్ర పఠనం మనస్సులో ఉన్న ఒత్తిడిని, పాపాలను తొలగించి, అంతర్గత శాంతిని, శ్రీరాముని అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం స్నానాదికాలు ముగించి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, దీపం వెలిగించి పఠించడం శ్రేష్ఠం. నిత్యం పఠించడం వల్ల అధిక ఫలితం ఉంటుంది.  💥శ్రీరామ ఆపదుద్ధ...

💥చైత్ర శుక్ల నవమి.. శ్రీరామనవమి.

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏 💥 చైత్ర శుక్ల నవమి.. శ్రీరామనవమి . లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ । కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ॥ చైత్రశుక్ల నవమీ పునర్వసు నక్షత్రం మధ్యాహ్నము కర్కాటక లగ్నములో శ్రీరామచంద్రుడు అవతరించాడు. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరిగా వుండాలన్నది శాస్త్ర నియమం. శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేదం సైతం చెబుతొంది. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని షోడసోపచారాలతో పూజించి వడపప్పు, పానకం నైవేద్యం చేసి అందరికీ పంచడం ఏనాటి నుండో ఒక సాంప్...

💥దక్షిణామూర్తి స్వరూపులు సద్గురువులు

Image
 ⚜️🕉️🚩 ఓం గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏 💥 దక్షిణామూర్తి స్వరూపులు సద్గురువులు వాత్సల్యంతో చేరదీసి, మంచి మార్గాన్ని చూపి, మార్గదర్శకత్వాన్ని నెరపుతూ, అవసరమైనప్పుడు తన చేయూతను అందించేవాడే సద్గురువు. కొందరు గురువులు అత్యంత ప్రసన్నులై శిష్యులకు మార్గ దర్శనం చేస్తే, మరికొందరు అడుగడుగునా శిష్యులను పరీక్షలకు గురి చేస్తూ జ్ఞానమార్గంలోకి నడుపుతూ ఉంటారు. ఎవరి బోధనా విధానం వారిది. ఒక్క సారి ప్రియశిష్యునిగా స్వీకరించాక ఎటువంటి పరిస్థితులలోనూ అతనిని వదలక తనంతవానిగా తీర్చిదిద్దడానికి సద్గురువు అహరహమూ శ్రమిస్తూ ఉంటాడు. అందుకు ఉదాహరణ ఋభ, నిదాఘుల వృత్తాంతం. 💥ఋభుడు బ్రహ్మ మానస పుత్రుడు. పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాన సంపన్నుడతడు. అతనికి పులస్త్య ప్రజాపతి కొడుకైన నిదాఘుడు అనే ప్రియశిష్యుడు ఉండేవాడు.  గురుకృపతో నిదాఘుడు అశేషమైన విజ్ఞానాన్ని సంపాదించాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తన తండ్రి పులస్త్య బ్రహ్మచే నిర్మితమైన సుందర, సుసంపన్నమైన వీరనగరం అనే పట్టణంలో గృహస్థ జీవితం గడుపుతూ, ధార్మిక ప్రవృత్తితో జీవించసాగాడు. ఇది కృత యుగం నాటి మాట ఆ కాలంలో మానవులు వేల సంవత్సరాలు జీవించేవారట. అలా ఒక వెయ్యి సంవత్...

ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 ఓంకారమాద్యం ప్రవదంతి సంతోవాచః శ్రుతీనామపి యం గృణంతి గజాననం దేవగణానతాంఘ్రిం భజే�హమర్ధేందు కృతావతంసం॥ 'మహాత్ములు ఏ మూర్తిని ఆది నాదమైన ఓంకారంగా భావిస్తారో, వేద రుక్కులన్నీ ఏ దేవుడిని నుతిస్తాయో, దేవతలందరూ ఎవరి పాదాలకు తలలు వంచి నిత్యం నమస్కరిస్తారో అటువంటి గజాననుణ్ని, నెలవంకను తలదాల్చిన స్వామిని సేవిస్తున్నాను’ అని పై శ్లోకార్థం.  గణపతి ప్రణవ స్వరూపుడు. ఆది పూజలు అందుకొనే తొలివేలుపు. వినాయకుడి వక్రతుండం ఓంకారానికి ప్రతీక. శూర్పకర్ణుడు అంటే చేటల వంటి చెవులున్న వాడు అని అర్థం. ఏది ఆర్తితో కోరినా శ్రద్ధతో వింటాడు. లంబోదరుడు అంటే అందరినీ తన పొట్టలో పెట్టుకుని కాపాడుకునేవాడని భావం. ‘త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి’ అని గణపతిని పరబ్రహ్మ స్వరూపంగా అధర్వశీర్షం అభివర్ణిస్తున్నది. త్రిమూర్తులకు అతీతమైన తత్త్వం గణపతిది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే॥ సకల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి ఆయనే కాబట్టి, ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతిని తలుచుకుంటారు. ప్రకృతి స్వరూపమైన పరమశివుడికి, సృష్టి చైతన్యానికి మూలమైన అమ్మవారిక...

ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏 పార్వతీపరమేశ్వరులు ఒకరోజు ఎత్తైన ఋషిపర్వతం మీద విహరిస్తుండగా, అచ్చట ఉన్న ఎందరో మహర్షులు, యోగులు, ఋషులు వీరికి ప్రణమిల్లగా,  బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు అనే బాలుడు అహంబ్రహ్మస్మి స్థితిలో ఉండి, వీరిని ప్రత్యేకంగా గుర్తించక, కదలక ఆత్మస్థితిలో బ్రహ్మానందంలో ఉండడం చూసి, ఆహా! ఎంతటి గొప్ప స్థితి అని శివుడు పార్వతితో చెప్తూ, సనత్కుమారుని చెంత నిలిచి, ''ఏమయ్యా! జగత్తుకే మాతాపితురలం కదా, మమ్మల్ని పలకరించవేమిటి?" అని అడుగగా.. 'అంతటా బ్రహ్మమే కనబడుతున్న నాకు మీరు వేరుగా తోస్తే కదా, పలకరించడానికి'... అని బదులిస్తాడు. "నీకో వరం ఇస్తాం, ఏమి కావాలో కోరుకో" అని శివుడు అనగా, 'వరం ఇవ్వడానికి నువ్వొక్కడివి, తీసుకోవడానికి నేనొకడిని అని ఉంటే కదా...ఉన్నదంతా ఒక్కటే కాబట్టి నాకే వరమూ వద్ద'నెను. శివుడు లోలోపల ఈయన అద్వైత జ్ఞానస్థితికి ముగ్ధుడౌతు, "అయితే శాపం ఇస్తాను" అని అనెను. 'వరమూ, శాపమూ అని రెండున్నాయా? వరమైతే సుఖమూ, శాపమైతే దుఃఖమూ అని రెండు లేనప్పుడు, నీవు ఏది ఇస్తే నాకేమిటి...సరే, శాపమిచ్చిన ఈ శరీరానికే గాని, నాకు ...

చంద్రశేఖరాష్టకం.

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥చంద్రశేఖరాష్టకం మార్కండేయ మహర్షి రచించిన అత్యంత శక్తివంతమైన శివ స్తోత్రం. ఇది మృత్యు భయాన్ని పోగొట్టి, అకాల మరణం నుండి రక్షించి, ఆయురారోగ్యాలను మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. శివుని శరణు వేడుకుంటూ, యముడిని కూడా జయించవచ్చనే నమ్మకాన్ని ఈ స్తోత్రం కలిగిస్తుంది. యమపాశం నుండి మార్కండేయుడిని రక్షించినట్లుగా, ఈ స్తోత్ర పారాయణ అకాల మృత్యువును, మృత్యు భయాన్ని పోగొడుతుంది. రోజుకు ఒకసారి పఠించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తగ్గి, పూర్ణ ఆయుష్షు లభిస్తుందని నమ్మకం. పరమశివుని చంద్రశేఖర స్వరూపాన్ని (చంద్రుడిని తలపై ధరించినవాడు) ధ్యానించడం వల్ల మనశ్శాంతి, శత్రువుల నుండి, కష్టాల నుండి రక్షణ కలుగుతుంది. ఈ అష్టకాన్ని భక్తితో పఠించడం వల్ల అష్టైశ్వర్యాలు, సంపదలు కలుగుతాయి. అంతిమంగా శివసాయుజ్యాన్ని లేదా ముక్తిని పొందేందుకు ఈ స్తోత్రం సహాయపడుతుంది. ఈ స్తోత్రాన్ని శివాలయంలో లేదా ఇంట్లో ప్రశాంతమైన సమయంలో, ముఖ్యంగా కార్తీకమాసంలో, సోమవారాల్లో పఠించడం చాలా విశేషం. 💥 చంద్రశేఖరాష్టకం💥 చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ । చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ (2) ...

💥శ్రీరామ రక్షాస్తోత్రం..

Image
 ⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయ జయ రామ 🌹🙏 💥శ్రీరామ రక్షాస్తోత్రం.. ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామ చంద్రోదేవతా అనుష్టుప్ ఛందః సీతా శక్తిః శ్రీమద్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ॥ ధ్యానం ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ । వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ॥ స్తోత్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ । ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ॥ 1 ॥ ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ । జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ ॥ 2 ॥ సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్ । స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ ॥ 3 ॥ రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ । శిరో మే రాఘవః పాతు ఫాలం (భాలం) దశరథాత్మజః ॥ 4 ॥ కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియః శృతీ । ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ 5 ॥ జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః । స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ 6 ॥ కరౌ సీతాపతిః పాతు హృదయం...

💥మహా విష్ణు స్తోత్రం - గరుడగమన తవ💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥మహా విష్ణు స్తోత్రం - గరుడగమన తవ💥 గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యమ్ । మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ ధ్రు.॥ జలజనయన విధినముచిహరణముఖ విబుధవినుత-పదపద్మ మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 1॥ భుజగశయన భవ మదనజనక మమ జననమరణ-భయహారిన్ మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 2॥ శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోక-శరణ మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 3॥ అగణిత-గుణగణ అశరణశరణద విదలిత-సురరిపుజాల మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 4॥ భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీతీర్థం మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 5॥ ఇతి జగద్గురు శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థస్వామినా విరచితం మహావిష్ణుస్తోత్రం సంపూర్ణమ్ । ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

💥అన్నదాన మహిమ!

Image
 ⚜️🕉️🚩ఓం అన్నపూర్ణాయై నమః🌹🙏 💥 అన్నదాన మహిమ! పూర్వం ఓ బ్రాహ్మణుడుండేవాడు. వేళగాని వేళ తన యింటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగక పోయినా సరే, ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒక వేళ ఇంటికెవరూ రాకపోతే, వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం జరిగాక, ఒకనాడాయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవళ్ళను అడిగినా చెప్పలేకపోయారు. ఒకాయన "అన్నదాన మహమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే, కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే, స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే , అడిగి తెలుసుకోండి” అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య ఐన పార్వతీదేవి అన్నమాట.ఆవిడకు కూడా అన్నదానమంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మడు కాశీ వెళ్లి గంగ ఒడ్డున కూచుని పార్వతీ దేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు. దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై ‘నీకేం కావాలి?’ అని అడిగింది. బ్రాహ్మడు సాష్టాంగ నమస్కారం చేసి, ”అన్నపూర్ణాదేవీ, నాకేమీ కోరిక లేదు. కాని, అన్నదాన మహమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈసంగ...

💥చైత్ర శుద్ధ పాడ్యమి.. ఉగాది

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏  💥 చైత్ర శుద్ధ పాడ్యమి.. ఉగాది యుగం అంటే రెండు లేదా జంట అని అర్ధం. "ఉత్తరాయణం" "దక్షిణాయణం" అనబడే ”అయన” ద్వయమే యుగం. (పరోక్షంగా సంవత్సరం) యుగానికి ఆది కాబట్టి ”యుగాది” అయింది. కాల క్రమంలో ”ఉగాది”గా మారింది. బ్రహ్మ ఈ రోజునే సృష్టి మొత్తం చేసాడని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గాధల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు. తనకు సహాయము చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుని కోరగా విష్ణు మూర్తి మత్యవతారములో వెళ్లి సముద్రములో ఉన్న సోమకాసురుడుని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు. అలా బ్రహ్మకు వేదాలను చైత్రశుద్ద పాడ్యమి రోజున అప్పగించారు కాబట్టి అలానే అదే రోజు నుండి బ్రహ్మ సృష్టి ఆవిర్భావాన్ని మొదలు పెట్టారు విక్రమాదిత్యుడు, శాలివాహనుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే పట్టాభిషిక్తులైనారని పెద్దలు చెబుతారు.  శాలివాహన శకానికి యుగకర్తగా నిలిచిన శాలివాహన చక్రవర్తి స్మృత్యర్థమే ఉగాది వచ్చింది అనేది చారిత్రక భావన. ఉగాది కాలానికి సంకేతం. 'కాల’లో, ‘కా’ అనగా శుభములను, ‘ల’ అనగా అందించునది అని అ...

శ్రీస్వామినాథ పంచకం💥తెలుగు తాత్పర్యం

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రమైన "స్వామిమలై"లో కొలువైన స్వామినాథ స్వామిని (మురుగన్) స్తుతిస్తూ శ్రీ అనంతరామ దీక్షితర్ ఈ "శ్రీ స్వామినాథ పంచకం" రచించారు. తన తండ్రి అయిన పరమశివుడికే ప్రణవ మంత్రార్థాన్ని (ఓంకార రహస్యాన్ని) ఉపదేశించిన గురువుగా ఇక్కడ స్వామిని కొలుస్తారు.  పరమశివుడికే గురువుగా వ్యవహరించిన "జ్ఞాన పండితుడు" కాబట్టి, ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల విశేషమైన జ్ఞానం మరియు బుద్ధి కుశలత కలుగుతాయి. భయంకరమైన రోగాలను (రౌద్ర రోగాలను) నివారించే శక్తి ఈ పంచకానికి ఉంది. ముఖ్యంగా శారీరక రుగ్మతల నుండి రక్షణ కోరుతూ భక్తులు దీనిని పారాయణం చేస్తారు. స్వర భేదాలు లేదా మాటల్లోని లోపాలను సరిచేసి స్పష్టమైన వాక్కును ప్రసాదిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజూ ఉదయాన్నే భక్తితో ఈ స్తోత్రాన్ని పఠించే వారికి అష్టసిద్ధులు మరియు సకల మంగళాలు కలుగుతాయని దీని ఫలశ్రుతి చెబుతోంది. స్వామిమలైలోని 60 మెట్లు, 60 తెలుగు సంవత్సరాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ మెట్లపై కొలువైన స్వామినాథుని కీర్తిస్తూ సాగే ఈ స్తోత్రం అత్యంత మధురమైనద...

💥నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 పతంజలి మహర్షి రచించిన నటరాజ స్తోత్రం (చరణశృంగరహిత స్తోత్రం), చిదంబరంలోని నటరాజ స్వామి ఆనంద తాండవానికి అక్షరరూపం. ఇందులో 9 శ్లోకాలలో 108 శివనామాలు ఉంటూ, "కు, తు, పు" వంటి సంయుక్త అక్షరాలు (కొమ్ములు) లేకుండా అత్యంత విశిష్టంగా, లయబద్ధంగా సాగుతుంది. ప్రదోష సమయంలో ఈ స్తోత్ర పఠనం శివసాయుజ్యాన్ని, చిత్తశుద్ధిని ప్రసాదిస్తుందని నమ్మకం ఈ స్తోత్రంలో కు, తు, పు వంటి 'కొమ్ములు' (దీర్ఘస్వరాలు లేని) అక్షరాలు ఉండవు. అందుకే దీనిని 'చరణశృంగరహితం' అంటారు. ఇది వ్యాకరణబద్ధంగా, అద్భుతమైన లయతో కూడి ఉంటుంది. ఆదిశేషుని అవతారమైన పతంజలి మహర్షి, చిదంబర క్షేత్రంలో నటరాజ స్వామి యొక్క ఆనంద తాండవాన్ని ప్రత్యక్షంగా దర్శించి, స్వామి పాద విన్యాసాలకు అనుగుణంగా, స్తోత్రం ద్వారా ఆ నృత్యాన్ని వర్ణించారు. ఈ స్తోత్రంలో శివుని తాండవం, ఆనందమయ స్వరూపం, త్రిపుర భంజన రూపం, తలపై చంద్రుడు, అగ్నిహస్తం, భస్మధారణ వంటి నటరాజ స్వామి రూప విశేషాలు కళ్ళకు కట్టినట్లు వివరించబడ్డాయి. చిదంబర నటరాజ ఆలయంలో ఇప్పటికీ ప్రతిరోజూ, ముఖ్యంగా ప్రదోష సమయంలో ఈ స్తోత్రంతోనే స్వామికి అర్చన జరుపుతారు. ఈ స...

శ్రీరామ జయ రామ జయజయ రామ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🌹🙏 💥సత్యం, ధర్మాన్ని ఆచరించిన శ్రీరామచంద్రుడిని మూడు సంధ్యల్లో మనస్ఫూర్తిగా ధ్యానించడం వల్ల సకల సమస్యలు తీరి ప్రశాంతతని పొందుతారని పండితులు చెబుతారు. మూడు పూటలా రాముడి శ్లోకం చదవడం ద్వారా మనస్సు శుద్ధి జరగడంతో పాటూ కష్ట నష్టాలు ఇబ్బందులు తొలగి ప్రశాంతతని, విజయాన్ని పొందుతామని చెబుతారు.  -- ఇవే ఆ శ్లోకాలు...  ("శ్రీరామ కర్ణామృతం" నుంచి సేకరించిన శ్లోకాలివి) 💥 ఉదయం చదవాల్సిన శ్లోకం: ధ్యాయే ప్రాతస్సురేశం రవికులతిలకం రంజితానంతలోకం బాలం బాలారుణాక్షం భవముఖవినుతం భావగమ్యం భవఘ్నమ్, దీప్యంతం స్వర్ణక్లప్తై ర్మణిగణనికరై ర్భూషణై రుజ్జ్వలాంగం కౌసల్యాదేహజాతం మమ హృదయగతం రామ మీషత్ స్మితాస్యమ్ భావం: దేవతలకు అధిపతి అయిన వాడు, సూర్యవంశ శ్రేష్ఠుడు, ఎల్ల లోకాలనూ ఆనందింప జేయువాడు, బాలుడు, లేతసూర్యుని పోలిన ఎఱ్ఱనైన నేత్రములు కలిగినవాడు, హృదయంలో ధ్యానింపదగినవాడు, సంసారబాధను పోగొట్టువాడు, శ్రేష్ఠుడు, మణులు పొదగబడిన కనకాభరణములతో ప్రకాశించువాడు, కౌసల్య కుమారుడు, నా హృదయందున్నవాడు, చిరునవ్వు మోమువాడు అయిన రాముని ప్రాతఃకాలమందు ధ్యానం చేస్తున్నాను. 💥 మధ్యాహ్నం చదవ...

ఓం నమో వేంకటేశాయ🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥శ్రీమన్నారాయణుని చరణారవిందాల ఘనతను వర్ణించిన అన్నమయ్య కీర్తనను గురించి తెలుసుకుందాం.. ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది - అన్నమయ్య పల్లవి: ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది చరణములు: ఈ పాదమే కదా యిందఱును మ్రొక్కెడిది యీ పాదమే కదా యీ గగనగంగ పుట్టినది యీ పాదమే కదా యెలమిఁ బెంపొందినది యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది ఈ పాదమే కదా యిభరాజు దలఁచినది యీ పాదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది యీ పాదమే కదా యీ బ్రహ్మ గడిగినది యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది యీ పాదమే కదా యిల నహల్యకుఁ గోరికైనది యీ పాదమే కదా యీక్షింప దుర్లభము యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది 💥కీర్తన భావ సౌరభం: ఈ పాదమే కదా వామనావతారంలో భూమండలమంతా కొలిచింది! ఈ పాదం నుండే గంగ పుట్టి విష్ణు పాదోద్భవ అయింది. ఆ గంగను బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడట.  వామనావతారంలో శ్రీ హరి తన రెండవ అడుగుగా ఆకాశాన్ని కొలిచినప్పుడు బ్రహ్మ తన దగ్గరున్న గంగతో ఆయన పాదం కడగడం వలన బ్రహ్మకడిగిన పాదమైంది. ఈ పాదం అనంతమైనది. ఇంద్రాది దేవతలకు ఆ అడుగే ఇడు...

💥శ్రీ పంచాయుధ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩ఓం నమో నారాయణాయ 🌹🙏 "పంచాయుధ స్తోత్రం" శ్రీ మహావిష్ణువు యొక్క ఐదు దివ్యాయుధాలను (సుదర్శన చక్రం, పాంచజన్యం, కౌమోదకి, నందకం, శార్ఙ్గం) కీర్తించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ఇది భక్తులకు శత్రు భయం, భూత ప్రేత బాధలు, ఆరోగ్య సమస్యలు మరియు అపమృత్యువు నుండి సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది. నిత్య పారాయణ వల్ల ఆత్మస్థైర్యం, ధైర్యం పెరిగి, విజయం సిద్ధిస్తుందని ప్రతీతి. 💥 శ్రీ పంచాయుధ స్తోత్రం💥 స్ఫురత్సహస్రారశిఖాతితీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యమ్ । సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 1 ॥ తాత్పర్యము: రంపమునకు చివర సూదిగ ముళ్ళవలె నుండు పదునైన భాగమును ‘ఆకు’ లేక ‘అర’ అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్ని శిఖలను క్రక్కుచూ మిరుమిట్లు గొలుపు కాంతులీను ఓ ”సుదర్శన చక్రమా!” ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళవిగ్రహము కల్గి, దివ్య సౌందర్య రాశియగు స్వామిని దర్శింపజేయుచున్నావు, కోట్ల సూర్యులుదయించినపుడు ఉండెడి కాంతితో సాటియగు ప్రకాశము నీకున్నది. భగవదాజ్ఞానువర్తులగు దేవతలను హింసించు పాపుల ప్రాణములను సమూలంగ పెకలించి నశింపజేయుచున్నావు. సర్వవ్యాపియగు శ్రీమహావిష్ణువు యొక్క దక్షిణ...

భవానీ అష్టకం💥 తాత్పర్య సహితం..

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥భవానీ అష్టకం💥 తాత్పర్య సహితం.. న తాతో న మాతా న బంధుర్న దాతా న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 1 ॥ తాత్పర్యం:  అమ్మా ! ఓ భవానీ ! నాకు తల్లిగానీ, తండ్రిగాని, కొడుకు గాని, కూతురు గాని, యజమాని గాని, సేవకుడు గాని, బంధువు గాని, భార్య గాని, విద్య గాని, వృత్తిగాని ఏదియు లేదు కేవలం నీవే నాకు దిక్కు. నాకు దిక్కు. భవాబ్ధావపారే మహాదుఃఖభీరు పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః కుసంసారపాశప్రబద్ధః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 2 ॥ తాత్పర్యం:  అమ్మా! భవానీ! కామాంధుడనై, లోభినై, మత్తుడనై, జన్మపాశ బద్ధుడనై భరించలేని దుఖ్ఖముతో మిక్కిలి భయాన్వితుడనై, సంసార సాగరమున మునిగి పోయాను. తల్లీ నీవు తప్ప నాకు ఎవరు దిక్కులేరు. నీవే దిక్కు. న జానామి దానం న చ ధ్యానయోగం న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రం న జానామి పూజాం న చ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 3 ॥ తాత్పర్యం:  అమ్మా ! భవానీ ! ధనము, ధాన్యము, మంత్రము, యంత్రము, పూజ, పునస్కారము, న్యాసము, యోగము ఇవి ఏవి నాకు తెలీదు. తల్లీ నీవు ...

గురు స్వరూపం.. హయగ్రీవుడు!

Image
 ⚜️🕉️🚩ఓం హయగ్రీవాయ నమః🌹🙏 గురు స్వరూపం.. హయగ్రీవుడు! భగవంతుడే అందరికీ ఆది గురువు. ఒక్కో దేవతకూ ఒక్కో గురు స్వరూపం ఉంది. పరమేశ్వరుడిని గురువుగా భావిస్తే దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తాడు. అమ్మవారిని గురువుగా కొలిస్తే శారదగా జ్ఞానం ప్రసాదిస్తుంది. విష్ణుమూర్తిని గురువుగా పూజిస్తే.. హయగ్రీవుడుగా కరుణిస్తాడు. నారాయణుడు ధరించిన అనేక అవతారాల్లో.. గురు స్వరూపం హయగ్రీవుడు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం  | ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||     వ్యాఖ్యా ముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్నస్పటికరుచిరే పుండరీకే నిషణ్ణః | అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః || కాలానికి అందనివాడు. సృష్టికి ముందున్నవాడు హయగ్రీవుడు. బ్రహ్మదేవుడికి సృష్టి చేయడానికి వేదాలు అవసరం. ఆ వేదాల సంరక్షణ కోసం విష్ణుమూర్తి శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవుడిగా అవతరించాడు. తెల్లని రూపం వాడు, జ్ఞాన-అజ్ఞానాల్ని తేటతెల్లం చేసే చల్లని దేవుడు హయగ్రీవుడు. శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. ఈ అవతారంలో స్వామి వేదాలను ఉద్ధరించారు. అందువల్ల,...

కాటమరాయుడా ... కదిరీ నరసింహుడా !

Image
 ⚜️🕉️🚩 ఓం లక్ష్మీనృసింహాయ నమః 🌹🙏 💥 కాటమరాయుడా ... కదిరీ నరసింహుడా ! దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలుగు రాష్ట్రాలలో నరసింహ స్వామి ఆరాధన కనిపిస్తుంది. నవనారసింహ క్షేత్రాలతో పాటుగా ఆయనకు అడుగడుగునా పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తాయి. వాటిలో ఒకటే కదిరి. అక్కడ కొలువైన స్వామి పేరే #కాటమరాయుడు! అనంతపురం జిల్లా కదిరి పట్నంలో వెలసిన లక్ష్మీనరసింహునికి ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. నరసింహస్వామి స్తంభంలోంచి వెలువడి హిరణ్యకశిపుని చంపింది ఇక్కడే అని భక్తుల నమ్మకం. కదిరి సమీపం లోని గొడ్డువెలగల గ్రామంలోనే ఈ సంఘటన జరిగిందంటారు. అక్కడ ఖదిర అనే చెట్టు కలపతో చేసిన స్తంభం నుంచి చీల్చుకుని విష్ణుమూర్తి, హిరణ్యకశిపుని సంహరించాడట. ఆ చెట్టు పేరు మీదుగానే ఈ ప్రాంతాన్ని కదిరి అని పిలుచుకోసాగారని స్థలపురాణం చెబుతోంది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత, నరసింహస్వామి ఉగ్రరూపంలోనే సంచరిస్తూ ఓ కొండమీద విశ్రమించాడు. ఆ సమయంలో దేవతలంతా ఆయన వద్దకు చేరి తమ స్తోత్రాలతో ఆయన కోపాన్ని ఉపశమించే ప్రయత్నం చేశారు. వారి స్తోత్రాలకు ప్రసన్నుడైన స్వామి అక్కడే విగ్రహరూపంలో నిలిచిపోయాడు. అలా దేవతల స్తోత్రాలతో పునీతం అయ్యింది కాబట్...

శ్రీ ఆంజనేయం 🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 రావణవధ జరిగిన అనంతరం, లోకాలకు దుష్టరాక్షసపీడ విరగడైందని శ్రీరామచంద్రుడు తృప్తిపడుతున్న సమయంలో ఆకాశవాణి ఈ తీరుగా పలికింది.  “శ్రీరామచంద్రా! రావణసంహారం జరిగిందని నువ్వు తృప్తి పడుతున్నావు. అంతటితో నీ కర్తవ్యం ముగియలేదు. గగనతలాన వేలవేల యోజనాల దూరంలో శతకంఠుడనే రాక్షసుడు తిరుగుతున్నాడు. కడు దుష్టుడైన ఆ రాక్షసుడు, మహాబలశాలి. ఎవరినైనా ఎదిరించి నిలువగల అసాధ్యుడు. నువ్వు వాడిని కూడ సంహరించితేనే నీ అవతారానికి పూర్ణత్వము సిద్ధించినట్లవుతుంది” ఆకాశవాణి పలుకులను విన్న రాముడు దీర్ఘాలోచనలో పడి, చివరకు ఆ రాక్షస సంహారానికి అంజనేయుడే తగినవాడని నిర్ణయించి, హనుమను పిలిచి, “హనుమా! ఆకాశవాణి పలుకులను విన్నావు కదా! రావణ సంహార విషయంలో నీవెంతో సాయపడ్డావు. శతకంఠుని సంహార విషయం గురించి కాస్త ఆలోచించు, ఇందుకు నువ్వు సమర్థుడవు" అని ప్రేరేపించాడు. శ్రీరామ ఆజ్ఞను తలదాల్చిన ఆంజనేయుడు శతకంఠుని సంహరించే కార్యక్రమానికి ఉపక్రమించాడు. వెంటనే తన తోకను వేయి యోజనాల దూరానికి పెంచాడు. తన రూపాన్ని విపరీతంగా పెంచడంతో, సముద్రాలన్నీ కప్పి వేయబడి, భువి నుంచి దివికి దారి ఏర్పడటమేకాక, ఆకాశంలో నక్షత...

శివ భుజంగ ప్రయాత స్తోత్రం

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 ఆదిశంకరాచార్యులచే రచించబడిన "శివ భుజంగ ప్రయాత స్తోత్రం" అత్యంత శక్తివంతమైనది. ఇది శివునిపై భక్తి, జ్ఞానం, మరియు ముక్తిని ప్రసాదిస్తుందని నమ్మకం.  పాము నడక వలె సాగే (భుజంగ ప్రయాత) ఛందస్సులో ఉన్న ఈ స్తోత్ర పారాయణ వల్ల మానసిక ప్రశాంతత, భయాలు తొలగడం మరియు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. 💥 శివ భుజంగ ప్రయాత స్తోత్రం విశిష్టతలు: జ్ఞాన ప్రదాత: ఇది పరమశివుని జ్ఞాన స్వరూపుడిగా, సచ్చిదానంద రూపుడిగా వర్ణిస్తుంది. ముక్తి మార్గం: ఇది శంకరాచార్యులచేత, తన తల్లికి ముక్తిని ప్రసాదించమని శివుని ప్రార్థిస్తూ, ఆమె అంత్యకాలంలో స్వర్గలోక ప్రాప్తి కోసం చెప్పబడింది. మానసిక ప్రశాంతత & భక్తి: ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా హృదయంలో భక్తి జనించి, మనసు నిర్మలంగా మారుతుంది. ఆపద నివారణ: ఇది భక్తుల కష్టాలను, ఆపదలను, భయాలను తొలగించి, రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు. యోగ సాధన: ఇది హఠయోగం, కుండలినీ శక్తి, సహస్రార పద్మం వంటి యోగ ప్రక్రియలను కూడా ప్రస్తావిస్తుంది, తద్వారా సాధకులకు ఆధ్యాత్మిక పురోగతిని కలిగిస్తుంది. ఈ స్తోత్రం తరచుగా ప్రదోష కాలంలో లేదా సోమవారం శివునికి అభి...

💥సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏 సూర్య అష్టోత్తర శత నామ స్తోత్రం సూర్య భగవానుని 108 నామాలతో కూడిన అత్యంత శక్తివంతమైన ప్రార్థన. ప్రతిరోజూ ఉదయం దీనిని పఠించడం వల్ల శారీరక ఆరోగ్యం (వ్యాధుల నుండి విముక్తి), మానసిక బలం, తేజస్సు, సంపద మరియు విజయం లభిస్తాయి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వ్యక్తి చుట్టూ రక్షా కవచాన్ని ఏర్పాటు చేసి, ప్రతికూలతను తొలగిస్తుందని నమ్ముతారు.  అరుణ, శరణ్య, కరుణారససింధు, ఆదిత్య, ఆత్మజ్ఞ, భాస్కర వంటి నామాలతో సూర్యుని సద్గుణాలను స్మరించడం శ్రేయస్కరం. 💥సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రం💥 అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే । అసమానబలాయాఽఽర్తరక్షకాయ నమో నమః ॥ 1 ॥ ఆదిత్యాయాఽఽదిభూతాయ అఖిలాగమవేదినే । అచ్యుతాయాఽఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః ॥ 2 ॥ ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయైంద్రాయ భానవే । ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః ॥ 3 ॥ ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే । వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః ॥ 4 ॥ ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే । ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః ॥ 5 ॥ ఊర్జస్వలాయ వీరాయ నిర్జరాయ జయాయ చ । ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః ॥ 6 ॥ ఋషివంద్యాయ రుగ్ఘంత్రే ఋక్షచక్రచరాయ చ ...

💥శ్రీవేంకటేశ్వర మంగళాష్టకం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 "శ్రీ వేంకటేశ్వర మంగళాష్టకం" ప్రతివాది భయంకరం అణ్ణన్ రచించిన అత్యంత పవిత్రమైన స్తోత్రం, ఇది వేంకటేశ్వరుని కళ్యాణ గుణాలను కీర్తిస్తూ, నిత్యం పఠించడం ద్వారా సకల శుభాలు, శ్రేయస్సు, మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. శ్రీవారి దివ్య రూపం, లక్ష్మీ సమేతుడైన స్వామికి మంగళం పాడటం ద్వారా భక్తి, శాంతి చేకూరుతాయి.  💥 శ్రీవేంకటేశ్వర మంగళాష్టకం 💥 శ్రీక్షోణ్యౌ రమణీయుగం సురమణీపుత్రోఽపి వాణీపతిః పౌత్రశ్చంద్రశిరోమణిః ఫణిపతిః శయ్యా సురాః సేవకాః । తార్క్ష్యో యస్య రథో మహశ్చ భవనం బ్రహ్మాండమాద్యః పుమాన్ శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ ॥ 1 ॥ యత్తేజో రవికోటికోటికిరణాన్ ధిక్కృత్య జేజీయతే యస్య శ్రీవదనాంబుజస్య సుషమా రాకేందుకోటీరపి । సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ ॥ 2 ॥ నానారత్న కిరీటకుండలముఖైర్భూషాగణైర్భూషితః శ్రీమత్కౌస్తుభరత్న భవ్యహృదయః శ్రీవత్ససల్లాంఛనః । విద్యుద్వర్ణసువర్ణవస్త్రరుచిరో యః శంఖచక్రాదిభిః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ ॥ 3 ॥ యత్ఫాలే మృగనాభిచారుతిలక...

ఓం దుర్గాయై నమః🌹🙏

Image
 ⚜️ 🕉️🚩ఓం దుర్గాయై నమః🌹🙏 అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మా సురారులమ్మ కడుపారాడి బుచ్చినయమ్మ తన్ను లో నమ్మిన వెలుపుతమ్మల మనంబుల నుండెడి యమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు !!                            --- మహాకవి పోతన, ఆంధ్ర భాగవతం. అన్ని తల్లులకు (మనం తల్లులు అని పిలిచే అన్ని దేవతలకు) తల్లి అయిన, త్రిమూర్తుల (మహా లక్ష్మి, మహా కాళి, మహా సరస్వతి) మూలమైన, సర్వశక్తిమంతురాలు మరియు సర్వవ్యాప్తి చెందిన, రాక్షసుల తల్లిని నానాటికీ ఏడిపించే, దేవతల (సప్త మాతృ) చేత ఎల్లప్పుడూ స్తుతించబడే మరియు వారి హృదయాలలో నివసించే మాతృ శక్తి మాత, నా తల్లి మరెవరో కాదు, కరుణా సముద్రమైన దుర్గా దేవి. ఆమె దయతో నాపై శక్తి, జ్ఞానం, బలం మరియు శ్రేయస్సును కురిపిస్తుంది. 💥 కీలాద్రికి దుర్గాదేవి సందర్శనం: కృతయుగంలో, కీల అనే ఆదిశక్తి భక్తుడు ఉండేవాడు - ఒక గంధర్వుడు, అతను ఆదిశక్తి కోసం గొప్ప తపస్సు చేసాడు. దేవత సంతోషించి అతనికి ఒక వరం ఇచ్చింది. దానికి అతను ఆమెను తన హృదయంలో శాశ్వతంగా ఉండమని కోరాడు. ఆదిశక్త...