గోదాదేవి🙏 (ఆండాళ్)

  ఓం శ్రీ మాత్రే నమః 🙏


🌹గోదాదేవి🙏 (ఆండాళ్)

🌹 శ్రీమహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది.


🌹 శ్రీవిల్లిపుత్తూరు లో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు. 

విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. 

నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది.

కాబట్టి ఆయనకు ఆ బిరుదు దక్కింది.


🌹ఆయన అక్కడి ఆలయంలోని ప్రధాన దైవం అయిన శ్రీకృష్ణునికి నిత్యం పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు. 


🌹ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. 

ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి... ఆమెకు #కోదై అని పేరు పెట్టి పెంచుకోసాగాడు.


🌹తమిళంలో కోదై అనగా "తులసి మాల" అని అర్థం.

తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు. 

క్రమేపి ఆపేరే గోదా గామారింది.



🌹గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగింది. 

యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. 


🌹తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. 


🌹అంతేకాదు... తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. 


🌹ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడింది. 

తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. 


🌹కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.


🌹దానితో విష్ణుచిత్తులవారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి, నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ #ఆండాళ్ అని పిలవటం మొదలుపెట్టాడు. 

ఆండాళ్ అంటే కాపాడటానికి వచ్చినది అని అర్థం.


🌹 గోదా మనసులో తనకు పెళ్లంటూ జరిగితే స్వామితోనే జరగాలని అనుకుంది. 


🌹అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన #కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. 


🌹గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా 

తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు...

తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది.


🌹 ఆ "30 పాశురాలు" ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై.


🌹కృష్ణుడు విష్ణుచిత్తునికి కనిపించి, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. 


🌹శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. 


🌹పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి, అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. 


🌹ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. 

అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి, విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.

               

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు