ఓం నమో భగవతే రమణాయ నమః🙏
ఓం నమో భగవతే రమణాయ నమః 🙏
🌹భగవాన్ శ్రీ రమణుల జయంతి🙏
🌹"నాకు జ్ఞానోదయం కావాలి స్వామీ
నేను అజ్ఞానిని" అని ఒక భక్తుడు రమణుల్ని ఆశ్రయించాడు.
‘నువ్వు అజ్ఞానివా, ఆ విషయం నీకు నిజంగా తెలుసా’ అని రమణులు అతణ్ని ప్రశ్నించారు.
‘తెలుసు స్వామీ నేను పరమ అజ్ఞానిని’ అన్నాడు భక్తుడు.
‘నీ గురించి నీకు తెలిసింది కదా... నువ్వు జ్ఞానివే.
ఇక నీకు నాతో పని లేదు’ అన్నారు మహర్షి.
🌹ఆత్మ విచారం ద్వారా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి.
జీవన్ముక్తి అంటే జీవితం నుంచి ముక్తులు అని కాదు.
ఈ జీవితంలోనే ముక్తిని పొందాలి.
🌹ముక్తి అంటే మరణానంతరం పొందేది కాదు.
పరంజ్యోతి గుండె గూటిలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగులో నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి.
నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి’ అని రమణులు సూచించారు.
🌹భగవాన్ శ్రీరమణులు తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రం) నాడు అళగమ్మాళ్, సుందరేశం అయ్యర్లు దంపతులకు జన్మించారు.
🌹తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భక్తులు భగవాన్ అని కూడా సంభోదిస్తారు.
🌹పదహారేళ్ల వయసులో అరుణాచలం అనే పేరు చెవిన పడగానే వెంకటరామన్ మనసులో ఏదో స్ఫురించింది.
తనకి, ఆ అరుణగిరికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు అనిపించింది.
అతని అంతరంగమంతా ఆ పేరే ఆవరించింది.
🌹‘అరుణాచలం’, ‘అరుణాచలం’, ‘అరుణాచలం’ అన్న నామమే అంతర్ధ్వనిగా ప్రతిధ్వనించసాగింది.
ఆ తపనతోనే అరుణాచలం వెళ్లిపోయారు.
అరుణాచలం ఆలయంలోకి అడుగుపెట్టగానే, పరుగెత్తుకొని వెళ్లి... ఆ స్వయంభూలింగాన్ని ఆలింగనం చేసుకున్నారు.
ఆనంద పారవశ్యంతో కన్నీటి పర్యంతం అయ్యారు.
ఆ క్షణం నుంచి ఆయనకు గురువైనా, తండ్రైనా శ్రీ అరుణాచలేశ్వరుడే అన్నీ.
🌹అయిదు దశాబ్దాలకు పైగా కాలాన్ని (తాను తనువు చాలించే దాకా) అత్యంత నిరాడంబరంగా, లౌకిక సౌకర్యాలు, భౌతిక సుఖాలకు అన్నింటికీ అతీతంగానే గడిపారు.
🌹తల్లికి సంగతి తెలిసి తీసుకెళ్ళడానికి వస్తే "ఏది ఎలా జరగాలో అట్లా జరుగుతుంది" అని వ్రాసి ఇచ్చారు ఆ మౌనస్వామి.
🌹ఆ తరువాతి కాలంలో ఆయన, ఒక భక్తుని విన్నపం మీద `అరుణాచలేశ్వరునికి ఐదు స్తోత్రాలు’ కృతిగానం చేసారు.
అవి 1)అక్షర మణిమలై, 2)నవ మణిమలై, 3)అరుణాచల పటికం, 4)అరుణాచల అష్టకం, 5)అరుణాచల పంచరత్న’.
🌹కనిపించేదంతా భగవత్ స్వరూపమే అయినప్పుడు అంతటిపై భక్తి ఉండాల్సిందే...
సాటి మనుషులైనా, సర్వ ప్రాణులైనా… అన్నీ ఆత్మ స్వరూపాలే… నీలో ఉన్నదే ఆ జీవుల్లోనూ ఉంది.
అందుకే నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో, అన్నిటినీ అలాగే ప్రేమించాలి. పూజించాలి.
ఇదే రమణులు చెప్పిన భక్తి తత్త్వం.
🌹రమణ మహర్షి బోధనలలో ప్రధానమైంది “మౌనం” లేదా “మౌనముద్ర”.
🌹ఆర్ద్రా నక్షత్రం లో పుట్టిన ఆయన #దక్షిణామూర్తి స్వరూపం అని,
కేవలం కౌపీనం మాత్రమే ధరిస్తారు కాబట్టి ఆయన్ని కుమారస్వామి స్వరూపం అని శిష్యులు కొలిచేవారు.
🌹సంస్కృత విద్వాంసుడు, ఆశుకవి, తపస్వి అయిన శ్రీ కావ్యకంఠ గణపతి ముని, భగవాన్ శ్రీ రమణులను గురువుగా స్వీకరించి, ఎన్నో సందేహాలను తీర్చుకున్నారు.
అవే `#రమణగీత’గా రూపొందాయి.
🌹శ్రీ రమణ మహర్షి చివరి రోజుల్లో, ఎడమ చేతిపై వ్రణం పెరిగి, శస్త్ర చికిత్స చేసినా తగ్గలేదు.
డాక్టర్లు మత్తుమందు ఇస్తామన్నా నిరాకరించారు.
🌹ఎందరో భక్తులు ఆయనని తమ అంతర్గత శక్తితో ఆరోగ్యం బాగు చేసుకోమని కోరగా, "భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?" అని అడిగారు.
🌹14, ఏప్రిల్ 1950 రాత్రి 8.47ని.లకు శ్రీ రమణ మహర్షి దేహాన్ని వదిలేసినప్పుడు, ఒక నక్షత్రం గిరి శిఖరం మీదుగా అంతరిక్షంలో అదృశ్యమైంది.
(🌹సేకరణ 🌹)🙏
🌹🙏అరుణాచల శివ అరుణాచల శివ 🙏🌹
Comments
Post a Comment