శివుని రూపాలు

ఓం నమః శివాయ 🙏


🌹అగోచరము అయిన "ఈశ్వరుని"గా,

మంగళకరుడైన ‘శంభుని’గా, 

లౌక్యం తెలియని ‘భోళాశంకరుని' గా,

సకల వేదాలూ, శాస్త్రాలూ, తంత్రాలూ బోధించిన గొప్ప గురువు ‘దక్షిణామూర్తి’గా, 

ఎవరినైనా ఇట్టే క్షమించేసే ‘అశుతోషుని’గా,

ఆ సృష్టికర్త రక్తాన్నే శరీరానికి అలుముకున్న ‘కాలభైరవుని'గా,

ప్రశాంతతకు ప్రతిరూపమైన ‘అచలేశ్వరుని' గా,

బ్రహ్మాండ నృత్యకారుడైన ‘నటరాజు’గా పరమేశ్వరుడుకి ఎన్నో రూపాలు ఉన్నాయి. 




🌹ఆయన "అల్ప సంతోషి", "నిరాడంబరుడు", "భక్తవశంకరుడు", "శుభాలనిచ్చేవాడు", "బోళా శంకరుడు", "విభూతి ప్రియుడు", "చితాభస్మధారి", "శ్మశాన వాసి", "జలాభిషేక ప్రియుడు", "సదా ధ్యానప్రియుడు", "భూతగణాధి సేవితుడు", "కైలాస నివాసి",

"సహస్ర నామధేయుడు", "సర్వాంతర్యామి"🙏 


🌹శివుడు లింగరూపుడు. పంచభూత సమన్వితుడు. సృష్టికి మూలం ఆ స్వరూపమే.


🌹శివుడి వాహనం వృషభం.

ఒకమారు ఆయన హిమాలయాల్లో ధ్యానంలో ఉన్నప్పుడు, సమీపంలోని ఒక తల్లిఆవు పొదుగు నుంచి... లేగదూడ పాలు తాగుతుంటుంది. 


🌹గాలి ధాటికి ఆ పాల నురగ ఆయనపై పడి, ధ్యానం భంగమవుతుంది. 

కళ్లు తెరిచి చూసిన ఆయన దృష్టి ఫలితంగా, ఆవులు నల్లగా మారి భయంతో పరుగులు తీస్తాయి. 


🌹అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై "ఆవు పాలకు ఎంగిలి ఉండదని" శివుణ్ని శాంతపరుస్తాడు. 

అలా నల్లగా మారిన ఆవులే #కపిల_గోవులు గా అనంతరం ఆయన వాత్సల్యాన్ని పొందాయని... అందువల్ల, బ్రహ్మ ఒక వృషభాన్ని శివుడికి వాహనంగా ఇచ్చినట్లు చెబుతారు.


🌹శ్మశానంలో ఉండే భూత, పిశాచ గణాలు లోకాల్ని పీడించి భయభ్రాంతం చేస్తుండగా వాటిని అణచివేసిన శివుడు శ్మశాన వాసిగా, భూతగణ సేవితుడిగా స్తుతిపాత్రుడైనట్లు మరో గాథ తెలియజెబుతుంది.


🌹దేవదానవులు క్షీరసాగరాన్ని మథిస్తుండగా, కాలకూట విషం పుడుతుంది. 

జ్వాలలు లోకాల్ని దహించి వేయకుండా, ఆ విషాన్ని తన కంఠంలో నిలిపి "నీలకంఠుడు" అయ్యాడు.


🌹త్రిపురాసురులను ఒక్క బాణంతో సంహరించి, శివుడు "త్రిపురాంతకుడు" అయ్యాడు. 


🌹గజాసురుణ్ని వధించి, అతడి చర్మాన్ని ధరించి, "కృత్తివాసుడు" అని పేరు పొందాడు.


🌹రావణాసురుడి భక్తికి మెచ్చి ఆత్మలింగాన్నే ప్రసాదించాడు. 


🌹కిరాతుడి రూపంలో అర్జునుడితో యుద్ధం చేసి, పాశుపతాస్త్రాన్ని అందజేశాడు. 


🌹భక్తజనుల్ని అనుగ్రహించేందుకు జ్యోతిర్లింగ రూపుడయ్యాడు.


🌹ఈ అనంత సృష్టిలోని కాల స్వరూపమంతా శివ భగవానుడే🙏 

తెలుసుకునే మనసు భక్తులకు ఉంటే... అంతా శివమయమే.


🌹మనిషి ఎప్పుడూ భక్తి నే పూజాసాధనంగా చేసుకుంటే శివానుగ్రహం లభిస్తుంది. 

భక్తికి మనసే ప్రధానం. వస్తువులు అప్రధానాలు. 

ఈ సత్యాన్ని గ్రహిస్తే మనసే ఒక కోవెల.

             

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు