కావడి మొక్కులు🙏

ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః🙏


                 కావడి మొక్కులు🙏


🌹పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. 


🌹వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. 


🌹ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. 


🌹కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. 

కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. 

మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా... 


🌹దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. 

కొండ దిగి వెళ్ళిపోమన్నాడు.

పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. 


🌹ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. 

ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. 


🌹అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. 

కాగా, కావడిని ఉపయోగించే బద్ద 'బ్రహ్మదండం' అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.


🌹భక్తులు ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు.

అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి.


🌹సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్పించినా "సత్సంతాన" ప్రాప్తి... 

రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం.

       



  శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రం 🙏


షడాననం చందనలేపితాంగం 

మహోరసం దివ్యమయూరవాహనమ్

రుద్రస్యసూనుం సురలోకనాథం 

బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (1)


జాజ్వల్యమానం సురవృందవంద్యం 

కుమార ధారాతట మందిరస్థమ్

కందర్పరూపం కమనీయగాత్రం 

బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (2) 


ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం 

త్రయీతనుం శూలమసీ దధానమ్

శేషావతారం కమనీయరూపం 

బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (3)


సురారిఘోరాహవశోభమానం 

సురోత్తమం శక్తిధరం కుమారమ్

సుధార శక్త్యాయుధ శోభిహస్తం 

బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (4)


ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రమ్ 

ఇష్టాన్నదం భూసురకామధేనుమ్

గంగోద్భవం సర్వజనానుకూలం 

బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (5)


యః శ్లోకపంచమిదం పఠతీహ భక్త్యా

బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్

ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టమ్

|| అంతే స గచ్ఛతి ముదా గుహసామ్యమేవ ||

          

Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥