ధర్మాన్ని ఆచరించిన శ్రీరాముడు
జై శ్రీ రామ్🙏
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
🌹తండ్రి మాట కోసం వనవాసానికి... సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు.
🌹అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు.
🌹మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు.
🌹అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు.
🌹దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు.
🌹అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు.
🌹ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది.
తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది.
🌹కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు.
శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు.
🌹నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు.
నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు.
🌹తండ్రి వియోగ దుఃఖంలో ఉన్న సమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి 🙏ఒక్కడే.
🌹లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా...
అహం దశరథాత్మజః
"దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే" అని ప్రకటించాడు.
🌹అయినా లోకమంతా ఆయననే ఆదర్శంగా తీసుకుంది. ఎందుకు అంటే...
👉ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు.
🌹ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు.
చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా,
స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా,
ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా,
సందర్భమేదైనా కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు.
అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు.
లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||
🙏🙏🙏 జై శ్రీరామ్ 🙏 🙏🙏
Comments
Post a Comment