Posts

Showing posts from May, 2022

⚜️🚩శ్రీ వేదసార శివ స్తోత్రం (ఆది శంకరాచార్య విరచితం)

Image
 ⚜️🔱🚩 ఓం నమః శివాయ 🌹🙏 🌺🌺 హర హర మహాదేవ శంభో శంకర 🌺🌺 ⚜️🚩శ్రీ వేదసార శివ స్తోత్రం (ఆది శంకరాచార్య విరచితం) పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం | జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరామి || 1 || మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యఞ్గభూషం | విరూపాక్షమింద్వర్క వహ్ని త్రినేత్రం సదానందమీడే ప్రభుం పంచవక్త్రం || 2 || గిరీశం గణేశం గళే నీలవర్ణం గవేంద్రాధిరూఢం గుణాతీత రూపం | భవం భాస్వరం భస్మనాభూషితాఞ్గం భవానీకలత్రం భజే పంచవక్త్రం || 3 || శివాకాంతశంభో శశాంకార్థమౌళే మహేశాన శూలిన్జటాజూటధారిన్ | త్వమేకోజగద్వ్యాపకోవిశ్వరూపః ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప || 4 || పరాత్మానమేకం జగద్బీజమాద్యం నిరీహం నిరాకారమోంకారవేద్యం | యతోజాయతే పాల్యతే యేన విశ్వం తమీశం భజే లీయతే యత్ర విశ్వం || 5 || నభూమిర్నచాపో నవహ్నిర్నవాయుః నచాకాశమాస్తే న తంద్రా ననిద్రా | నచోష్ణం నశీతం నదేశో నవేశో నయస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే || 6 || అజం శాశ్వతం కారణం కారణానాం శివం కేవలం భాసకం భాసకానాం | తురీయం పారమాద్యంతహీనం ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం || 7 || నమస్తే నమస్తే విభో వి...

దైవ చింతనపై శ్రద్ధ పెంచుకుంటేనే నీవు ఆశించే సత్యదర్శనానికి మార్గం సులువవుతుంది.

Image
 🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹 ⚜️🚩"సత్యదర్శన సాధనలో నాకు అనుకూల మార్గం ఏమిటి ?" ప్రాపంచిక విషయాలపై ఇష్టాన్ని తగ్గించుకోవటం, దైవంపై అంతకు మించిన ఇష్టాన్ని పెంచుకోవటం సాధనకు, సత్యదర్శనానికి మార్గం అవుతాయి. పేపర్ చదివేప్పుడు, టీవీ చూసేప్పుడు మనకిష్టమైన కాఫీ కప్పు చేతిలో ఉన్నా త్రాగటం మరిచిపోతాం.  మనం వార్తల్లో, టీవీ దృశ్యాల్లో లీనం కావటమే అందుకు కారణం. ధ్యానం విషయంలో మాత్రం సాధకుడు ఆ మమైకతను సాధించటానికి చాలా కష్టపడాల్సివుంది.  ప్రయత్నంతో పనిలేని సహజమైన ఆసక్తి ఉంటే ఏ కష్టం లేకుండానే ధ్యానం కూడా సిద్ధిస్తుంది.  పరధ్యానంతో ఉన్నప్పుడు మన ఒళ్ళును మనం మర్చిపోతున్నాం. కానీ దైవాన్ని పూజించేప్పుడు, ఆత్మను ధ్యానించేప్పుడూ అది సాధ్యం కావడంలేదు. తగిన ఆసక్తి, జిజ్ఞాస లేకపోవటమే అందుకు కారణం.  ప్రాపంచిక విషయాలపై ఉన్న ఇష్టం మనలోని దివ్యత్వాన్ని తెలుసుకోడానికి అడ్డు అవుతోంది.  మనకి టీవీ గానీ, సినిమా గానీ స్పష్టంగా కనిపించాలంటే బయటి వెలుతురు తగ్గాలి. లేదా టీవీ కాంతి బాగా పెరగాలి. అలాగే ప్రాపంచిక విషయాలపై ఇష్టం తగ్గించుకొని,  దైవ చింతనపై శ్రద్ధ పెంచుకుంటేనే నీవు ఆశించే...

ఓం శ్రీ సాయి రామ్

Image
 ఓం శ్రీ సాయి రామ్

జ్యేష్ఠ అమావాస్య శని జయంతి🌹⚜️🚩శ్రీ శని చాలీసా 🙏 ⚜️🚩శ్రీ శని హరతి 🙏

Image
 🕉️⚜️🚩 ఓం శనైశ్చరాయ నమః🌹🙏 ⚜️🚩 జ్యేష్ఠ అమావాస్య శని జయంతి🌹🙏 🌹జేష్ఠ అమావాస్య నాడు సూర్యుడు, ఛాయా దేవిల గర్భాన "శని దేవుడు" జన్మించాడు. ♦️నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం  ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం♦️ 🌹దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి.  🌹ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శని భగవానుడి అనుగ్రహం పొంది కష్టాలు దూరమై.. గ్రహస్థితి  కలిసి వస్తుంది. ⚜️🚩శని సప్త నామావళిః  నమో శనేశ్వరా పాహిమాం నమో మందగమన పాహిమాం నమో సూర్యపుత్రా పాహిమాం నమో ఛాయాసుతా పాహిమాం నమో జ్యేష్టపత్ని సమేతా పాహిమాం నమో యమప్రత్యది దేవా పాహిమాం నమో గృద్ర వాహానామ పాహిమాం ⚜️🚩శని జయంతి నాడు స్నానం చేసిన తర్వాత, మీ మనస్సులో శని దేవుడిని స్మరించుకోండి. ఆ తర్వాత "శని చాలీసా" పఠించి.. నువ్వుల నూనె లేదా ఆవనూనె దీపంతో శని దేవుడికి హారతి ఇవ్వండి.  శని చాలీసా మరియు శని ఆరతిలో కర్మ ప్రదాత అయిన శని దేవుడి మహిమ మరియు గుణాలు వివరించబడ్డాయి. దీని ద్వారా, మీరు శని దేవుడిని ప్రసన...

సోమావతి అమావాస్య"

Image
 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🌹🙏 🌺🌺 హర హర మహాదేవ శంభో శంకర 🌺🌺 ⚜️🚩 సోమవారం, అమావాస్య ఒకే రోజు వస్తే.. దాన్ని " సోమావతి అమావాస్య "గా వ్యవహరిస్తారు. 🌹"సోమ" శబ్దానికి "చంద్రుడు" అని అర్థం. సోమావతి అమావాస్య నాడు చంద్రుడు తొలిసారిగా శివుడిని పూజించి విశేష ఫలితాలు పొందినట్లు పురాణగాథలు చెబుతున్నాయి. 🌹ఇందుకు సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. తన అల్లుడైన పరమేశ్వరుడిని అవమానించే తలంపుతో దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని తలపెడతాడు. శివుడికి తప్ప మిగిలిన అందరు దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుషులకు ఆహ్వానాలు పంపుతాడు. ఇది తెలిసి శివుడి భార్య అయిన సతీదేవి దక్ష యజ్ఞానికి వెళ్లాలని భావిస్తుంది. నిరీశ్వర యాగానికి వెళ్లొద్దనీ.. పిలవని పేరంటానికి వెళ్లడం మంచిది కాదంటూ పతి దేవుడైన పరమేశ్వరుడు ఎంత వారించినా వినదు. యజ్ఞానికి వచ్చిన సతీదేవిని దక్షుడు తీవ్రంగా అవమానించడంతో తనను తాను ఆహుతి చేసుకుంటుంది. సతీ దేవి మరణంతో కోపోద్రిక్తుడైన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడు సృష్టించి దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. శివ గణాలతో కలిసి యాగశాలలో స్వైర విహారం చేస్తాడు వీరభద్రుడు. శివుడికి ఆహ్...

ఓం శ్రీ సాయి రామ్

Image
 ఓం శ్రీ సాయి రామ్

⚜️🚩వాలికి ధర్మం గురించి ఉపదేశం చేసిన రాముడు🌹🙏

Image
 🕉️⚜️🚩 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏 ⚜️🚩శ్రీరాముడు ఉపదేశం చేసిన ధర్మం🙏 ⚜️🚩 వాలికి ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ కనుపించారు.  రాముని చూచి వాలి ఇలా నిందించాడు. 🌹రామా! నేను నీకు గాని, నీదేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా నన్ను వధిస్తున్నావు. నా చర్మం, గోళ్ళు, రోమాలు, రక్తమాంసాలు నీకు నిరుపయోగం కనుక నన్ను మృగయావినోదం కోసం చంపావనే సాకు కూడా నీకు చెల్లదు. మద్యపాన మత్తుడై నిద్రపోయేవాడిని పాము కాటు వేసినట్లుగా చెట్టుమాటునుండి నాపై బాణం వేశావు.  నా సహాయమే కోరి వుంటే క్షణాలమీద రావణుడిని నీ కాళ్ళవద్ద పడవేసి నీ భార్యను నీకు అప్పగించేవాడిని. ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? నిస్సత్తువలో ఎక్కువ మాట్లాడలేను. కాని నీ సమాధానాన్ని వినగలను. – అని వాలి అన్నాడు. ⚜️🚩వాలికి ధర్మం గురించి ఉపదేశం చేసిన రాముడు🌹🙏 🌹"నీకు అసలు ధర్మం గురించి కాని, అర్ధం గురించి కాని, కామం గురించి కాని తెలుసా? నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవా...

⚜️🚩ప్రత్యక్ష నారాయణుడైన "శ్రీసూర్యభగవానుడు" కొన్ని నామాలు. - అర్థాలు

Image
 🕉️⚜️🚩 ఓం ఆదిత్యాయ నమః🌹🙏 ⚜️🚩ప్రత్యక్ష నారాయణుడైన "శ్రీసూర్యభగవానుడు" కొన్ని నామాలు. ⚜️🚩మార్తాండుడు 🌹అదితి దేవతల తల్లి, కశ్యపుని భార్య. దక్షుని కూతురు. కశ్యపునికీ, అదితికీ కలిగిన సంతానం ద్వాదశాదిత్యులు. 🌹అదితి తన గర్భం ద్వారా సూర్యభగవానుడు జన్మించాలని కోరుకొని సూర్యభగవానుడుకి నమస్కరిస్తుంది. కశ్యపుడు కూడా అనుగ్రహించడం వల్ల అదితి గర్భం దాలుస్తుంది.  🌹అయితే ఉపవాసాలు, వ్రతాలు చేస్తూ ఎంతో నీరసించి పోయి ఉన్న ఆమెను చూసి కశ్యపుడు ఆగ్రహించి సంతానం కోసం ఇంత తపించి చివరికి గర్భం పోగొట్టుకుంటావా? అంటూ ప్రశ్నించాడు. 🌹దీనికి అదితి తన భర్త తనని పరిహాసం చేస్తున్నాడని కోపగించుకుంటుంది.  🌹అదితి తన భర్తతో మాట్లాడుతూ ఈ గర్భం జారిపోతే ఈ పిండం నుంచి జన్మించే బిడ్డ లోకాలను రక్షించేలా ఉంటాడు అంటూ గర్భాశయం నుంచి అండాన్ని జార విడుస్తుంది. 🌹గర్భం నుంచి పిండం మహా తేజస్సుతో కిందపడడంతో మొదటగా ఆ పిండం మృతి చెందినట్లు కనబడుతుంది. 🌹తరువాత కొంత సమయానికి ఆ పిండం నుంచి సువర్ణ కాంతులను ప్రకాశిస్తూ ఒక బాలుడు ఉద్భవిస్తాడు. 🌹ఆ విధంగా బాలుడు జన్మించడంతో ఆదితి తన భర్తను ఉద్దేశించి నాధా! అప్పుడు నువ్...

భక్తితో ఒక చిన్న తులసిదళం సమర్పించినా, దానిని ఎంతో ప్రీతిగా పరవశుడై పోయి స్వీకరిస్తాడు వైకుంఠవాసుడు మననుండి ఎదురుచూసేది గాఢమైన భక్తిమాత్రమే!

Image
 🕉️⚜️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 🌹ఒక చిట్టి కథ. తప్పకుండ చదవండి🌹 ఒక పేదవ్యవసాయదారుడు ప్రతిరోజూ తెల్లవారుతూనే లేచి తన స్వంత పొలంలో పండిస్తున్న కూరగాయలను కోసుకొని, ఆ సాయంకాలం వాటిని సంతలో అమ్ముకొని, ఆ వచ్చిన స్వల్పమైన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకొంటూ జీవనం సాగిస్తున్నాడు.  అతను ప్రతి రోజూ కాయగూరలు కోసుకొని సంతకి వెళ్ళే దారిలో ఒక ఆచార్యులవారు ఒక చిన్న గుడిలో ఒక పెరుమాళ్ల విగ్రహానికి తిరువారాధనం తులసితో చేస్తూ ఉండటం చూస్తూ ఆ దారిని పోతూండేవాడు.  ఒకనాడు మామూలుగా ఆచార్యులవారు పెరుమాళ్ళను తులసితో పూజించటం చూస్తూ పొలానికి వెళ్ళాడు.  కాయగూరలను కోస్తూన్నప్పుడు ఆ పక్కనే కొన్ని తులసి మొక్కలు పెరిగి ఉండటం చూసాడు.  అప్పుడు వాడికి ఆచార్యులవారు ప్రతి రోజూ పెరుమాళ్ళకు తులసితో పూజ చెయ్యటం జ్ఞాపకం వచ్చింది.  వెంటనే " నేనుకూడా ఆ ఆచార్యులవారిలాగనే ఒక మనుష్యజన్మ ఎత్తినవాడినే కదా! ఇంతవరకూ ఎప్పుడు కూడా ఒక చిన్న పూజైనా చేసినవాడిని కాదు, నాచేత పెరుమాళ్ళకు విగ్రహానికి పూజ చెయ్యటం కుదరలేదు.  ఇవాళ్టి నుంచీ ఈ తులసిని కోసి ఆచార్యులవారు చేసేపూజకి తీసుకువెళ్ళి ఇస్తాను అని అనుకొని,...

శ్రీ కృష్ణ అవతార పరి సమాప్తి 🌹🙏🚩

Image
 🕉️⚜️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 ⚜️🚩కృష్ణం వందే జగద్గురుం🌹🙏 ♦️కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి♦️ 🌹లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్నవాడును , వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించినవాడును, ముక్కునకు మంచి ముత్యమును ధరించినవాడును , చేతులలో వేణువు గలవాడును, చేతులకు కంకణములు ధరించినవాడును , దేహమందంతటను హరిచందనము పూయబడినవాడును , కంఠమునందు ముత్యాలహారమును ధరించినవాడును,  గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును అగు గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమును పొందుగాక 🌹🙏 ⚜️🚩 మహాభారత యుద్ధం అయిపోయిన తరువాత కొన్నేళ్ళకు కృష్ణ నిర్యాణ సమయం దగ్గర పడింది. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కృష్ణభగవానుని ఎదుట సాక్షాత్కరించి ఆయన భూమ్మీద అవతరించి నూరేళ్ళు దాటి (వర్షాణాం అధికం శతం) కొన్నేళ్ళు గడిచాయనీ అవతార పరిసమాప్తి సమయం దగ్గర పడిందనీ అంటాడు. కృష్ణ పరమాత్మ కూడా అవతార సమాప్తి చేయాలనుకున్నాడు. 🌹ఒకరోజు కృష్ణుడిని చూడడానికి వశిష్ట నారదాది ఋషులు వచ్చారు. అక్కడ...

ఓం శ్రీ సాయి రామ్

Image
 ఓం శ్రీ సాయి రామ్

భక్తికి రెండు వివరణలు ఉన్నాయి. మొదటిది మన నమ్మకం, మరియు రెండవది భగవత్ కృప

Image
 🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹 ⚜️🚩భక్తికి రెండు వివరణలు ఉన్నాయి. మొదటిది మన నమ్మకం, మరియు రెండవది భగవత్ కృప ఉదా:::- కోతి పిల్ల తన తల్లి కడుపుని తన పూర్తి బలాన్ని అంతా ఉంచి పట్టుకుని ఉంటుంది, అందువలన తల్లి కోతి చెట్లు,కొండలు కోనలు ఎక్కిన పిల్ల కోతి పడిపోదు. కానీ ఇక్కడ కోతిపిల్ల నేను గట్టిగా పట్టుకున్నాను అనుకొదు తన తల్లి తనను జాగ్రత్తగా పడకుండా చూసుకుంటుంది అని అనుకుంటుంది. ఆపిల్ల కి ఉన్నది తల్లి మీద వున్న నమ్మకం. తల్లి బిడ్డను వదిలేస్తుందా....పిల్లను అంతకన్నా శక్తితో పిల్లను పట్టుకుంటుంది. ఇది కూడా భక్తి భావం. దీనిలో భక్తుడు తన దేవుడిని పూర్తి నమ్మకంతో పట్టుకుంటాడో అనుక్షణం సాయిదేవుణ్ణి ఆర్ధిస్తాడో... సాయిభగవంతుడు కూడా అంతకన్నా గట్టిగా పట్టుకుంటారు. రెండవ ఆలోచన ఏమిటంటే, పిల్లికి తన తల్లిని నోటితో పట్టుకోని తిరుగుతుంది. కాని ఆ పిల్లి పిల్లకి ఎలాంటి హాని కలగదు. పిల్లి అంత నమ్మకంతో తీసుకొని వెళుతుంది. పిల్ల కూడా అంతే నమ్మకంతో ఉంటుంది. 🌹సేకరణ 🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

ఓం శ్రీ సాయి రామ్

Image
 ఓం శ్రీ సాయి రామ్

⚜️🚩"తల్లికన్నా మిన్నసాయి*"..

Image
 🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹 ⚜️🚩"తల్లికన్నా మిన్నసాయి*".. 🌹మనందరకు సాయిబాబా తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం ఆయనే.  ఒక్కసారి తల్లి కన్నా మిన్నగా సాయి తన బిడ్డను కాపాడును.  సాయి షిరిడి వదిలి భౌతిక దేహంతో నీంగామ్ మరియు రహతా మాత్రమే వెళ్ళేడివారు.  నీంగామ్ లో నానా సాహెబ్ గృహమునకు వెళ్ళేడివారు.  ఒకసారి వర్షకాలంలో నానా సాహెబ్ పొలంలో కోతలు జరుగుచుండగా ఆ పని చేయుటకు కొంతమంది మగవారు కొంతమంది ఆడవారు గలరు.  ఒక స్త్రీ ఆమె నెలల పాపను పొలమునకు సమీపంలో గల చింత చెట్టుకు బట్టను ఊయల వలె కట్టి అందులో పరుండబెట్టెను. కోతపనులు జరుగుచుండగా ఆకస్మాత్తుగా భారి గాలివాన వచ్చెను.  పని చేయు చున్న వారందరు దగ్గరనే ఉన్న గుడిసెలోకి పోయి తలదాచుకున్నారు.  పసికందు తల్లి తనపాప సంగతి కొంత తడవు తర్వాత గుర్తు రాగా కేకలు వేయుచు చెట్టు చెంతకు వెళ్ళి చూడగ బాబా చేతులలో పాప ఉండెను. ఆమెను చూసిన బాబా కోపోద్రేకముతో "పాపను మర్చిపోయి ఎక్కడకు పొయ్యావు. ఇదిగో పాపను తీసుకో" అని పాపను ఆమెకు అందించెను.  అంత భారీ వర్షములోను బాబా గానీ, బాబా చేతిలోని పాప గాని, బాబా నిలబడిన ప్రదేశమంతయు ఏ మ...

ఓం శ్రీ సాయి రామ్

Image
 ఓం శ్రీ సాయి రామ్

ఓం శ్రీ సాయి రామ్

Image
 ఓం శ్రీ సాయి రామ్

శనిత్రయోదశి 🌹శని శాంతి మంత్ర స్తుతి🌹🙏

Image
 🕉️⚜️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 ⚜️🚩కలియుగ దైవం "శ్రీ వేంకటేశ్వరుడు" అనాధ నాధుడు... అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. 🌹వేంకటాద్రికి సరితూగే స్థానంగాని వేంకటేశ్వరుడికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం. 🌹"త్రయోదశి" "శనివారం" నాడు వస్తే  శనిత్రయోదశి 🌹మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను "కర్మ ఫలదాత" అంటారు. 🌹శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి. స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. త్రయోదశి శనేశ్వరుడు జన్మించిన తిథి కూడా. ♦️నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం♦️ 🌹నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడు, రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు, యమాగ్రజం-యముడికి సోదరుడు, ఛాయా మార్తాండ సంభూతం: ఛాయా దేవికి మార్తాండుడు అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడు, ...

⚜️🚩 శ్రీ కామాక్షీ స్తోత్రం 🌹🙏

Image
 🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 🌺🌺 ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమః 🌺🌺 ⚜️🚩కా అంటే "లక్ష్మీ"... మా అంటే "సరస్వతి" అక్షి అంటే కన్ను... కామాక్షి దేవి అంటే "లక్ష్మీదేవి", "సరస్వతీ దేవి"ని కన్నులుగా కలది అని అర్థం. 🌹 శ్రీ కామాక్షి అమ్మవారికి కుడి ఎడమలుగా లక్ష్మీ, సరస్వతులు వింజామరలు వీస్తూ ఉంటారు. 🌹అమ్మవారు యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై క్రింది హస్తాలతో చెరకుగడ, తామర పుష్పాన్ని, చిలుకను, పైచేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది. 🌹కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగంన్ని ప్రతిష్ఠచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని చెబుతారు. 🌹శివ పరీక్షలో భాగంగా తాను పూజించే సైకత లింగాన్ని శివకల్పితమైన గంగా ప్రవాహం నుంచి రక్షించుకోవడానికి... సైకత లింగాన్ని ఆలింగనంతో (కౌగిలితో) కాపాడుకుంటుంది. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పై దర్శనమిస్తాయి. 🌹మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని తల్లి నాభినుండే పోషిస్తుంది. అదే విధంగా కంచి కామాక్షిని దర్శించుకున్న భక్తులను కూడా ఎటువంటి కష్టం లేకుండా పోషిస...

⚜️🚩శ్రీ సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం🌹

Image
 🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 ⚜️🚩శ్రీ సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం🌹 ఓం శుద్ధలక్ష్మ్యై బుద్ధిలక్ష్మై వరలక్ష్మై నమో నమః | నమస్తే సౌభాగ్యలక్ష్యై మహాలక్ష్మ్యై నమో నమః || 1 || వచోలక్ష్మై కావ్యలక్ష్మై గానలక్ష్మ్యై నమో నమః | నమస్తే శృంగారలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 2 || ధనలక్ష్మ్యై ధాన్యలక్ష్మ్యై ధరాలక్ష్మ్యై నమో నమః | నమస్తే అష్టైశ్వర్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 3 || గృహలక్ష్మ్యై గ్రామలక్ష్మ్యై రాజ్యలక్ష్మ్యై నమో నమః | నమస్తే సామ్రాజ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 4 || శాంతలక్ష్మ్యై దాంతలక్ష్మ్యై క్షాంతలక్ష్మ్యై నమో నమః | నమోఽస్తు ఆత్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 5 || సత్యలక్ష్మ్యై దయాలక్ష్మ్యై సౌఖ్యలక్ష్మ్యై నమో నమః | నమ పాతివ్రత్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 6 || గజలక్ష్మ్యై రాజలక్ష్మ్యై తేజోలక్ష్మ్యై నమో నమః | నమో సర్వోత్కర్షలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 7 || సత్త్వలక్ష్మ్యై తత్త్వలక్ష్మ్యై భోధలక్ష్మ్యై నమో నమః | నమస్తే విజ్ఞానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 8 || స్థైర్యలక్ష్మ్యై వీర్యలక్ష్మ్యై ధైర్యలక్ష్మ్యై నమో నమః | నమస్తేస్త్వౌదార్యలక్ష్మ్యై మహ...

⚜️🚩ధర్మో రక్షతి రక్షితః🌹🙏

Image
 🕉️⚜️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 ⚜️🚩ధర్మో రక్షతి రక్షితః🌹🙏  (ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది) ఈ వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది.  🌹#శ్లోకం: ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః తస్మాత్‌ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్‌ 🌹భావం: “చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది; రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది; కనుక ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి” 🌹"ధర్మమంటే ధరించేది అని అర్థం. ఏదైతే మానవ సంఘాన్ని కట్టుబాటులో నిలిపి ఉంచుతుందో దాన్నే ధర్మం అంటారు.  పతనాన్ని గానీ, నాశనాన్ని గానీ పొందకుండా మనిషిని ఆపగలిగేదే ధర్మం" అంటూ ధర్మార్థాన్ని తెలియజేసింది వ్యాస భారతంలోని శాంతిపర్వం. ♦️ఒరులేయవి యొనరించిన నరవర! యప్రియము తన మనంబునకగుఁ దా నొరులకునవి సేయకునికి పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్♦️ 🌹భావం: ఇతరులు చేసే పొరపాట్లు ఏవైతే తన మనసుకు బాధను కలిగిస్తాయో, అలాంటి తప్పులను ఇతరుల పట్ల తాను చేయకుండా ఉండటమనేదే ధర్మ మార్గాలన్నింటిలోనూ ఉత్తమమైనదని చెప్తున్నది పంచమ వేదం మహాభారతం. ...

జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే | దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే ||

Image
 🕉️⚜️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 🌺🌺 ఓం శ్రీ దత్తాయ నమః 🌺🌺 ⚜️🚩ధ్యానమ్ జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే | దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే || కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్ | దత్తాత్రేయో హరిః సాక్షాద్ భుక్తిముక్తి ప్రదాయకః || దిగంబరం భస్మసుగంధ లేపనం చక్ర త్రిశూలం డమరుం గదాయుధమ్ | పద్మాసనం యోగిమునీంద్రవందితం దత్తేతినామస్మరణేన నిత్యమ్ ||🌹🙏 🌹ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా దుఃఖాలు కలుగుతాయని పురాణాలు తెలియజెబుతున్నాయి. ఇదే శ్రీ దత్తావతరానికి నాంది. 🌹అనసూయ శక్తిని పరీక్షించడానికి త్రిమూర్తులు వెళ్లారు. ఆమె శక్తి ప్రభావంతో ఆశ్రమ ఊయలలో బాలురుగా మారిపోయారు.  ఆమె మాతృప్రేమను పొందారు.  సృష్టికర్తల్నే బిడ్డలుగా లాలించింది అనసూయ. చివరకు త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమంలో మీరు కన్న తల్లిదండ్రులకంటే మిన్నగా మాకు పుత్రవాత్సల్యాన్ని పంచిపెట్టారు.  మీకేం వరం కావాలో కోరుకొమ్మన్నారు.  ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చారు.  అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వారు వరం కోరుకున్నారు. 🌹 ఆ ముగ్గురి అంశలు ఒకే మూర్తిగా ...

సర్ప యాగాన్ని ఆపిన ఆస్తీకుడు

Image
 🕉️⚜️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🌺🌺 హర హర మహాదేవ శంభో శంకర 🌺🌺 🌹ఆస్తీకుడు🌹 ⚜️🚩"జరత్కారుడు'' అనే మహాముని ఉండేవాడు. అతడు మహా తపఃశక్తి సంపన్నుడు.  మహాజ్ఞాని. బ్రహ్మచారి. 🌹ఒకసారి జరత్కారుడు దేశ సంచారం చేస్తూ పర్వత శిఖరాన ఉన్న  వృక్షశాఖను వ్రేలాడుతూ, సద్గతులు లేక అలమటిస్తున్న తన పితురులను చూసి వారి ఆవేదనను అర్థం చేసుకుని  వారికి సద్గతులు కలిగించాలని తలచి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని  కన్యాన్వేషణ చేస్తూ దేశాలు పట్టి తిరుగుతున్నాడు.  🌹అయితే, వార్థక్యస్థితిలో ఉన్న జరత్కారునకు, కన్యాదానం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు.  పైగా జరత్కారుడు తన పేరు లాంటి పేరు వున్న కన్యనే వివాహం చేసుకుంటానని నియమం పెట్టుకున్నవాడు.  ఇది ఒక కారణం జరత్కారునకు వివాహం కాకపోవడానికి.  🌹అందుచేత జరత్కారుడు బాధా తప్తహృదయుడై అరణ్య మధ్యం లోకి వెళ్ళి "ఈ చరాచర ప్రాణులు నా బాధను అర్థం చేసుకొనుగాక.  నా పితరుల హితం కోరి, సంతాన కాంక్షతో వివాహం చేసుకోవాలని ప్రయత్నించి విఫలుడనయ్యాను. దయచేసి నా మనోభీష్టానికి తగిన కన్యను భిక్షగా ఇవ్వమని యాచిస్తున్నాను'' అని బిగ్గరగా రోదించాడు....

⚜️🚩హేరంబ స్తోత్రం🌹🙏

Image
 🕉️⚜️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 ♦️అభయ వరదహస్త పాశదంతాక్షమాల సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా♦️ ⚜️🚩 ప్రాణులంతా ఎలా దుఃఖాలను పోగొట్టుకొని సుఖాలను పొందాలంటే ఎం చేయాలి... దానికి సంబంధించిన ఉపాయాన్ని చెప్పమని పార్వతి అడిగినప్పుడు "హేరంబోపనిషత్‌" ప్రారంభంలో సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి చెప్పాడు.   🌹పూర్వం త్రిపురాసుర సంహారం దేవతలందరికీ గొప్ప కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎంత మంది దేవతలు ఎన్ని విధాలుగా పోరాడినా ఫలితం లేకపోయింది. చివరకు లయకారకుడైన ఈశ్వరుడే స్వయంగా యుద్ధ రంగంలోకి దిగాడు.  తన యోగబలంతో సహా ఎన్ని బలాలను ప్రయోగించినా శత్రు సంహారం సాధ్యం కాలేదు. అప్పుడు "హేరంబ గణపతి"ని ధ్యానించి పరమాత్మ సారభూతమైన ఆ గణపతి శక్తిని పొంది దాన్ని తన బాణంలో నిక్షిప్తం చేసి శత్రువు మీదకు సంధించాడు శివుడు.  ఆ మరుక్షణంలోనే త్రిపుర సంహారం జరిగిపోయింది.  🌹ఆయనను ఉపాసించి సంసార సాగరం నుంచి, కష్టాల కడలి నుంచి సుఖంగా బయటపడవచ్చని శివుడు పార్వతికి తెలియచెప్పాడు. ⚜️🚩హేరంబ స్తోత్రం🌹🙏 గౌర్యువాచ | గజానన జ్ఞానవిహా...

ఓం శ్రీ సాయి రామ్

Image
 ఓం శ్రీ సాయి రామ్

ఓం శ్రీ సాయి రామ్ భక్తులకు వివేక వైరాగ్యాలను బోధించే శ్రీసాయినాధుని సందేశం సాటిలేనిది.

Image
 🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹 ⚜️🚩"నీ పేరున వ్రాయించేసుకో !" 🌹మనిషిలోని వాసనలు, సంస్కారాలు చాలా విచిత్రమైనవి. భగవంతుని సన్నిధిని కూడా మరపించి,  తమ బుట్టలో పడవేసే వాటి ప్రభావం చూస్తే.."ఔరా ! అని ముక్కున వేలు వేసుకోక తప్పదు . బాబా సశరీరంగా ఉన్న రోజులలో, బాగా డాబుసరిగా ఉన్న ఒక వ్యక్తి టాంగాలో షిరిడీకి వచ్చాడు. ద్వారకామాయిలో శ్రీ సాయినాధుని దర్శనం చేసుకుని సగుణ మేరు నాయక్ నడుపుతున్న భోజనశాలకు భోజనము చేయడానికి వచ్చాడు. అక్కడ భోజనశాల లో ఉన్నవారితో,  తాను ఒక గొప్ప భూస్వామినని, సాయిబాబాకు తనకున్న భూములలో చాలావాటిని బాబాకు రాసి ఇవ్వబోతున్నాని, ఆ పని మీదే షిరిడీకి వచ్చానని చెప్పాడు . అంతే ! ఆ వార్త ఒక్కసారిగా షిర్డీ గ్రామములో గుప్పుమంది. ఆ వార్త విని వెంటనే బాబా భక్తుడైన శ్యామా (మాధవరావ్ దేశపాండే )బాబా వద్ధకు వెళ్లి "దేవా ! ఒక భూస్వామి మీకు చాలా భూమి మీపేరున వ్రాసి ఇవ్వబోతున్నాడు. ఆ భూమిని నా పేరున వ్రాయించుకోమంటావా ? అని అడిగాడు . అందుకు బాబా " సరే ! నీ పేరున రాయించుకో ! అని చెప్పారు . అటువంటి ప్రశ్నయే తాత్యాకోతే పాటిల్, విరాగిణి అయిన రాధాకృష్ణ మాయి ,ఆలాగే మరికొందర...

🌹శివశక్త్యాత్మక తేజఃపుంజం – కుమారస్వామి🙏

Image
 🕉️🔱🚩ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🌹🙏 🌹శివశక్త్యాత్మక తేజఃపుంజం – కుమారస్వామి🙏 ⚜️🚩“పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువ” అనే పద్యంలో పోతన గారు... ”కావ్య రచనా సామర్ధ్యానికి నేను వాల్మీకిని కాను (పుట్టన్ బుట్ట), శరవణభవుణ్ణి కాను (శరంబునన్ మొలువ)” అంటూ ప్రార్థించారు.   “షణ్ముఖీ ప్రతిభ” ప్రసాదించే కార్తికేయుని "కవి"గా పేర్కొన్నాయి శాస్త్రాలు. 🌹శివతేజం స్కన్నమై వచ్చి రూపు కట్టిన దైవం కనుక ఈయన "స్కందుడు" ⚜️🚩 రామాయణంలో యాగ రక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతుండగా, మార్గమధ్యంలో స్కందోత్పత్తి (సుబ్రహ్మణ్య జనన ఆఖ్యానము) వివరిస్తారు మహర్షి. 🌹 ఓ రామా! ఈ "కుమారసంభవం" “ధన్యపుణ్యగాథ” అని విశ్వామిత్రుని మాట. (వాల్మీకి రామాయణం – బాలకాండ) 🌹రామాయణంలో రామచంద్ర ప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలోఉద్దేశం ఏమిటంటే, సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి. అది రావణ సంహారమునకు అవసరము.  🌹సుబ్రహ్మణ్య స్వామి వారిని అందుకే ఆంగ్ల భక్తులు -“The God of War” అని సంబోధిస్తారు దేవతలకు రాక్షసులకు, మంచికి చెడుకి, రాముడికి రావణుడికి, పాండవు...

హనుమ అనే దివ్యనామం ఎంతో మహిమాన్వితమైనది.

Image
 🕉️⚜️🚩 జై శ్రీ రామ్ 🚩 శ్రీ ఆంజనేయం 🚩 ⚜️🚩శ్రీ ఆంజనేయం శిరసా నమామి🌹🙏 ⚜️🚩దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ కొరకు, ధర్మపాలన సంస్థాపన చేయుటకై మానవుడుగా "హరి", వానరయూధ ముఖ్యునిగా రుద్రాంశతో "ఆంజనేయుడు" జన్మించారు. 🌹"పుంజికస్థల" అను అప్సరస శాపవశం చేత భూలోకమున "అంజన"గా జన్మించి వానర రాజైన "కేసరి"ని వివాహమాడింది. 🌹వివాహమై చాలకాలమైనా ఆమెకు సంతానం కలుగక పోవడంతో సంతానంకై కఠోర తపస్సు ప్రారంభించింది. 🌹ఆమె తపస్సుకు మెచ్చి "వాయుదేవుడు" ప్రతినిత్యం ఒక ఫలంను అనుగ్రహిస్తే దానిని వాయుదేవుని ప్రసాదంగా స్వీకరించేది.  🌹శివుని వీర్యమును భద్రపరిచిన వాయుదేవుడు ఆ వీర్యమును ఒక ఆకు దొప్పలో పండుగా మార్చి వాయువీవనచే అంజనాదేవి ముందు పడవేయగా  ఆ శివవీర్యాన్ని ఆనాటి వాయుప్రసాదముగా భావించి అంజన భుజించినది. 🌹ఫలితంగా తక్షణమే గర్భం దాల్చింది. తనకు గర్భము ఎలా వచ్చిందో తెలియక దుఃఖించి దానికి కారణమైన వారిని శపించబోగా, వాయుదేవుడు ప్రత్యక్షమై ఆమె గర్భమున శివాంశతో పుత్రుడు జన్మిస్తాడని, అతడు "వాయుపుత్రుడు"గా వాసికెక్కుతాడని అభయమిస్తాడు. వానరరాజు అయిన కేస...

శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహా-జీమూతపాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ దేవా! మీకరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ - శ్రీ కాళహస్తీశ్వరా

Image
 🕉️⚜️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🌺🌺 హర హర మహాదేవ శంభో శంకర 🌺🌺 ⚜️🚩శ్రీవిద్యుత్కలితా శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహా-జీమూతపాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ దేవా! మీకరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ - శ్రీ కాళహస్తీశ్వరా! 🌹భావము: శ్రీకాళహస్తీశ్వరా!  నా మనస్సునకు మూలరూపము అగునది నా అంతఃకరణము. దానికి ఆశ్రయమగునది నా హృదయపద్మము.  అది సహజముగ చక్కగ వికసించు స్వభావము కలదియే.  అది నా స్వభావము చేతను, నీయందు కల భక్తి చేతను, సాధన బలముచేతను మరింతగా వికాసము నొందసాగినది.  ఇంతలో సంపదలు అనెడు మెఱపులతో కూడి సంసారము అనెడు మహామేఘములు క్రమ్మసాగినవి. నేను ఎరిగియో ఎరుగకయో చేసిన పాపములు అనెడు వర్ష జల ధారలు ఆ మేఘముల నుండి వేగముగా పడనారంభించినవి.  వాని తీవ్రత చేత నా హృదయ పద్మము చినిగి చిల్లులు పడ నారంభించినది.  ఇంతవరకు ఆ పద్మమున కలిగిన వికాసము అంతయు నిరుపయోగము అయినది.  దేవా! ఇట్టి స్థితిలో నాపై నీ కరుణ ఏ కొంచెము ప్రసరించినను చాలును.  దాని ప్రభావమున నేను విమలఙ్ఞానరూపుడవగు నీ తత్వమును భావన చేయుచు  అదియే నీకు నేను చేయు సేవ ...

ఓం శ్రీ సాయి రామ్

Image
 ఓం శ్రీ సాయి రామ్

ఓం శ్రీ సాయి రామ్

Image
 🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹 భగవన్నామ స్మరణ చేసేటపుడు భావం భగవంతునిపై ఉండేలా చూసుకోవాలి. నామమునకు తగిన రూపం ప్రత్యక్షం కావాలి. అంతేకాని నోటితో నామము పలుకుతూ మనసులో ఏవో ఆలోచనలు చేస్తుంటే అది స్మరణ అనిపించుకోదు. ఇలా ఎంత సమయం చేసినప్పటికీ ఏ కొంచెం కూడా ప్రయోజనం లేదు. రేడియో ఉంటుంది చూడండి, దానికో టేపు వేస్తే చక్కగా పాడుతూ ఉంటుంది. అంత మాత్రమున ఆ పాటలకు భగవంతుడు కదలి వస్తాడా!? మనం నేడు రేడియో మాదిరిగానే చేస్తున్నాం కనుకనే అనుగ్రహాన్ని అందుకోలేకపోతున్నాం. భగవంతుడు బాహ్య ఆడంబరములకు లొంగేవాడు కాదు. ఆయనకు భావమే ప్రధానం. భావం సరిగా ఉన్నపుడే ఆయన పలుకుతాడు. ప్రార్థనకు సమాధానమిస్తాడు. 🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

ఓం శ్రీ సాయి రామ్

Image
 ఓం శ్రీ సాయి రామ్

⚜️🚩॥ శ్రీ శివ పంచరత్న స్తుతిః (శ్రీకృష్ణ కృతం) ॥

Image
 🕉️⚜️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🌺🌺 హర హర మహాదేవ శంభో శంకర 🌺🌺 🌹కృత్తివాససమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్🌹🙏 ⚜️🚩॥ శ్రీ శివ పంచరత్న స్తుతిః (శ్రీకృష్ణ కృతం) ॥ శ్రీకృష్ణ ఉవాచ – మత్తసింధురమస్తకోపరి నృత్యమానపదాంబుజం భక్తచింతితసిద్ధిదానవిచక్షణం కమలేక్షణమ్ | భుక్తిముక్తిఫలప్రదం భవపద్మజాఽచ్యుతపూజితం కృత్తివాససమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 1 || విత్తదప్రియమర్చితం కృతకృచ్ఛ్రతీవ్రతపశ్చరైః ముక్తికామిభిరాశ్రితైర్మునిభిర్దృఢామలభక్తిభిః | ముక్తిదం నిజపాదపంకజసక్తమానసయోగినాం కృత్తివాససమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 2 || కృత్తదక్షమఖాధిపం వరవీరభద్రగణేన వై యక్షరాక్షసమర్త్యకిన్నరదేవపన్నగవందితమ్ | రక్తభుగ్గణనాథహృద్భ్రమరాంచితాంఘ్రిసరోరుహం కృత్తివాససమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 3 || నక్తనాథకళాధరం నగజాపయోధరనీరజా- -లిప్తచందనపంకకుంకుమపంకిలామలవిగ్రహమ్ | శక్తిమంతమశేషసృష్టివిధాయకం సకలప్రభుం కృత్తివాససమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 4 || రక్తనీరజతుల్యపాదపయోజసన్మణినూపురం పత్తనత్రయదేహపాటనపంకజాక్షశిలీముఖమ్ | విత్తశైలశరాసనం పృథుశింజినీకృతతక్షకం కృత్తివాససమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 5 || యః పఠేచ్చ...