శనిత్రయోదశి 🌹శని శాంతి మంత్ర స్తుతి🌹🙏

 🕉️⚜️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏


⚜️🚩కలియుగ దైవం "శ్రీ వేంకటేశ్వరుడు" అనాధ నాధుడు... అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.


🌹వేంకటాద్రికి సరితూగే స్థానంగాని వేంకటేశ్వరుడికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం.


🌹"త్రయోదశి" "శనివారం" నాడు వస్తే  శనిత్రయోదశి


🌹మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి.

మంచి కర్మలకి మంచి ప్రతిఫలం,

చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.

ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు.

అందుకే ఆయనను "కర్మ ఫలదాత" అంటారు.


🌹శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది.

శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు కాగా,

త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి.


స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది.

త్రయోదశి శనేశ్వరుడు జన్మించిన తిథి కూడా.


♦️నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం♦️


🌹నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడు,

రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు,

యమాగ్రజం-యముడికి సోదరుడు,

ఛాయా మార్తాండ సంభూతం: ఛాయా దేవికి మార్తాండుడు అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడు,

తం నమామి శనేశ్చరం: అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను🙏 అని అర్థం.


🌹శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం లేచి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి.

కాకి కి నైవేద్యం పెట్టాలి.

నల్ల నువ్వులు, నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి.


⚜️🚩శనిదేవుడే ఉపదేశించిన మంత్రాన్ని శనిత్రయోదశి రోజు వీలైనన్ని సార్లు జపం చేసుకోవడం వల్ల ఎంతో స్వాంతన చేకూరుతుంది.


🌹శని శాంతి మంత్ర స్తుతి🌹🙏


క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్


ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్


నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార


వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ


ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ


కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ


శుద్ధబుద్ధి ప్రదాయనే


య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్


మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి


🌹శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం.


🌹అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కృప మనపై ఉంటే ఎలాంటి దోషాలు ఉండవు.

              🌺⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🌺



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు