భక్తితో ఒక చిన్న తులసిదళం సమర్పించినా, దానిని ఎంతో ప్రీతిగా పరవశుడై పోయి స్వీకరిస్తాడు వైకుంఠవాసుడు మననుండి ఎదురుచూసేది గాఢమైన భక్తిమాత్రమే!
🕉️⚜️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
🌹ఒక చిట్టి కథ. తప్పకుండ చదవండి🌹
ఒక పేదవ్యవసాయదారుడు ప్రతిరోజూ తెల్లవారుతూనే లేచి తన స్వంత పొలంలో పండిస్తున్న కూరగాయలను కోసుకొని, ఆ సాయంకాలం వాటిని సంతలో అమ్ముకొని, ఆ వచ్చిన స్వల్పమైన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకొంటూ జీవనం సాగిస్తున్నాడు.
అతను ప్రతి రోజూ కాయగూరలు కోసుకొని సంతకి వెళ్ళే దారిలో ఒక ఆచార్యులవారు ఒక చిన్న గుడిలో ఒక పెరుమాళ్ల విగ్రహానికి తిరువారాధనం తులసితో చేస్తూ ఉండటం చూస్తూ ఆ దారిని పోతూండేవాడు.
ఒకనాడు మామూలుగా ఆచార్యులవారు పెరుమాళ్ళను తులసితో పూజించటం చూస్తూ పొలానికి వెళ్ళాడు.
కాయగూరలను కోస్తూన్నప్పుడు ఆ పక్కనే కొన్ని తులసి మొక్కలు పెరిగి ఉండటం చూసాడు.
అప్పుడు వాడికి ఆచార్యులవారు ప్రతి రోజూ పెరుమాళ్ళకు తులసితో పూజ చెయ్యటం జ్ఞాపకం వచ్చింది.
వెంటనే " నేనుకూడా ఆ ఆచార్యులవారిలాగనే ఒక మనుష్యజన్మ ఎత్తినవాడినే కదా! ఇంతవరకూ ఎప్పుడు కూడా ఒక చిన్న పూజైనా చేసినవాడిని కాదు, నాచేత పెరుమాళ్ళకు విగ్రహానికి పూజ చెయ్యటం కుదరలేదు.
ఇవాళ్టి నుంచీ ఈ తులసిని కోసి ఆచార్యులవారు చేసేపూజకి తీసుకువెళ్ళి ఇస్తాను అని అనుకొని, అనుకున్నట్లు కాయగూరలు కోసుకొనటం అయినతరువాత తులసిని కూడా కోసి ఆకుకూరల కట్టతో తులసిని కూడా కలిపి కట్టేడు. అన్నింటినీ కలిపి తలకెత్తుకొని ఆచార్యులవారి ఇంటివైపు బయలుదేరాడు.
కాని వాడు కోసికట్టిన ఆకుకూరల కట్టలో ఒక చిన్న నాగుపాము ఉండడం వాడు గమనించ లేదు.
ఆచార్యులవారి ఇంటిముందుకువచ్చి నిలుచున్నాడు ఈ వ్యవసాయదారి. ఆచార్యులవారు వీడిని చూసేరు.
వాడి వెనకనే చిన్నగా ఎవరో ఒకరు ఉన్నట్లు గమనించారు. ఆయన కన్నులు మూసుకొని తన జ్ఞాననేత్రంతో ఆవ్యవసాయదారుడి వెనుక నీడలా వెంటవస్తున్నవాడు గ్రహాలలో నాగాంశలో ఒకడైన రాహువుగా తెలుసుకున్నాడు.
ఆచార్యులవారు వెంటనే వ్యవసాయదారుడితో " అబ్బాయీ, తలమీద కూరమోపుతో ఒక అయిదు నిముషాలు అలాగే దించకుండా నిల్చొని ఉండు, ఇప్పుడే వస్తున్నాను" అని చెప్పి, ఇంటి వెనుక పక్కకు వెళ్లి ఒక మంత్రం ఉచ్చరించి వ్యవసాయ దారుడి వెనుక నున్న రాహువును పిలిచారు.
రాహువు కూడా ఆశ్చర్యంతో ఆచార్యులవారి ముందుకివచ్చి నమస్కరించి " స్వామీ నన్ను దేవరవారు ఎందుకు పిలిచేరు అని అడిగేడు .
ఆయన కూడా ప్రతి నమస్కరించి, " ఓ రాహు భగవాన్! ఈ పేద వ్యవసాయ దారుడిని ఎందుకు వెంబడించి వస్తున్నావు? ఏమిటి కారణం"అని అడిగేరు.
దానికి రాహువు "స్వామీ ఈ పేదవాడిని ఇవాళ ఒక చిన్న నాగుపాముగా బాధించటానికి వచ్చేను. అలా చేయాలని వీడికి రాసి పెట్టబడిన గ్రహ విధి.
కాని వీడు ఎప్పుడూ లేని విధంగా పరమాత్మకు ప్రియమైన తులసిని తలమీద మోస్తున్నాడు.
అందువలన వీడిని నేను బాధుంచలేక ఆగేను. ఇతను తలమీది తులసిని మీకిచ్చిన మరుక్షణం వాడిని బాధించి నా బాధ్యతను పూర్తి చేసుకొని నేను తిరిగి పోతాను." అన్నాడు.
ఆచార్యుల వారికి ఆపేదవ్యవసాయదారుడి మీద జాలి కలిగింది. పాపము ఎంతో ఆశపెట్టుకొని మన తిరువారాధనకోసం తులసి కోసుకువచ్చేడు.
వాడిని కాపాడే ప్రయత్నం చేద్దామని భావించేడు. "ఓ రాహుమహాశయా! ఇతడిని నువ్వు బాధించకుండా ఉండాలంటే ఏదైనా పరిహారం ఉన్నదా?" అని అడిగారు.
దానికి "స్వామీ! ఇంతకాలం దేవరవారు భగవదారాధనం చేసిన పుణ్యఫలం ఈ పేద వ్యవసాయ దారుడికి ధారపోస్తే, వాడి సర్పదోషం తొలుగుతుంది.
దాంతో నేను వాడిని బాధించకుండా తిరిగి వెళిపోతాను. అన్నాడు.
( వాళ్ళిద్దరి సంభాషణ ఆ పేద వ్యవసాయ దారుడికి తెలియకుండా ఉం'డేటట్లు నడిచింది).
ఆచార్యులవారు సంతోషించి " అంతేనా! అయితే ఇదిగో ధారపోస్తున్నాను అని చేతిలో నీళ్ళు పోసుకొని ఇంతవరకూ తాము పెరుమాళ్ల తిరువారాధన చేసిన ఆరాధనఫలం అంటూ ఏదైనా ఉన్నదంటే దానిని అతడికి ధార పోస్తున్నాను" అని వాడికి ధారపోసేరు.
వెంటనే రాహువుకూడా ఆచార్యులవారి ధర్మ గుణాన్ని ప్రశంసించి వెనుకకు మరలేడు. అప్పుడు ఆకుకూరలకట్టలో దాగిన ఆ చిన్న నాగుపాము కూడా వెనుకకు పోయింది. ఆచార్యులవారు ఆ పేదవాడివద్దకువచ్చి " అబ్బాయీ! ఇక నువ్వు ప్రతి రోజూ
నా ఆరాధనకు తులసి కోసుకొని రావాలి. తప్పకుండా తెస్తావుకదా! " అన్నారు.
అతను నాకు పెరుమాళ్ళకు పూజ చెయ్యటం కుదరకపోయినా, ఆచార్యులవారి ద్వారా ఈవిధంగా నాకు పుణ్యంలభిస్తున్నది' అని తలచి సంతోషంతో తన గుడిశకి బయలుదేరాడు.
వైకుంఠవాసుడు మననుండి ఎదురుచూసేది గాఢమైన భక్తిమాత్రమే!
భక్తితో ఒక చిన్న తులసిదళం సమర్పించినా, దానిని ఎంతో ప్రీతిగా పరవశుడై పోయి స్వీకరిస్తాడు, ధరిస్తాడు.
అందుచేత భగవదారాధనం ప్రతిదినము చేయండి.
🌹Fb సేకరణ

Comments
Post a Comment