సోమావతి అమావాస్య"

 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🌹🙏

🌺🌺 హర హర మహాదేవ శంభో శంకర 🌺🌺


⚜️🚩 సోమవారం, అమావాస్య ఒకే రోజు వస్తే.. దాన్ని "సోమావతి అమావాస్య"గా వ్యవహరిస్తారు.


🌹"సోమ" శబ్దానికి "చంద్రుడు" అని అర్థం.

సోమావతి అమావాస్య నాడు చంద్రుడు తొలిసారిగా శివుడిని పూజించి విశేష ఫలితాలు పొందినట్లు పురాణగాథలు చెబుతున్నాయి.


🌹ఇందుకు సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

తన అల్లుడైన పరమేశ్వరుడిని అవమానించే తలంపుతో దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని తలపెడతాడు.

శివుడికి తప్ప మిగిలిన అందరు దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుషులకు ఆహ్వానాలు పంపుతాడు.

ఇది తెలిసి శివుడి భార్య అయిన సతీదేవి దక్ష యజ్ఞానికి వెళ్లాలని భావిస్తుంది.


నిరీశ్వర యాగానికి వెళ్లొద్దనీ.. పిలవని పేరంటానికి వెళ్లడం మంచిది కాదంటూ పతి దేవుడైన పరమేశ్వరుడు ఎంత వారించినా వినదు.

యజ్ఞానికి వచ్చిన సతీదేవిని దక్షుడు తీవ్రంగా అవమానించడంతో తనను తాను ఆహుతి చేసుకుంటుంది.


సతీ దేవి మరణంతో కోపోద్రిక్తుడైన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడు సృష్టించి దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు.


శివ గణాలతో కలిసి యాగశాలలో స్వైర విహారం చేస్తాడు వీరభద్రుడు.

శివుడికి ఆహ్వానం లేని యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావబాదతారు.

అలా శివగణాల చేతుల్లో దెబ్బలు తిని గాయపడ్డాడు చంద్రుడు.

దక్షుడి కుమార్తెలను వివాహం చేసుకున్న చంద్రుడు.. శివుడికి తోడల్లుడు.


శివగణాల చేతుల్లో గాయపడిన చంద్రుడు పరమేశ్వరుడిని శరణు వేడుకుంటాడు.

భక్తసులభుడైన పరమేశ్వరుడు చంద్రుడికి శారీరక బాధల నుంచి విముక్తికి తరుణోపాయం చెబుతాడు. 


రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి ఉందని ఆ రోజు తనను అభిషేకిస్తే అన్ని బాధలు నశిస్తాయని వరమిస్తాడు.

అలా చంద్రుడు సోమావతి అమావాస్య నాడు శివుడిని ఆరాధించి ఆరోగ్యవంతుడయ్యాడు.


⚜️🚩సోమవారం అంటే భోళాశంకరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.

సోమవారం నాడు చేసే అభిషేకానికి విశేష ఫలితం ఉంటుంది.

అమావాస్యతో కూడిన సోమవారం నాడు కనుక పరమేశ్వరుడిని ఆరాధిస్తే 

అనారోగ్య సమస్యలు తీరిపోతాయి.

ధన వస్తు, వాహనాదులు సమకూరతాయి.


సోమావతి అమావాస్య నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి.. తల స్నానం చేయాలి.

వీలైతే సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ చేయాలి.

దైనందిక, నిత్య అనుష్టాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక

శివుడిని షోడశోపచారాలతో పూజించాలి.

పంచామృతాలు, శుద్ధ జలాలతో శివలింగాన్ని అభిషేకించాలి.

ఆలయాల్లో కానీ, ఇళ్లలో కానీ శివలింగాన్ని అభిషేకించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి.

ఇవి కుదరని వారు కనీసం పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ.. గడిపినా పుణ్యమే.


సోమావతి అమావాస్య నాడు మర్రిచెట్టును పూజించాలి.

నీళ్లు పోసి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల పాపాలు నశిస్తాయి.


సర్వవ్యాపి అయిన శంకరుడు.. అన్ని జీవరాశుల యందు ఉంటాడని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.

ఏ జీవికి మేలు చేసినా.. ఆనందించేది పరమేశ్వరుడే.

అందుకే ప్రతి రోజూ భూతదయతో ఉండటం మానవధర్మాల్లో ఒకటి.

కనీసం విశేష దినాల్లోనైనా ఆ పని చేయాలని పెద్దలు చెబుతారు.


⚜️🚩ఈరోజు సోమావతి అమావాస్యతో పాటు "శని జయంతి" కూడా కావడం ఒక విశేషమైతే...

30 ఏళ్ల తర్వాత తన జన్మ రాశి అయిన కుంభ రాశిలో శని ఉండటం మరో విశేషం.

🌹 సేకరణ

                   🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు