⚜️🚩ధర్మో రక్షతి రక్షితః🌹🙏

 🕉️⚜️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


⚜️🚩ధర్మో రక్షతి రక్షితః🌹🙏

 (ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది)


ఈ వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. 


🌹#శ్లోకం:


ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః

తస్మాత్‌ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్‌


🌹భావం:

“చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;

రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది;

కనుక

ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు

మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి”


🌹"ధర్మమంటే ధరించేది అని అర్థం.

ఏదైతే మానవ సంఘాన్ని కట్టుబాటులో నిలిపి ఉంచుతుందో దాన్నే ధర్మం అంటారు. 

పతనాన్ని గానీ, నాశనాన్ని గానీ పొందకుండా మనిషిని ఆపగలిగేదే ధర్మం"

అంటూ ధర్మార్థాన్ని తెలియజేసింది వ్యాస భారతంలోని శాంతిపర్వం.


♦️ఒరులేయవి యొనరించిన

నరవర! యప్రియము తన మనంబునకగుఁ దా

నొరులకునవి సేయకునికి

పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్♦️


🌹భావం:

ఇతరులు చేసే పొరపాట్లు ఏవైతే తన మనసుకు బాధను కలిగిస్తాయో, అలాంటి తప్పులను ఇతరుల పట్ల తాను చేయకుండా ఉండటమనేదే ధర్మ మార్గాలన్నింటిలోనూ ఉత్తమమైనదని చెప్తున్నది పంచమ వేదం మహాభారతం.


🌹ధర్మాన్ని నాశనం చేసిన వాడిని ఆ ధర్మం ఎన్నటికైనా మట్టుబెడుతుంది. 

ధర్మం తనను రక్షించినవారిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది.


♦️సారపు ధర్మమున్‌ విమల సత్యము బాపము చేత బొంకుచేఁ

బారముఁ బొంద లేక చెడఁ బాఱిన దైన యవస్థ దక్షులె

వ్వారలుపేక్ష సేసిరది వారల చేటగుఁ గాని ధర్మ ని

స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవముండెడున్️♦️


🌹భావం:

"న్యాయబద్ధమైన ధర్మానికి ఎప్పుడైనా సరే పాపాత్ముల చేతల వలనే హాని జరుగుతూ ఉంటుంది.

అలా ఆ ధర్మానికి హాని జరగకుండా చూడటమనేది నియంత్రించవలసిన వాళ్ల బాధ్యత.

సమాజంలో జరుగుతున్న ఘోరాలను ఆపనట్లయితే అది వాళ్ల నాశనానికి మూలం అవుతుంది.

ధర్మాన్ని ఎప్పుడూ రక్షించే దైవం మాత్రం చూస్తూ ఊరుకోడు.

ధర్మ పతనానికి కారణమైన వాళ్లను సమూలంగా మట్టుపెడుతాడు.

న్యాయబద్ధమైన ధర్మం మాత్రం చెక్కుచెదరకుండా ప్రకాశిస్తూ ఎప్పుడూ నిలిచి ఉంటుంది"

అని "శ్రీకృష్ణ భగవానుడు" ధృతరాష్ర్టుడితో హెచ్చరించిన మాటలు.


🌹రక్షించడం అంటే కత్తి, కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడం కాదు.

ఆచరించదగినది ధర్మం.

అయితే ఈ ధర్మం ఆచరించే విషయంలో మనకు ఎన్నో సందేహాలు కలుగుతాయి. 


🌹ఆలస్యం, అమృతం విషం అనే సూక్తితో పాటు నిదానమే ప్రధానం అనే మరొక సూక్తి కూడా ఉంది.

ఇలాంటి పరస్పర విరుద్ధమైన ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి.

వీటిని ఎలా ఆచరించాలి అనే విషయంలోనే సందేహాలు కలుగుతాయి. 

అప్పుడే ఆ ధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి.


⚜️🚩దండకారణ్యంలో ఒక బుషి ఆశ్రమం కట్టుకుని శిష్యులకు విద్యాదానం చేస్తూ కాలం గడుపుతున్నాడు. 

సత్యవాది...

అతని ఆశ్రమానికి రెండు ప్రక్కల అరుగులు ఉన్నాయి. 

ఒకరోజు ఆ బుషి కుడివైపు అరుగు మీద కూర్చుని శిష్యులకు విద్యాబోధన చేస్తున్నాడు.

ఆ సమయంలో ఒక ఆవు ప్రాణభయంతో ఆర్తనాదం చేస్తూ ఆ ఆశ్రమం ముందు నుంచి పరుగెత్తుకుని వెళ్ళింది.

అది చూశాడు ఆ బుషి.

ఒక వేటగాడు ఆ ఆవును తరుముతున్నాడని గ్రహించాడు.


వేటగాడు వచ్చి ఇలా ఆవు వెళ్ళిందా అని అడిగితే అబద్ధం ఆడరాదు అనే ధర్మానికి కట్టుబడి వెళ్ళింది అని చెప్పాలి.

అలా చెబితే తాను గోహత్యకు కారణభూతుడవుతాడు.

ఒక్కక్షణం ఆలోచించి తన శిష్యులతో సహా ఆ అరుగుమీద నుంచి లేచి ఎడమవైపు అరుగుమీద కూర్చుని,

శిష్యులను మౌనంగా ఉండమని చెప్పి విద్యాబోధన చేస్తున్నాడు.

కొంతసేపటికి ఒక వేటగాడు అక్కడకు వచ్చి అయ్యా ఇలా ఏదైనా ఆవు పరుగెత్తుకుని వెళ్ళిందా అని ఆ బుషిని అడిగాడు.

గురువు గారు ఏం చెప్తారా అని శిష్యులు ఆత్రంగా చూస్తున్నారు.


ఆ బుషి వేటగాని వంక చూసి నాయనా ఈ అరుగు మీద కూర్చుని నా శిష్యులకు పాఠం చెప్పుతున్నప్పటి నుంచి ఏ ఆవు ఇలా వెళ్ళలేదు అని బదులిచ్చాడు.

వేటగాడు సంతృప్తి చెంది వచ్చిన దారినే వెనుదిరిగి వెళ్ళిపోయాడు.

బుషి కుడివైపు అరుగు మీద కూర్చున్నప్పుడు ఆవు వెళ్ళింది సత్యం.

అందుకే బుషి అరుగు మారి కూర్చున్నాడు.

అప్పుడు ఏ ఆవు అటు వెళ్ళలేదు.

అది సత్యమే.

అదే చెప్పాడు ఆ బుషి.

బుషి అసత్యం ఆడలేదు.

ఆవు రక్షించబడింది.

ఇది కథ.


⚜️🚩మంచి పనిచేసే విషయంలో ఆలస్యం పనికిరాదు.

అప్పుడు "ఆలస్యం అమృతం విషం" అనే సూక్తిని పాటించాలి.

చెడు పని  చేసే విషయంలో "నిదానమే ప్రధానం" అనే సూక్తిని పాటించాలి.

అదే ధర్మసూక్ష్మం.

ఈ సూక్ష్మాన్ని గ్రహించగలిగిన వాడే ధర్మాన్ని రక్షిస్తాడు.

ధర్మం చేత రక్షింపబడతాడు.

🌹సేకరణ

              🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు