ఓం శ్రీ సాయి రామ్

 🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹


భగవన్నామ స్మరణ చేసేటపుడు భావం భగవంతునిపై ఉండేలా చూసుకోవాలి.

నామమునకు తగిన రూపం ప్రత్యక్షం కావాలి.

అంతేకాని నోటితో నామము పలుకుతూ మనసులో ఏవో ఆలోచనలు చేస్తుంటే అది స్మరణ అనిపించుకోదు.

ఇలా ఎంత సమయం చేసినప్పటికీ ఏ కొంచెం కూడా ప్రయోజనం లేదు.

రేడియో ఉంటుంది చూడండి, దానికో టేపు వేస్తే చక్కగా పాడుతూ ఉంటుంది.

అంత మాత్రమున ఆ పాటలకు భగవంతుడు కదలి వస్తాడా!?

మనం నేడు రేడియో మాదిరిగానే చేస్తున్నాం కనుకనే అనుగ్రహాన్ని అందుకోలేకపోతున్నాం.

భగవంతుడు బాహ్య ఆడంబరములకు లొంగేవాడు కాదు.

ఆయనకు భావమే ప్రధానం.

భావం సరిగా ఉన్నపుడే ఆయన పలుకుతాడు. ప్రార్థనకు సమాధానమిస్తాడు.

🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥