⚜️🚩"తల్లికన్నా మిన్నసాయి*"..
🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹
⚜️🚩"తల్లికన్నా మిన్నసాయి*"..
🌹మనందరకు సాయిబాబా తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం ఆయనే.
ఒక్కసారి తల్లి కన్నా మిన్నగా సాయి తన బిడ్డను కాపాడును.
సాయి షిరిడి వదిలి భౌతిక దేహంతో నీంగామ్ మరియు రహతా మాత్రమే వెళ్ళేడివారు.
నీంగామ్ లో నానా సాహెబ్ గృహమునకు వెళ్ళేడివారు.
ఒకసారి వర్షకాలంలో నానా సాహెబ్ పొలంలో కోతలు జరుగుచుండగా ఆ పని చేయుటకు కొంతమంది మగవారు కొంతమంది ఆడవారు గలరు.
ఒక స్త్రీ ఆమె నెలల పాపను పొలమునకు సమీపంలో గల చింత చెట్టుకు బట్టను ఊయల వలె కట్టి అందులో పరుండబెట్టెను.
కోతపనులు జరుగుచుండగా ఆకస్మాత్తుగా భారి గాలివాన వచ్చెను.
పని చేయు చున్న వారందరు దగ్గరనే ఉన్న గుడిసెలోకి పోయి తలదాచుకున్నారు.
పసికందు తల్లి తనపాప సంగతి కొంత తడవు తర్వాత గుర్తు రాగా కేకలు వేయుచు చెట్టు చెంతకు వెళ్ళి చూడగ బాబా చేతులలో పాప ఉండెను.
ఆమెను చూసిన బాబా కోపోద్రేకముతో "పాపను మర్చిపోయి ఎక్కడకు పొయ్యావు. ఇదిగో పాపను తీసుకో" అని పాపను ఆమెకు అందించెను.
అంత భారీ వర్షములోను బాబా గానీ, బాబా చేతిలోని పాప గాని, బాబా నిలబడిన ప్రదేశమంతయు ఏ మాత్రం తడవక పొడిగా నుండుట గాంచిన వారందరు పంచభూతములు బాబా అధీనమున నున్నవని గ్రహించిరి.
అందుకే బాబా మనందరికి సాయిమాత అయినాడు.
🌹సేకరణ
🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

Comments
Post a Comment