⚜️🚩ప్రత్యక్ష నారాయణుడైన "శ్రీసూర్యభగవానుడు" కొన్ని నామాలు. - అర్థాలు

 🕉️⚜️🚩 ఓం ఆదిత్యాయ నమః🌹🙏


⚜️🚩ప్రత్యక్ష నారాయణుడైన "శ్రీసూర్యభగవానుడు" కొన్ని నామాలు.


⚜️🚩మార్తాండుడు


🌹అదితి దేవతల తల్లి, కశ్యపుని భార్య.

దక్షుని కూతురు.

కశ్యపునికీ, అదితికీ కలిగిన సంతానం ద్వాదశాదిత్యులు.


🌹అదితి తన గర్భం ద్వారా సూర్యభగవానుడు జన్మించాలని కోరుకొని సూర్యభగవానుడుకి నమస్కరిస్తుంది.

కశ్యపుడు కూడా అనుగ్రహించడం వల్ల అదితి గర్భం దాలుస్తుంది. 


🌹అయితే ఉపవాసాలు, వ్రతాలు చేస్తూ ఎంతో నీరసించి పోయి ఉన్న ఆమెను చూసి కశ్యపుడు ఆగ్రహించి సంతానం కోసం ఇంత తపించి చివరికి గర్భం పోగొట్టుకుంటావా? అంటూ ప్రశ్నించాడు.


🌹దీనికి అదితి తన భర్త తనని పరిహాసం చేస్తున్నాడని కోపగించుకుంటుంది. 


🌹అదితి తన భర్తతో మాట్లాడుతూ ఈ గర్భం జారిపోతే ఈ పిండం నుంచి జన్మించే బిడ్డ లోకాలను రక్షించేలా ఉంటాడు అంటూ గర్భాశయం నుంచి అండాన్ని జార విడుస్తుంది.


🌹గర్భం నుంచి పిండం మహా తేజస్సుతో కిందపడడంతో మొదటగా ఆ పిండం మృతి చెందినట్లు కనబడుతుంది.


🌹తరువాత కొంత సమయానికి ఆ పిండం నుంచి సువర్ణ కాంతులను ప్రకాశిస్తూ ఒక బాలుడు ఉద్భవిస్తాడు.


🌹ఆ విధంగా బాలుడు జన్మించడంతో ఆదితి తన భర్తను ఉద్దేశించి నాధా! అప్పుడు నువ్వు అండంలో ఉన్న బిడ్డని చంపేసావు అన్నావు కదా

ఇప్పుడు అండంలోని బిడ్డ కాంతులను విరజిమ్ముతూ జన్మించాడు కాబట్టి ఇతను "మార్తాండుడు"గా పిలవబడతాడు అని

అదితి సూర్యునికి మార్తాండుడు అనే పేరును పెట్టింది. 


🌹అప్పటినుంచి సూర్యుడుని "మార్తాండుడు" అని కూడా పిలుస్తారు.


⚜️🚩 "మృతం బ్రహ్మాండం జీవయతీతి మార్తాండః’’


👉మృతమైన బ్రహ్మాండాన్ని జీవింపజేస్తున్నాడు కనుక మార్తాండుడు.


🌹మిహిరుడు 

అంటే మేఘ రూపుడై విశ్వాన్ని తడిపి జీవనం ప్రసాదించేవాడు.


🌹నిరంతర సంచారి కనుక "అరుణుడు"


🌹ఈ గమనం దేనికి అంటే ప్రాణి పోషణకు... అదే ‘’పూష’’


🌹సర్వ భూతరాశిపై స్నేహభావం ఉండటం వలన ‘’మిత్రుడు"


🌹గ్రహాలకు నాయకుడు కనుక "గ్రహపతి"


🌹 ‘’హంతి తమః ఇతి హంసః"

చీకట్లను రూపుమాపేవాడు కనుక "హంస"


🌹అనంత కిరణాలున్నవాడు కనుక ‘’సహశ్రాంశువు"


🌹నిద్రించేవారిని మేల్కొలిపే వాడు కనుక ‘’సవిత"


🌹లోకాలకు ఆయన కిరణాలు మాలలు మాలలుగా చేరుతాయి కనుక "అంశుమాలి"


🌹ఆపని లోక బాంధవ్యం కోసమేకనుక "లోకబాంధవుడు"


🌹అన్ని రకాల మహోపకారాలు లోకాలకు చేసే ఉత్తమ దేవత కనుక ‘’సురోత్తముడు" 🌹🙏

                   ⚜️🌺⚜️🕉️⚜️🕉️⚜️🌺⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం