శ్రీ కృష్ణ అవతార పరి సమాప్తి 🌹🙏🚩

 🕉️⚜️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


⚜️🚩కృష్ణం వందే జగద్గురుం🌹🙏


♦️కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం

నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం

సర్వాంగే హరిచందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళిం

గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి♦️


🌹లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్నవాడును ,

వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించినవాడును,

ముక్కునకు మంచి ముత్యమును ధరించినవాడును ,

చేతులలో వేణువు గలవాడును,

చేతులకు కంకణములు ధరించినవాడును ,

దేహమందంతటను హరిచందనము పూయబడినవాడును ,

కంఠమునందు ముత్యాలహారమును ధరించినవాడును, 

గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును అగు

గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమును పొందుగాక 🌹🙏


⚜️🚩 మహాభారత యుద్ధం అయిపోయిన తరువాత కొన్నేళ్ళకు కృష్ణ నిర్యాణ సమయం దగ్గర పడింది.

అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కృష్ణభగవానుని ఎదుట సాక్షాత్కరించి ఆయన భూమ్మీద అవతరించి నూరేళ్ళు దాటి (వర్షాణాం అధికం శతం) కొన్నేళ్ళు గడిచాయనీ అవతార పరిసమాప్తి సమయం దగ్గర పడిందనీ అంటాడు.

కృష్ణ పరమాత్మ కూడా అవతార సమాప్తి చేయాలనుకున్నాడు.


🌹ఒకరోజు కృష్ణుడిని చూడడానికి వశిష్ట నారదాది ఋషులు వచ్చారు.

అక్కడే ఆడుకుంటున్న యాదవులకు కృష్ణ మాయ చేత ఒక బుద్ది పుట్టింది.

జాంబవతి కొడుకైన సాంబుడికి చీర కట్టి,

కడుపు ఎత్తుగా ఉండేటట్లు చేసి ఋషుల ముందుకు తీసుకువచ్చారు.

అయ్యా! మీరు త్రికాలవేదులు కదా! ఈ కడుపులో ఉన్నది ఆడ బిడ్డ లేక మగబిడ్డనో చెప్పండి అన్నారు. 


🌹ఋషులు దివ్య దృష్టితో వీరి పరిహాసాన్ని చూసి ఆడా కాదు, మగా కాదు ఒక రోకలి పుట్టి మీ యదు వంశాన్ని నాశనం చేస్తుంది అని శపించారు.

క్షణం ఆలస్యం లేకుండా ఆ కడుపులో నుండి ఒక రోకలి పుట్టింది.


🌹వాళ్ళు భయంతో వాసుదేవుని తండ్రిగారైన వసుదేవుని వద్దకు వచ్చి విషయం చెప్పారు.

ఆయన సలహా మేరకు ఒక శిఖరం పైకి తీసుకెళ్లి

ఆ ఇనుప రోకలిని బాగా అరగదీసి కరిగిన తెట్టును సముద్రంలో కలిపేశారు.

మిగిలిన చిన్న ఇనుప ములుకతో ఏమి ప్రమాదం వస్తుందిలే అనుకుని సముద్రంలోకి విసిరేశారు.


🌹ఆ ములుకను ఒక చేప మ్రింగింది.

ఒక బోయవాడు తినడానికి ఆ చేపని పట్టి కోయగా ఆ ములుక బయట పడింది.

వాడు దాన్ని తన బాణానికి పెట్టుకుని వేటకు

వెళ్ళాడు.


🌹మొదట బలరాముడు తన యోగ శక్తితో తన

శరీరాన్ని వదిలిపెట్టాడు.

తర్వాత కృష్ణుడు ఒక పొదచాటుకు వెళ్లి పడుకుని,

తన మోకాలి మీద రెండవ కాలిని వేసుకుని,

పాదాలను కొద్దిగా ఊపుతూ ఉన్నాడు.


🌹దూరం నుంచి చూసిన ఆ బోయవాడు జింక అనుకుని బాణాన్ని వేస్తే అది ఆయన పాదాలకు గుచ్చుకుంది.

వెంటనే కృష్ణ పరమాత్మ హా! అని అరిచారు.

ఆ పాదాలనుండి రక్తం ధారలా కారుతూ ఉంది.

ఆ బోయవాడు వెంటనే పరిగెత్తకుంటూ వచ్చి "అయ్యో! స్వామి! ఎంత పొరపాటు చేశాను" అని ఏడ్చాడు.


🌹అప్పుడు కృష్ణుడు "బాధపడకు నీవు నిమిత్త మాత్రుడివి.

ఈ శరీరంలోకి వచ్చాక ఎవరైనా సరే శరీరాన్ని వదలక తప్పదు.

ఇది అవతార సమాప్తి" 

అని చెప్పి శరీరాన్ని వదిలి శంఖచక్రగదారథాలతో

సహా వైకుంఠానికి వెళ్ళిపోయారు.


🌹అక్కడ తాగిన మైకంతో ఆడుకుంటున్న యాదవులు రెండు జట్లుగా విడిపోయి,

అరగదీసిన రోకలి తెట్టులో నుంచి పుట్టిన రెళ్లు దుబ్బులు కోసి ఒకరినొకరు కొట్టుకుని మరణించారు.


🌹బలరాముని భార్యలు, కృష్ణుని భార్యలు చితి లోకి ప్రవేశించి ప్రాణాలు విడిచారు.

మిగిలిన ఎవరో కొద్దిమంది స్త్రీలను రక్షించాలని అర్జునుడు ఇంద్రప్రస్థంకు తీసుకుని వెళుతుండగా,

పదిమంది దొంగలు అర్జునుడిని ఓడించి ఆ స్త్రీలను

అపహరించుకు పోయారు.


🌹కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి అయిపోవడం వల్ల అర్జునుని అస్త్రాలు, శస్త్రాలు, గాండీవానికి శక్తి పోయింది.

అర్జునుడు ఏడుస్తూ వెళ్లి జరిగిన విషయమంతా చెప్పగానే, ద్రౌపదితో సహా పాండవులు శరీరాన్ని విడిచిపెట్టారు.


🌹కలియుగం ప్రవేశించింది.

కలి పురుషుని ప్రభావం చేత మానవులలో కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, అసూయలు పెరిగిపోయాయి.

పాపాలు పెరిగిపోయాయి.


🌹కానీ హరి కథలను చదివే వారికి, వినే వారిపై, "కృష్ణ" భక్తి కలిగినవారిపై, "గోవింద" నామ స్మరణ చేసేవారిపై కలి ప్రభావం ఏ మాత్రం కూడా ఉండదు.

🌹సేకరణ

               🕉️🌹 ఓం కృష్ణాయ నమః 🌹🕉️

              ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు