దైవ చింతనపై శ్రద్ధ పెంచుకుంటేనే నీవు ఆశించే సత్యదర్శనానికి మార్గం సులువవుతుంది.

 🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹


⚜️🚩"సత్యదర్శన సాధనలో నాకు అనుకూల మార్గం ఏమిటి ?"

ప్రాపంచిక విషయాలపై ఇష్టాన్ని తగ్గించుకోవటం,

దైవంపై అంతకు మించిన ఇష్టాన్ని పెంచుకోవటం సాధనకు, సత్యదర్శనానికి మార్గం అవుతాయి.


పేపర్ చదివేప్పుడు, టీవీ చూసేప్పుడు మనకిష్టమైన కాఫీ కప్పు చేతిలో ఉన్నా త్రాగటం మరిచిపోతాం. 

మనం వార్తల్లో, టీవీ దృశ్యాల్లో లీనం కావటమే అందుకు కారణం.

ధ్యానం విషయంలో మాత్రం సాధకుడు ఆ మమైకతను సాధించటానికి చాలా కష్టపడాల్సివుంది. 

ప్రయత్నంతో పనిలేని సహజమైన ఆసక్తి ఉంటే ఏ కష్టం లేకుండానే ధ్యానం కూడా సిద్ధిస్తుంది. 


పరధ్యానంతో ఉన్నప్పుడు మన ఒళ్ళును మనం మర్చిపోతున్నాం.

కానీ దైవాన్ని పూజించేప్పుడు, ఆత్మను ధ్యానించేప్పుడూ అది సాధ్యం కావడంలేదు.

తగిన ఆసక్తి, జిజ్ఞాస లేకపోవటమే అందుకు కారణం. 

ప్రాపంచిక విషయాలపై ఉన్న ఇష్టం మనలోని దివ్యత్వాన్ని తెలుసుకోడానికి అడ్డు అవుతోంది. 


మనకి టీవీ గానీ, సినిమా గానీ స్పష్టంగా కనిపించాలంటే బయటి వెలుతురు తగ్గాలి.

లేదా టీవీ కాంతి బాగా పెరగాలి.

అలాగే ప్రాపంచిక విషయాలపై ఇష్టం తగ్గించుకొని, 

దైవ చింతనపై శ్రద్ధ పెంచుకుంటేనే నీవు ఆశించే సత్యదర్శనానికి మార్గం సులువవుతుంది.

         🌹ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి🌹

🌹 సేకరణ

🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥