జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే | దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే ||
🕉️⚜️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏
🌺🌺 ఓం శ్రీ దత్తాయ నమః 🌺🌺
⚜️🚩ధ్యానమ్
జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే |
దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే ||
కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్ |
దత్తాత్రేయో హరిః సాక్షాద్ భుక్తిముక్తి ప్రదాయకః ||
దిగంబరం భస్మసుగంధ లేపనం చక్ర త్రిశూలం డమరుం గదాయుధమ్ |
పద్మాసనం యోగిమునీంద్రవందితం దత్తేతినామస్మరణేన నిత్యమ్ ||🌹🙏
🌹ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా దుఃఖాలు కలుగుతాయని పురాణాలు తెలియజెబుతున్నాయి.
ఇదే శ్రీ దత్తావతరానికి నాంది.
🌹అనసూయ శక్తిని పరీక్షించడానికి త్రిమూర్తులు వెళ్లారు.
ఆమె శక్తి ప్రభావంతో ఆశ్రమ ఊయలలో బాలురుగా మారిపోయారు.
ఆమె మాతృప్రేమను పొందారు.
సృష్టికర్తల్నే బిడ్డలుగా లాలించింది అనసూయ.
చివరకు త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమంలో మీరు కన్న తల్లిదండ్రులకంటే మిన్నగా మాకు పుత్రవాత్సల్యాన్ని పంచిపెట్టారు.
మీకేం వరం కావాలో కోరుకొమ్మన్నారు.
ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చారు.
అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వారు వరం కోరుకున్నారు.
🌹 ఆ ముగ్గురి అంశలు ఒకే మూర్తిగా అనసూయకు జన్మించారు.
శ్రీమహావిష్ణువే తనను తాను ఆమెకు దత్తత ఇచ్చుకున్నాడు.
అంటే సమర్పించుకున్నాడు.
అత్రికి పుత్రుడయ్యాడు కాబట్టి దత్తాత్రేయుడయ్యాడు.
🌹ధర్మ స్వరూపమైన గోవు ఒక పక్క,
చుట్టూ నాలుగు వేదాలకు సంకేతాలైన కుక్కలతో,
అత్యంత దివ్యమైన రూపంతో పరమయోగి,
దిగంబరుడు, బ్రహ్మచారి అయిన శ్రీదత్తుడు గోచరిస్తాడు.
మూడు తలలు కలిగి ఉంటాడు.
🌹శ్రీగురుదత్త, జయగురుదత్త అంటే ఆయన వెంటనే పలుకుతాడని ఎందరో విశ్వసిస్తారు.
స్మరించినంత మాత్రానే అనుగ్రహించే స్వభావం కలవాడు దత్తాత్రేయుడు.
అయితే ఆయన పరీక్షించి కాని భక్తులకు వశం కాడని ప్రతీతి.
🌹ఆత్మజ్ఞానం బోధించేవాడు శ్రీ గురు దత్తాత్రేయుడు.
గొప్ప ధారణశక్తి కలిగిస్తాడు.
చూపులతోనే సందేహాలు తీర్చే మహావ్యక్తిగా ప్రతీతుడు.
"త్రిపురారహస్యం" అనే గొప్ప గ్రంథం రచించాడాయన.
అష్టాదశ పురాణాల్లోని గురుమహిమలు, గురుశక్తులు కలిపి గురుతత్వం అవుతుంది.
ఆ తత్వమే "గురు చరిత్ర"
ఆ గురుచరిత్రనే "శ్రీ దత్తాత్రేయ చరిత్ర"గా చెబుతారు.
⚜️🌺🕉️⚜️🌺🕉️⚜️🌺🕉️⚜️
ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః |
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే ||🌹🙏

Comments
Post a Comment