శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహా-జీమూతపాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ దేవా! మీకరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ - శ్రీ కాళహస్తీశ్వరా

 🕉️⚜️🚩 ఓం నమః శివాయ 🌹🙏


🌺🌺 హర హర మహాదేవ శంభో శంకర 🌺🌺


⚜️🚩శ్రీవిద్యుత్కలితా


శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహా-జీమూతపాపాంబుధా

రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్

దేవా! మీకరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా

సేవం దామరతంపరై మనియెదన్ - శ్రీ కాళహస్తీశ్వరా!


🌹భావము:


శ్రీకాళహస్తీశ్వరా! 

నా మనస్సునకు మూలరూపము అగునది నా అంతఃకరణము.

దానికి ఆశ్రయమగునది నా హృదయపద్మము. 

అది సహజముగ చక్కగ వికసించు స్వభావము కలదియే. 

అది నా స్వభావము చేతను, నీయందు కల భక్తి చేతను, సాధన బలముచేతను మరింతగా వికాసము నొందసాగినది. 

ఇంతలో సంపదలు అనెడు మెఱపులతో కూడి

సంసారము అనెడు మహామేఘములు క్రమ్మసాగినవి.


నేను ఎరిగియో ఎరుగకయో చేసిన పాపములు అనెడు వర్ష జల ధారలు ఆ మేఘముల నుండి వేగముగా పడనారంభించినవి. 

వాని తీవ్రత చేత నా హృదయ పద్మము చినిగి చిల్లులు పడ నారంభించినది. 

ఇంతవరకు ఆ పద్మమున కలిగిన వికాసము అంతయు నిరుపయోగము అయినది. 

దేవా! ఇట్టి స్థితిలో నాపై నీ కరుణ ఏ కొంచెము ప్రసరించినను చాలును. 

దాని ప్రభావమున నేను విమలఙ్ఞానరూపుడవగు

నీ తత్వమును భావన చేయుచు 

అదియే నీకు నేను చేయు సేవ కాగా 

అది ఎడతెగక సమృధ్ధినందుచుండ నా జీవనమును సాగింతును. 

కనుక నాయందు లేశమయిన కరుణ చూపుము.

                             🌺🔱🌺🔱🌺


⚜️🚩నీతో యుద్ధము


నీతో యుద్ధము చేయనోప, గవితానిర్మాణ శక్తిన్నినున్

బ్రీతుం చేయగలేను, నీ కొరకు తండ్రిన్ చంపగాజాలనా

చేతన్ రోకట నిన్ను మొత్త వెఱతున్; జీకాకు నా భక్తి యే

రీతి న్నాకిక నిన్ను చూడగనగున్ శ్రీకాళహస్తీశ్వరా!  


🌹భావము:


శ్రీ కాళహస్తీశ్వరా నేను నిన్ను భక్తితో మెప్పింపజాలను. 

అర్జునుని వలె నీతో యుధ్ధము చేయు శక్తి నాకు లేదు; 

పుష్పదంతుడను మహాభక్తుని వలె

నిన్ను మెప్పించునట్లు స్తుతి చేయుటకు సరిపోవు

కవితా శక్తి నాకు లేదు; 

నీకొరకై తండ్రిని చంపునంతటి తీవ్రభక్తియు నాకు లేదు; 

రోకటితో నిన్ను మోదిన భక్తురాలియంతటి

భక్తుడను కాను. 

అట్టి గాఢమగు భక్తి పరిపాకము లేని నేను ఏవిధముగ

నిన్ను ఆరాధించి మెప్పించి నీ సాక్షాత్కారము పొందగలను. 

కనుక దేవా నీవే నా అసమర్ధతను గమనించి అకారణ దయతో నన్ననుగ్రహింపుము.

🌹సేకరణ    

                    🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం