ఓం శ్రీ సాయి రామ్ భక్తులకు వివేక వైరాగ్యాలను బోధించే శ్రీసాయినాధుని సందేశం సాటిలేనిది.
🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹
⚜️🚩"నీ పేరున వ్రాయించేసుకో !"
🌹మనిషిలోని వాసనలు, సంస్కారాలు చాలా విచిత్రమైనవి.
భగవంతుని సన్నిధిని కూడా మరపించి,
తమ బుట్టలో పడవేసే వాటి ప్రభావం చూస్తే.."ఔరా ! అని ముక్కున వేలు వేసుకోక తప్పదు .
బాబా సశరీరంగా ఉన్న రోజులలో, బాగా డాబుసరిగా ఉన్న ఒక వ్యక్తి టాంగాలో షిరిడీకి వచ్చాడు.
ద్వారకామాయిలో శ్రీ సాయినాధుని దర్శనం చేసుకుని సగుణ మేరు నాయక్ నడుపుతున్న భోజనశాలకు భోజనము చేయడానికి వచ్చాడు.
అక్కడ భోజనశాల లో ఉన్నవారితో,
తాను ఒక గొప్ప భూస్వామినని, సాయిబాబాకు తనకున్న భూములలో చాలావాటిని బాబాకు రాసి ఇవ్వబోతున్నాని,
ఆ పని మీదే షిరిడీకి వచ్చానని చెప్పాడు .
అంతే !
ఆ వార్త ఒక్కసారిగా షిర్డీ గ్రామములో గుప్పుమంది.
ఆ వార్త విని వెంటనే బాబా భక్తుడైన శ్యామా (మాధవరావ్ దేశపాండే )బాబా వద్ధకు వెళ్లి "దేవా ! ఒక భూస్వామి మీకు చాలా భూమి మీపేరున వ్రాసి ఇవ్వబోతున్నాడు.
ఆ భూమిని నా పేరున వ్రాయించుకోమంటావా ? అని అడిగాడు .
అందుకు బాబా " సరే ! నీ పేరున రాయించుకో ! అని చెప్పారు .
అటువంటి ప్రశ్నయే తాత్యాకోతే పాటిల్,
విరాగిణి అయిన రాధాకృష్ణ మాయి ,ఆలాగే మరికొందరు బాబాను అదే ప్రశ్నను అడిగారు .
అడిగిన ప్రతిఒక్కరికి "నీ పేరున వ్రాయించేసుకో !"
అని ఒకే రకమైన సమాధానం చెప్పారు.
దానితో ఆ భక్తులందరూ భూస్వామీ అనబడే ఆ వ్యక్తి దృష్టిలో పడటానికి ,
అతని అభిమానాన్ని చూరగొనడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
శ్యామా ఒక అడుగు ముందుకేసి భోజనశాల యజమాని తో,
ఆ భూస్వామి భోజన ఖర్చులు తాను భరిస్తానని చెప్పాడు
ఈ విధముగా ఎవరికివారు ముమ్మర ప్రయత్నములో మునిగిపోయారు.
చివరికి ఆ భూస్వామి అనబడే ఆ వ్యక్తి భూమిని బాబాకు కానుక గా వ్రాయవలిసిన రోజు రానే వచ్చింది.
సదరు ఆ భూస్వామి అక్కడవారితో ,రిజిస్ట్రేషను వగైరా స్టాంపు పేపర్లు కొనడానికి వెళుతున్నాని చెప్పి ,పత్తా లేకుండా వెళ్లిపోయాడు.
మరి షిర్డి దరిదాపులలో కనిపించలేదు .
అందరికీ నిరాశే మిగిలింది.
ఆ వ్యక్తి చేసిన భోజనశాల ఖర్చులు శ్యామా కట్టవలిసివచ్చినది.
బాబాకు ఆ వ్యక్తి భూమిని ఇచ్చే వ్యక్తి కాదని శ్రీ సాయిబాబాకు ముందే తెలుసు.
అందుకనే అడిగిన వారందరికి
"నీ పేరున వ్రాయించుకో! అని చెప్పారు.
అందరికీ అన్నీ ప్రసాదించే ఆ దేవాది దేవుడైన శ్రీ సాయినాధుని ప్రక్కన పెట్టుకునీ,
వ్యక్తుల ప్రాపకం కోసం, వారిచ్చే సంపదల కోసం పాకులాడటం ఎంత అవివేకమో ఈ సంఘటన ద్వారా భక్తులకు తెలియ వచ్చింది .
ఆ విధముగా మనసు మూలల్లో దాక్కొన్న వాసనలను బయటకి తెచ్చి,
భక్తులకు వివేక వైరాగ్యాలను బోధించే శ్రీసాయినాధుని సందేశం సాటిలేనిది.
🌹సేకరణ
🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

Comments
Post a Comment