హనుమ అనే దివ్యనామం ఎంతో మహిమాన్వితమైనది.
🕉️⚜️🚩 జై శ్రీ రామ్ 🚩 శ్రీ ఆంజనేయం 🚩
⚜️🚩శ్రీ ఆంజనేయం శిరసా నమామి🌹🙏
⚜️🚩దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ కొరకు,
ధర్మపాలన సంస్థాపన చేయుటకై మానవుడుగా "హరి",
వానరయూధ ముఖ్యునిగా రుద్రాంశతో "ఆంజనేయుడు" జన్మించారు.
🌹"పుంజికస్థల" అను అప్సరస శాపవశం చేత భూలోకమున "అంజన"గా జన్మించి వానర రాజైన "కేసరి"ని వివాహమాడింది.
🌹వివాహమై చాలకాలమైనా ఆమెకు సంతానం కలుగక పోవడంతో సంతానంకై కఠోర తపస్సు ప్రారంభించింది.
🌹ఆమె తపస్సుకు మెచ్చి "వాయుదేవుడు" ప్రతినిత్యం ఒక ఫలంను అనుగ్రహిస్తే దానిని వాయుదేవుని ప్రసాదంగా స్వీకరించేది.
🌹శివుని వీర్యమును భద్రపరిచిన వాయుదేవుడు ఆ వీర్యమును ఒక ఆకు దొప్పలో పండుగా మార్చి వాయువీవనచే అంజనాదేవి ముందు పడవేయగా
ఆ శివవీర్యాన్ని ఆనాటి వాయుప్రసాదముగా భావించి అంజన భుజించినది.
🌹ఫలితంగా తక్షణమే గర్భం దాల్చింది.
తనకు గర్భము ఎలా వచ్చిందో తెలియక దుఃఖించి
దానికి కారణమైన వారిని శపించబోగా,
వాయుదేవుడు ప్రత్యక్షమై ఆమె గర్భమున శివాంశతో పుత్రుడు జన్మిస్తాడని,
అతడు "వాయుపుత్రుడు"గా వాసికెక్కుతాడని అభయమిస్తాడు.
వానరరాజు అయిన కేసరి దీనిని దివ్యప్రసాదంగా భావించి సమ్మతించాడు.
⚜️🚩వైశాఖ మాసం, కృష్ణ పక్షం, తిధి దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నం, వైధృతి నామయోగం, గ్రహాలన్నీ శుభస్థానాలలో ఉన్న మధ్యాహ్న తరుణంలో ఆంజనేయుని జననం జరిగింది.
🌹తాను నమ్మిన దైవమును త్రికరణశుద్ధిగా సేవిస్తూ,
రామున్ని అపారభక్తితో ఆరాధిస్తూ,
రామ నామ మహిమను రామునికే తెలియజెప్పే పరమభక్తునిగా,
త్రేతాయుగమున రామబంటై,
ద్వాపరమున తన ప్రకీర్తితో రామభక్తుడై ఫరిడిల్లి,
కలియుగమున రామభక్తులకు బాంధవుడై, మహిమాన్విత దైవమై,
ఊరూరా వాడవాడన, ఇంటింటా, గుండె గుండెలో కొలువై యుగయుగాలుగా చిరంజీవిగా విరాజిల్లుతున్న భక్తజ్ఞానప్రపూర్ణ దివ్యమూర్తి "ఆంజనేయుడు"
⚜️🚩సేవ, భక్తి, దౌత్యం, నీతి, ధైర్యం, అభయం అనే షడ్గుణములకు ప్రతీక ఆంజనేయుడు.
"దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే"
ఈ జగత్తులో కష్టమైనా పనులేమైనా ఉంటే ఆంజనేయుడి అనుగ్రహంతో అవి నెరవేరుతాయి.
🌹తనని స్మరించినంతమాత్రమునే భూత ప్రేత పిశాచాలను దరిచేరనివ్వక అభయమొసగే ఆపద్భాందవుడు ఆంజనేయుడు.
🌹హనుమ 🌹
⚜️🚩హనుమ అనే
దివ్యనామం ఎంతో మహిమాన్వితమైనది.
🌹హ :-
హకారం శివ బీజంచ, శుద్ధస్ఫటిక సన్నిభం
అణిమాద్యష్ట సిద్ధించ, భుక్తిముక్తి ప్రదాయకం.
హకారం ఈశ్వరబీజం.
శుద్ధస్ఫటికంలా తెల్లని కాంతిగల ఈశ్వరత్వానికి ప్రతీక.
ఈ బీజోచ్చారణ వలన అణిమాద్యష్టసిద్ధులు లభిస్తాయి.
భుక్తి ముక్తిలను ప్రసాదిస్తుంది.
🌹ను :-
నుకారం చైవ సావిత్రం, స్ఫటికం జ్ఞాన సిద్ధిదం
వాయువేగం మనోవేగం, స్వేచ్ఛారూపం భవేద్రువం.
సావిత్రి లేక సవిత అంటే సూర్యునికి సంకేతం.
సూర్యుని అనుగ్రహం కలిగించే స్పటికంవంటి కాంతిగల ఈ బీజోచ్చారణ వాయు,మనోవేగాలను
స్వేచ్ఛారూపాన్ని, జ్ఞానసిద్ధిని కలుగజేస్తుంది}
🌹మ :-
మకారం మధనంజ్ఞేయం, శ్యామం సర్వఫలప్రదం
కాలరుద్రమితిఖ్యాతం, ఉమాబీజంభయప్రదం.
మకారం మనస్సును మధించే శక్తి కలది. కాలరుద్రమని పిలవబడే ఈ బీజం, ఉమాబీజం, శివశక్తులకు సంకేతం.
శ్యామవర్ణంగల ఈ ‘మ’ బీజం స్థిరమైన మనస్సును, సమస్త కోరికలను తీర్చును.
⚜️🚩శివ, సూర్య, శక్తి బీజాలతో కూడుకున్న ఈ ‘హనుమ’ అనే నామోచ్చారణచే జ్ఞానం, బుద్ధి, యశస్సు, ధైర్యం, అభయం, పూర్ణాయువు, ఆరోగ్యం, కార్యసిద్ధి, వాక్ఫటిమ ప్రాప్తించును.
🌹లోకములో రామకధ ఉన్నంతవరకు,
పర్వతాలు సూర్యచంద్రులు ఉన్నంతవరకు,
నీవు చిరంజీవిగా యుండి,
తర్వాత కల్పంలో భవిష్యద్బ్రహ్మవై లోకాలను సృష్టించి, పాలించి ఆ కల్పాంతంలో నా సాయుజ్య ముక్తిని పొందుతావు
అని రామానుగ్రహ వరమును పొందిన మహిమాన్వితుడు శ్రీ ఆంజనేయుడు.
🌹సేకరణ
🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️

Comments
Post a Comment