🌹శివశక్త్యాత్మక తేజఃపుంజం – కుమారస్వామి🙏
🕉️🔱🚩ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🌹🙏
🌹శివశక్త్యాత్మక తేజఃపుంజం – కుమారస్వామి🙏
⚜️🚩“పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువ”
అనే పద్యంలో పోతన గారు...
”కావ్య రచనా సామర్ధ్యానికి నేను వాల్మీకిని కాను (పుట్టన్ బుట్ట),
శరవణభవుణ్ణి కాను (శరంబునన్ మొలువ)”
అంటూ ప్రార్థించారు.
“షణ్ముఖీ ప్రతిభ” ప్రసాదించే కార్తికేయుని "కవి"గా పేర్కొన్నాయి శాస్త్రాలు.
🌹శివతేజం స్కన్నమై వచ్చి రూపు కట్టిన దైవం కనుక ఈయన "స్కందుడు"
⚜️🚩 రామాయణంలో యాగ రక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతుండగా,
మార్గమధ్యంలో స్కందోత్పత్తి (సుబ్రహ్మణ్య జనన ఆఖ్యానము) వివరిస్తారు మహర్షి.
🌹 ఓ రామా!
ఈ "కుమారసంభవం" “ధన్యపుణ్యగాథ” అని విశ్వామిత్రుని మాట. (వాల్మీకి రామాయణం – బాలకాండ)
🌹రామాయణంలో రామచంద్ర ప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలోఉద్దేశం ఏమిటంటే,
సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి.
అది రావణ సంహారమునకు అవసరము.
🌹సుబ్రహ్మణ్య స్వామి వారిని అందుకే ఆంగ్ల భక్తులు
-“The God of War” అని సంబోధిస్తారు
దేవతలకు రాక్షసులకు, మంచికి చెడుకి,
రాముడికి రావణుడికి, పాండవులకి, కౌరవులకి
మధ్య జరిగే యుధ్ధములలో
మంచి/దేవతా సైన్యం విజయం సాధించాలంటే,
దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము.
🌹అసలు విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి యజ్ఞ తత్వమునకు ప్రతీక.
అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞ పురుషుడి గానూ,
యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడింది.
🌹అందులోనే శ్రీమహావిష్ణువుకి
“స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః” అనే నామాలు ఉన్నాయి.
🌹అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అనిఅర్ధం.
మరి విష్ణువే రాముడు కదా,
ఆయనకి విశ్వామిత్ర మహర్షి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో ఏమిటి రహస్యం అంటే...
🌹రాముడు అవతార ప్రయోజనం కోసం సాధారణ మానవుడిగా వచ్చాడు.
అప్పుడు ఆయన రావణ సంహారం చేయడానికి అవసరమైన సకల అస్త్ర శస్త్రములతో పాటుగా, యుధ్ధ వీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము.
🌹సేకరణ
🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱

Comments
Post a Comment