Posts

Showing posts from September, 2022

మూడవ రోజు (ఆశ్వ‌యుజ శుద్ధ త‌దియ‌) నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ "గాయ‌త్రీదేవి"గా సాక్షాత్క‌రిస్తుంది.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 సర్వం రూపమయీ దేవీ, సర్వం దేవమయం జగత్‌ అతోహం విశ్వరూపాం, తాం నమామి పరమేశ్వరీమ్‌ 💥నవరాత్రులలో ముగ్గురమ్మల మూలపుటమ్మకు తోడుగా ఆమెతో పాటు తొమ్మిది శక్తులు ఉంటాయని దేవీపురాణం చెబుతోంది. దుష్టశిక్షణ, లోక సంరక్షణ కోసం శక్తిస్వరూపణి ఎత్తిన అవతారాలే నవదుర్గలు. ఆ తొమ్మిది రూపాలను షోడశోపచారాలతో పూజించి ఆరాధించే పర్వదినాలే శరన్నవరాత్రులు. 🍁అమ్మవారి మూడో అవతారం "చంద్రఘంట" 💥 చంద్రఘంట : పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|  ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా || శిరస్సుపై అర్థచంద్రుడిని ధరించి ఉంటుంది.. అందుకే  ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ రూపాన్ని దర్శించుకున్నవారికి అన్నపానీయాలకు లోటుండదు. ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయ ఘంట మోగుతూ ఉంటుంది. 🍁 శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా మూడవ రోజు (ఆశ్వ‌యుజ శుద్ధ త‌దియ‌) నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ "గాయ‌త్రీదేవి"గా సాక్షాత్క‌రిస్తుంది.  💥 గాయ‌త్రీదేవి ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః యుక్తామిందు నిబద్ధరత్న మక...

💥కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏 మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ । మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలమ్ || 💥తమిళనాడులో ఆరు "సుబ్రహ్మణ్య" క్షేత్రాలను కలిపి "ఆరుపడైవీడు" అని వ్యవహరిస్తారు. ఆ ఆరు క్షేత్రాలను స్వామి వారి ఆరు ముఖాలుగా చెప్తారు. అలాగే కర్ణాటకలో మూడు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలను విశేషంగా కొలుస్తారు. 1) ఆది సుబ్రహ్మణ్య - కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య 2) మధ్య సుబ్రహ్మణ్య - ఘాటి సుబ్రహ్మణ్య 3) అంత్య సుబ్రహ్మణ్య - నాగలమడక ఈ మూడు క్షేత్రాలు, స్వామిని సర్ప రూపంలో చూస్తే ఆది, మధ్య, అంత్యములుగా చెప్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రాలు. 💥కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి💥 కుక్కేలో స్వామి మొదట ఒక పుట్టగా మాత్రమే వెలిశారు. దానినే "ఆది సుబ్రహ్మణ్య" అని పిలుస్తారు. ఇక్కడ ఇచ్చే మూల ప్రసాదం (పుట్టమన్ను) చాలా చాలా శక్తివంతమైనది. గర్భగుడిలో వాసుకి, ఆపైనా ఆదిశేషుడూ, ఆపైన సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉంటారు. వాసుకి, ఆదిశేషు, సుబ్రహ్మణ్యులను కలిసి ఒకేసారి చూడడం పరమ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. ...

💥ఎమ్మెస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా 💥🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺 💥మానవ జన్మ అవరోధాలు, కష్టాలతో నిండి ఉంటే, మన ధర్మం నిర్వర్తించటం ఎలా? మానసిక దౌర్బల్యం, శారీరక అశక్తత ఉంటే, మన కర్తవ్య పాలన ఎలా? అందుకనే, మనకు #రామాయణం లో హనుమంతుని పాత్రను ఉంచారు వాల్మీకి మహర్షి. భగవంతునిపై పరిపూర్ణమైన నమ్మకం, శరణాగతి ద్వారా వానరుడైన హనుమంతుడు ఊహించలేని అవరోధాలను దాటి ధర్మ పాలనలో తన ప్రభువైన రామచంద్రునికి తన వంతు సాయం చేశాడు. మరి ఆ హనుమంతునికి ఎన్ని అవరోధాలు? - మొదట కోతి జన్మ వలన చంచలమైన మనస్సు, తన శక్తి తను తెలుసుకోలేని బుద్ధి. వీటిని స్థిరపరుచుకొనుటకు రాముని పట్ల అచంచలమైన భక్తి, పూర్తి సమర్పణ ఉపయోగ పడింది. తరువాత రామభక్తుడనే ముద్ర  కలిగి ఉండటం వలన సాగరం దాటే సమయంలో ఎంతోమంది సహాయం పొందుతాడు. అలాగే, రామ నామ జపంతో రాక్షసులను సంహరించి మాత చెంతకు చేరుతాడు. తన మనసు చలించినప్పుడల్లా, ఆ ప్రభు నామ స్మరణ, దాని వలన ఆయన పట్ల తన కర్తవ్యము గుర్తుకు వచ్చి ముందుకు సాగుతాడు. సుందరకాండలో దీనికి ఉదాహరణలు ఎన్నో!!మండోదరిని చూసి సీత అనుకుని భ్రమించటం, సీతాదేవి కాన రాక, దాని వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఊహించుకొని.. దాని వలన నిరాశ, నిస...

రెండవ రోజు (ఆశ్వయుజ శుద్ధ విదియ) విజయవాడ "కనకదుర్గమ్మ" అమ్మవారు "శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి" అలంకారములో భక్తులకు దర్శనం ఇస్తారు.

Image
  ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥కాలాన్ని స్త్రీ పురుష రూపాత్మకంగా చెబుతారు. ఏడాదిలో చైత్రం మొదలు భాద్రపదమాసం వరకూ తొలి అర్ధ భాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు గల ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మకం. ప్రత్యేకించి రెండో అర్ధ భాగంలోని తొలి మాసం "ఆశ్వయుజం" అందుకే అమ్మవారి ఉపాసనకు ఈ నెల చాలా ప్రత్యేకం. అమ్మవారిని ఇంట్లో ఏర్పాటు చేసుకుని రోజుకు ఒక అవతారం పూజించి, అమ్మకు ఇష్టమైన నైవేద్యాన్ని అందించి నచ్చిన రంగు వస్త్రాలతో అలంకరించి దేవి కృపకు పాత్రులవుదాం.  🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸 రెండవ అవతారం "బ్రహ్మచారిణి" 💥 బ్రహ్మచారిణి : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున #అపర్ణ గా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి. 💥శ్రీ బాలా త్రిపురసుందరీదేవి రెండవ రోజు (ఆశ్వయుజ శుద్ధ విదియ) విజయవాడ "కనకదుర్గమ్మ" అమ్మవారు "శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి...

💥దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము💥 - (తాత్పర్య సహితం)

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥💥భోళాశంకరుడు💥💥 💥శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శివుడి లింగాకారం సాకార బ్రహ్మకు సంకేతం. ఆయన నిరాకారుడు. నిర్గుణుడు. త్రిశూలం సత్త్వ రజ స్తమో గుణాలకు, ఢమరుకం ఓంకార శబ్ద బ్రహ్మకు, చంద్రుడు నిశ్చల బుద్ధికి సూచకం. జటాజూటంలోని గంగ అమరత్వానికి చిహ్నం ! తన శరీరంపై వేలాడే సర్పాలు.. సమస్త ప్రాణకోటి పరమాత్మపై ఆధారపడతాయనడానికి సంకేతం. పాలభాగాన ఉన్న విభూతి సర్వ శుభాలకు సూచికైతే మూడో నేత్రం జ్ఞాన నేత్రం. 💥పరమశివుడు భక్తుల పక్షపాతి. మంత్రాలు, తంత్రాలు తెలియకపోయినా పర్వాలేదు.. మనస్ఫూర్తిగా ఏ ఒక్క పువ్వునైనా భక్తితో సమర్పిస్తే చాలు ఆనందపడతాడు. ఎనభై కల్పాల వరకు దుర్గతి లేకుండా చూస్తాడు.  🔸🔹🔸🔹🔸🔹🔸🔹 💥దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము💥 -             (తాత్పర్య సహితం) విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ || 1 || 🍁తాత్పర్యము: విశ్వేశ్వరుడు, నరకమనే సాగరమును దాటించేవాడు, శ్రవణానంద మైన వాడు, నెలవంకను ధరించిన వాడు, కర్పూరము యొక్క కాంతి వలె...

💥ఆది దంపతులు💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 నమో గౌరీశాయ స్ఫటిక దవళాజ్గాయచ నమో నమో లోకేశాయ స్తుతవిబుధలోకాయ చ నమః | నమః శ్రీ కంఠాయ క్షపితపురదైత్యాయ చ నమః నమః పాలక్షాయ స్మరమదవినాశాయ చ నమః || 💥గౌరీశ్వరునికి నమస్కారం. స్ఫటికంలా శుద్ధ ధవళకాంతులతో దీపించే లోకేశునికి, దేవతా సమూహంచే స్తుతింపబడేవానికి, శ్రీ (విషం) కంఠంలో ధరించినవానికి, త్రిపురాసురులను నిర్మూలనం చేసినవానికి, ఫాలభాగాన నేత్రంగల జ్ఞానమూర్తికి, మన్మథుని మదాన్ని వినాశనం చేసిన శివునికి నమస్మృతులు.    🔸🔹🔸🔹🔸🔹🔸🔹 💥ఆది దంపతులు 💥 శివపార్వతులు ఆది దంపతులు. పార్వతీ దేవి హిమవంతుని కూతురు. కలిగిన వారింట పుట్టిన పిల్ల. బాల్యంలో భోగ భాగ్యాలు అనుభవించింది. జంగ మయ్యను చేరాక అదంతా మటు మాయమైపోతుంది. కపాలం పట్టుకుని, భవతీ భిక్షాందేహీ అంటూ ఊరంతా తిరుగుతుంటారు భర్తగారు. వల్లకాడులో సంసారం నడపమంటాడు. రూపం కూడా ఎగుడు దిగుడు నేత్రాలతో ఉంటుంది. అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూలనాడదు. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకల మీదికి తెచ్చుకుంటాడు శివుడు. అయినా ఆయనను పల్లెత్తుమాటయినా అనని మహాఇల్లాలు పార్వతి. ఆకులయినా తినకుండా తపస్సు చేసి అపర్ణగా మారి ఆయనను త...

దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం "శైలపుత్రి"

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥ప్రతీ సంవత్సరం "ఆశ్వీయుజ" శుద్ధ "పాడ్యమి" మొదలు "నవమి" వరకు " దేవీనవరాత్రులు " లేదా శరన్నవరాత్రులని అంటారు. శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి.  అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక  ఉన్న చరిత్ర. 💥మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట. ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్‌|| పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||  🔸🔹🔸🔹🔸🔹🔸🔹 దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం "శైలపుత్రి" 💥 శైలపుత్రి : శైలపుత్రి దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంక...

మహాభారతం"లోని శాంతిపర్వం.. తృతీయాశ్వాసంలోని కథ..

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🌺🌼🌺🌼🌺🌼🌺🌼 💥"మహాభారతం"లోని శాంతిపర్వం..  తృతీయాశ్వాసంలోని కథ..  💥పూర్వం విదిశాపట్నంలో ఒక బ్రాహ్మణకుటుంబం ఉండేది. ఆ ఇంట్లోని ముక్కుపచ్చలారని పిల్లవాడు అర్థంతరంగా చనిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లవాడు చనిపోవడంతో బ్రాహ్మణుడి గుండె పగిలిపోయింది. ఆ శోకంలోనే పిల్లవాడిని తీసుకుని భార్యాభర్తలు స్మశానానికి చేరుకున్నారు. కానీ బిడ్డను అక్కడ వదిలి వెళ్లేందుకు వారికి చేతులు రావడంలేదు. ఆ దేహం పక్కన ఎంతసేపు ఏడ్చినా ఓదార్పు దక్కడం లేదు. ఇదంతా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనించింది. బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరింది. కానీ బాలుడి తల్లిదండ్రులు ఎంతకీ ఆ శవాన్ని వదిలివెళ్లడం లేదే! చీకటిపడిపోతే తను నేల మీద సంచరించడం కష్టం. అందుకని నిదానంగా ఆ కుటుంబం దగ్గరకి చేరింది-  "అయ్యా, ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు? చీకటిపడితే భూతప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి. కాబట్టి వెంటనే ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి" అంటూ తొందరపెట్టింది. ఇంతలో ఈ హడావుడి అంతా చూసి ఓ నక్క కూడా అటువైపుగా వచ్చింది. శవాన్ని చూసి దానికి కూడా నోరూరింది. కానీ ఆ శవం కోసం గద్ద కాచుకుని...

మహాలయ అమావాస్య:💥🙏

Image
 ⚜️🕉️🚩 ఓం భాస్కరాయ నమః🌹🙏 💥పురాణాల ప్రకారం ఏ వ్యక్తి అయినా తమ జీవితంలో మూడు ఋణాలు ఖచ్చితంగా తీర్చుకోవాలి. దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. సనాతన ధర్మం ప్రకారం దేవతల ఆరాధనకు ఎంత ఫలితం లభిస్తుందో దానికంటే 10 రెట్లు పుణ్యఫలం భాద్రపద మాసంలో చేసేటువంటి పితృ దేవతల ఆరాధనకు ఫలితం లభిస్తుంది. 💥పితృదేవత ఆరాధన: "పితృ దేవత ఆరాధన" అనగా మన 7 తరాలలో గతించినటువంటి తల్లిదండ్రులు, తాతముత్తాతలు, బంధువులు, గురువులు వీరి కోసం వదిలేటటువంటి తర్పణాలు, శ్రాద్ధకర్మలు, చేసేటువంటి దానాలు అని అర్థం. ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారికి సంవత్సరానికి ఒకసారి ఆ గతించిన తిథి రోజున శ్రాద్ధకర్మలు నిర్వర్తించాలి. అలా శ్రాద్ధకర్మలు ఆ సంవత్సరంలో ఆ తిథిలో జరపని పక్షంలో... భాద్రపదమాసంలో కృష్ణపక్షంలో (పితృ పక్షంలో) వచ్చేటువంటి తిథియందు ఆ శ్రాద్ధకర్మలు నిర్వర్తించినట్లయితే సంవత్సరంలో చేసేటటువంటి ఫలితం వారికి లభించును. 💥 మహాలయ అమావాస్య: మహాలయ అమావాస్య అనేది మన జీవితాలకు దోహద పడిన ముందటి తరాలకు చెందిన పూర్వీకులకు మన కృతజ్ఞతలు తెలుపుతూ సమర్పణలు అర్పించడం కోసం అంకితం చేయబడిన ప్రత్యేకమైన రోజు. పితృపక్షం చివరరోజునే #అశ...

అయినవాడే అందరికీ - అయినా అందడు ఎవ్వరికీ"

Image
 ⚜️🕉️🚩 జై శ్రీ కృష్ణ 💥🌹🙏 🌺🌺 గురుగోవిందం 🌺🌺 వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ । దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥🌹🙏 💥నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో కృష్ణయ్య యుగాలనాడే చూపించాడు. ముందుండి నడిపేవాడు సమస్యలకూ, సవాళ్లకూ భయపడి పారిపోకూడదు. చివరివరకూ విజయం మనదేనన్న భావంతో పోరాడాలి. తన బృందంలోనూ అదే స్ఫూర్తిని నింపాలి. గోకులంలో ఉన్నప్పుడు ఊరి సమస్యను తనదిగా భావించాడు కాబట్టే గోకులాన్ని రక్షించడానికి #గోవర్ధనగిరి ని చిటికెన వేలి మీద మోశాడు. తనవారికి కష్టం వచ్చినప్పుడు తాను ముందుండి పోరాడి జగత్తుకి దిశానిర్దేశం చేశాడు. జీవితమంటేనే పోరాటమని తెలిసినవాడు కాబట్టే జరాసంధుడితో పదిహేడుసార్లు యుద్ధం చేయాల్సి వచ్చినా వెనకడుగు వేయలేదు. యుద్ధంలో ఓడిపోయే సందర్భం ఎదురైన ప్రతిసారీ జరాసంధుడు పారిపోయేవాడు. కానీ మళ్లీ బలం పుంజుకుని యుద్ధానికి సై అనేవాడు. దీంతో వరుస యుద్ధాలు చేయక తప్పలేదు కన్నయ్యకు.  సమస్యలకు దూరంగా ఉండటమే కాదు, అపాయంలో ఉపాయం ఎలా ఆలోచించాలో చేసి చూపాడు. ఎప్పుడూ ఎదురెళ్లి పోరాడటమేకాదు ఒక్క అడుగు వెనక్కివేసినట్టు కనిపించైనా శత్రువుని తుద ముట్టించడమూ ఆయనకి తెలుసు. కాలయవనుడి ...

శ్రీవేంకటేశ్వర శరణాగతి స్తోత్రం💥💥 (సప్తర్షి కృతం)

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 💥🌷💥🌷💥🌷💥🌷💥 💥అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు... కోరిన కోర్కెలీడేర్చే దేవుడు.. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు.. భక్తుల పాలిట కొంగు బంగారం.. కలియుగ ప్రత్యక్ష దైవం... ఆ తిరుమలేశుడు. పిలిచినంతనే పలికే దేవుడు.. భక్త జనులకు కొండంత అండ ఆయనే.. సకల జనులను నిత్యం కాపాడే గోవిందుడు.. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడు.  ఆ కమలనాభుని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. ఒక్క క్షణం ఆ తిరుమలేశుని దర్శనం అయితే చాలు.. సకలం.. సర్వం మరచి.. భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఆ వేంకటేశ్వరుని దర్శనం కాగానే... సకల భక్త కోటి అణువణువూ పులకించిపోతుంది. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే, ఈశ్వరుడు అంటే దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామము ప్రసిద్ధి చెందింది. మానవ జీవితంలో కలిగే ఆపదలను తొలగించే దేవునిగా, ఆపదమొక్కుల వాడిగా జగత్ప్రసిద్ధి. 🔸🔹🔸🔹🔸🔹🔸🔹 💥💥 శ్రీవేంకటేశ్వర శరణాగతి స్తోత్రం💥💥                       (సప్తర్షి కృతం) శేషాచలాసమాసాద్య కశ్యపాద్యా మహర్షయః | వేం...

💥సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం💥భావం🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 🔱🌹🔱🌹🔱🌹🔱🌹🔱 💥సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం💥🙏           (బ్రహ్మ వైవర్త పురాణం) క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే। శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే॥  🍁భావం: భగవతీ! అంబా ! క్షమాశీలా ! పరాత్పరీ మమ్ములను క్షమింపుము. శుద్ధ సత్వస్వరూపిణీ ! కోపాదులను పరిత్యజింపుము. ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే। త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలం। 🍁భావం: సర్వసాధ్వులందు శ్రేష్ఠురాలా సర్వ దేవతా పూజితురాలా నీవు లేనిదే సర్వ జగములు మృత్యు తుల్యములై నిష్ఫలములు కాగలవు. సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ। రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః॥ 🍁భావం: దేవీ ! నీవు సంపత్స్వరూపిణివి, సర్వులయందు సర్వ రూపిణివి. రాసేశ్వర్యాధి దేవీ ! నీకళలనుండే సర్వులుద్భవించిరి కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా। స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే॥ 🍁భావం: కైలాసంలో పార్వతివి నీవే, క్షీరసాగరమును సింధు కన్యకవు నీవే, స్వర్గమునందు స్వర్గ లక్ష్మివి నీవే, భూలోక మందు మర్త్యలక్ష్మివి నీవే. వైకుంఠేచ మహాల...

💥 అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ 💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥🌺💥🌺💥🌺💥🌺💥 💥 అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ 💥 అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్. 💥భావం: అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మకు  మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. 💥వివరణ: 🍁అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ లలితాసహస్రము  "శ్రీమాతా" అనే నామముతో ప్రారంభమవుతుంది. "శ్రీమాతా" అంటే ’శ’ కార 'ర’ కార ’ఈ’ కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ  ఆయమ్మ  "లలితాపరాభట్టారికా స్వరూపం" ఆ అమ్మవారికి,  దుర్గాస్వరూపమునకు భేదం లేదు.  "అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ" ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వ...

💥💥శ్రీ దత్త స్తవం💥💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీదత్తాయ నమః 🌹🙏 💥సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయ పూర్వక నమస్కారము. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్త్వాన్ని బోధించడానికి "అత్రి మహాముని" పుత్రుడై జన్మించి, "శ్రీ దత్తాత్రేయుడు" అని పేరు పొందాడు. మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూఉంటాడు. 💥మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము. కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి, భయము తొలగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కల్గుతాయి. ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది. అపుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది. అంటే ఈ జగత్తు మిధ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్త్వం. 🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸 💥💥 శ్రీ దత్త స్తవం 💥💥 దత్తాత్రేయం మహాత్మానం వర...

💥💥యోగాసనంలో అయ్యప్ప దర్శనం💥💥

Image
 ⚜️🕉️🚩ఓం హరిహరాత్మజాయ నమః🌹🙏 💥💥 యోగాసనంలో అయ్యప్ప దర్శనం 💥💥 హరిహరాదుల అంశతో జన్మించిన శబరిమల అయ్యప్పస్వామి చిన్ముద్రిధారియై భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారు యోగాసనంలో కూర్చుంటారు. స్వామి మోకాళ్ల చుట్టూ బంధనం ఉంటుంది. దీన్ని #పట్టబంధనం అంటారు. మహిషి సంహారం కోసం మానవ రూపంలో అవతరించిన హరిహరసుతుడు పందళరాజు వద్ద పెరిగాడు. సంతానం లేక బాధపడుతోన్న పందళరాజు అడవిలో దొరికిన బాలుడిని మణికంఠుడిగా పెంచి పెద్ద చేశాడు. ఆయనకు విద్యాబుద్దులు చెప్పించి, రాజుగా పట్టాభిషేకం చేయాలని భావించాడు. అయితే తాను హరిహరసుతుడనని, ధర్మసంస్థాపన కోసం మానవ రూపంలో మహిషి సంహారం కోసం అవతరించాననే సత్యాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకున్నారు. మహిషిని వధించిన అయ్యప్పస్వామి తన అవతారం పూర్తయిందని పందళరాజుకు చెప్పి, తన కోసం ఆలయాన్ని నిర్మించమన్నారు. స్వామి కోరిక మేరకు శబరిమలలో పందళరాజు ఆలయం నిర్మించారు. అలా చిన్ముద్ర దాల్చి యోగాసనంలో జ్ఞాన పీఠంపై కూర్చుని భక్తులను అనుగ్రహిస్తుంటారు. శబరిగిరిపై ఆలయం నిర్మించి, స్వామికి ఆభరణాలు సమర్పించేందుకు పద్దెనిమిది మెట్లెక్కి పందళరాజు వస్తారు. తన పెంపుడు తండ్రి పందళరాజు రాకను గుర్త...

💥💥వినాయకుని నామాలు, వాటి అర్ధాలు💥💥

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 జయ విఘ్నేశ్వర! నమో నమో జగద్రక్షకా! నమో నమో జయకర! శుభకర! సర్వపరాత్పర! జగదుద్ధారా! నమో నమో మూషిక వాహన! నమోనమో మునిజనవందిత! నమో నమో మాయా రాక్షస మదాపహరణా! మన్మధారిసుత! నమోనమో 🔸🔹🔸🔹🔸🔹🔸 💥💥వినాయకుని నామాలు, వాటి అర్ధాలు💥💥 💥మహాగణపతి: మహా అనేది పరబ్రహ్మ వాచకము. గణపతి సర్వదేవతాత్మకుడు. 11 చేతులతో (10 చేతులు,1తొండం) వుంటాడు. ఆయా చేతులలో వివిధ దేవత సంకేతాలుగా, వారి వారి ఆయుధాలను ధరిస్తాడు. అవి: ఒక చేతిలో చక్రం - పద్మం = విష్ణు లక్ష్మీ తత్వం. ఒక చేతిలో త్రిశూలం - పాశం = శివ పార్వతి తత్వం. చెఱుకువిల్లు - నల్లకలువ = మన్మధుడు, రతీదేవి తత్వం. వరికంకి - గద = భూదేవి, వరాహస్వామి తత్వం. బీజాపూరం(దానిమ్మ పండు) - ఏకదంతం =  పుష్టి, పుష్టిపతి తత్వం. ఇక తొండంలో రత్న ఖచిత కలశం = మోక్షానికి సంకేతం. 💥లక్ష్మీ గణపతి: ఎవరి శక్తి వారికి ఐశ్వర్యం! అదే లక్ష్మీ అంటే.(గాయకుడికి- పాడగలడమే శక్తి) గణపతి యొక్కశక్తి యే లక్ష్మీ అంటే. (విష్ణుపత్ని లక్ష్మి అని ఇక్కడ కాదు) 💥నాట్య గణపతి: ఆనందంగా ఉన్నప్పుడే నాట్యం చేస్తారు. ఆనంద గణపతే నాట్య గణపతి అన్నా తాండవ గణపతి అన్నా కూడా. కాలం...

💥💥సర్వపాపహరణం షణ్ముఖ దర్శనం💥💥🙏మహిమాన్వితమైన కుమారస్తుతి💥🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏 ఓం గురునాథా సుబ్రహ్మణ్యం I సద్గురునాథా సుబ్రహ్మణ్యం  గజముఖ సోదర సుబ్రహ్మణ్యం I గురువన గురవే సుబ్రహ్మణ్యం  💥💥సర్వపాపహరణం షణ్ముఖ దర్శనం💥💥🙏 తారకాసురుర వధ తర్వాత ఒక రోజు యముడు ఈశ్వరుడితో "పరమేశ్వరా! నీవూ, బ్రహ్మదేవుడూ తీవ్ర తపస్సుకు సంతృప్తి చెందితే... యజ్ఞాలు, ఉపవాసాలతో విష్ణువు సంతుష్టి చెందుతాడు. నమస్కారాలతో సూర్యుడు, అర్ఘ్యపాద్యాలు అర్పించడంతో వినాయకుడు ఆనందిస్తారు. కానీ కుమారస్వామికి పూజలూ వ్రతాలూ కూడా అక్కర్లేకుండానే కార్తికంలో దర్శించినంత మాత్రాన సర్వ పాపాలు నశిస్తున్నాయి. చనిపోయినవాళ్లంతా స్వర్గానికి వెళ్తున్నారు. అందువల్ల నా విధిని నిర్వర్తించడానికి ఆటంకంగా ఉంది" అని చెప్పాడు. అందుకు పరమేశ్వరుడు దర్శనాచ్ఛ కుమారస్య సర్వే స్వర్గెకసో నరాః పాపినోపి మహాదేవ జాతా నాస్త్యత్ర సంశయః "యమధర్మరాజా! ప్రజలకు వారు పుణ్యాత్ములు అయితేనే తీర్థయాత్రలు చేయాలనే కోరిక, సత్కర్మలు చేయాలనే ఆసక్తి కలుగుతాయి. అలాగే గతంలో మంచి పనులు చేసిన వారికే కుమారస్వామి దర్శనమవుతుంది" అని వివరించాడు. సుబ్రహ్మణ్యుని "హే స...

సంజీవిని పర్వతాన్నే పెళ్ళగించి తెచ్చాడు హనుమంతుడు.🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 ఏకోదేవ స్సర్వద శ్రీ హనుమా | నేకోమంత్ర శ్రీహనుమత్ర్పకాశః | ఏకోమూర్తి శ్రీహనూమత్స్యరూపా | చైకం కర్మ శ్రీహనుమత్సపర్యా || సత్య పదార్థమైన బ్రహ్మము ఒకడే, ఆయనే హనుమ. ఒకటే మంత్రం ఉంది అది శ్రీ హనుమాన్ మంత్రమే. ఒకటే మూర్తి ఉంది ఆయనే హనుమ. ఇక మనం చేయవలసింది ఒకటే అది హనుమంతుని సేవ, వారి పూజ అని పరాశరుడు మైత్రేయునికి బోధించినట్లు తెలుస్తుంది. ఆంజనేయం మహావీర | బ్రహ్మవిష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం | రామదూతం సమామ్యహమ్ || హనుమ అంటే బ్రహ్మ, విష్ణు శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని, సృష్టి స్థితి లయకారకుడని, వీరుడంటే బ్రహ్మవేత్త అని, రామదూత అంటే శ్రీరాముని స్వరూప కథనము చేయువాడని, ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. యత్రాస్తి భోగో నహి మోక్షః యత్రాస్తి మోక్షోనమి తత్ర భోగః శ్రీమారుతీస్సేవనం తత్పరాణం | భోగశ్చ మోక్షశ్చ కరస్థఏవ || అంటే, కేవలం భోగాలలోనే ఉంటే మోక్షంరాదు. ఇక ముముక్షువులకయితే భోగాల ప్రసక్తి లేదు. కొందరు దేవతలు కేవలం భోగాలను మాత్రమే ఇస్తారు. మరి కొందరు మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఈ “ఆంజనేయస్వామి” వారు అటు భోగాన్ని, ఇటు మోక్షాన్ని రెంటిని ఇవ్వగల కల్పవృక్షం, కామధేనువు, ...

💥శివపురాణం – లింగావిర్భావం💥🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥🔱💥🔱💥🔱💥🔱 💥శివపురాణం – లింగావిర్భావం💥🙏 💥ఒకనాడు లింగావిర్భావ కాలము నందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి "నేను అధికుడను అంటే నేను అధికుడను" అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్ర స్థాయిని పొందుతుంటే దేవతల మొర విన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారి మధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుక్కోవడానికి #శ్రీమహావిష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. #బ్రహ్మగారు హంస వాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీపుష్పం (మొగలి పువ్వు) ఒకటి క్రింద పడింది. దానిని "నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?” అని అడిగారు. అపుడు మొగలిపువ్వు "ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను క్రింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు?" అని అడిగింది.  అపుడు బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా?’ అని అడిగారు. ఏమిటి కావాలి మీకు? అని అడిగింది మొగలిపువ్వు. ఆయన క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు. నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా? అని అడిగాడు. చెప్తాను అన్నది మొ...

💥💥సదాశివుడు💥💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺 💥🔱సదా శివం🔱💥 ఓ ప్రసిద్ధ శ్లోకంలో పరమశివుడి విశ్వరూపాన్ని వివరించారు. ఆ పాతాళ నభః స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిః స్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుత మేకమీకమనిశం రుద్రానువాకం జపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివమ్ పాతాళం నుంచి ఆకాశం చిట్టచివరి కొనవరకూ బ్రహ్మాండమైన ఆకారంలో శుద్ధ స్ఫటిక లింగరూపంగా పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. శిరస్సుపై కొలువైన చంద్రమండలం నుంచి వెలువడుతున్న అమృతధారలు ఆ స్వామికి చేస్తున్న అభిషేకంలా ప్రకాశిస్తున్నాయి. విశ్వమంతా తానొక్కడై నిండిన ఆ రుద్రమూర్తిని నా కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. -- అంటూ చేసిన వర్ణన ఆయన సర్వ వ్యాపకత్వాన్ని నిరూపిస్తుంది. 💥💥సదాశివుడు💥💥 "శివ" అనే పదానికి "ఏది లేదో... అది" అనే అర్థం ఉంది. అంటే అఖండ శూన్యం అనుకోవచ్చు. కంటికి కనిపించని అనంతమైన ఆ చీకటిలో నుంచే తేజోమయ ప్రపంచం అంతా ఆవిర్భవిస్తోంది. నక్షత్ర మండలాలు, కృష్ణ బిలాలు, సకల జీవరాశులు అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. అందులోనే లీనమై పోతున్నాయి. ఆ సువిశాలమైన శూన్యాన్నే ...

అరుణాచల ప్రాభవం💥🙏

Image
 ⚜️🕉️🚩 ఓం అరుణాచలేశ్వరాయ నమః🌹🙏 🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷 💥💥శివ వచనం💥💥 "స్వతః తేజోమయమైనప్పటికీ, కళావిహీనమైన సాధారణ కొండగా ఇక్కడ కనిపించుట ప్రాపంచిక క్షేమము కొరకైన నా దయావీక్షణమే. ఇక్కడ సిద్ధునిగా కూడా విరాజిల్లుతాను. నాలో(గిరి) అనేకానేక గుహలు భోగపూర్ణములై వైభవోపేతంగా ఉంటాయి. ఇది గ్రహించు. కర్మ ప్రతివారినీ ప్రపంచానికి బంధిస్తుంది. గిరి దర్శనంతోనే గిరిస్వరూపం ప్రసాదించే ఈ గిరియే సర్వులకు శరణ్యం. గిరిని సమీపం నుంచి గానీ, దూరంనుంచీ గానీ, దర్శించినా, లేదా తామున్న చోటనే వుండి దర్శించకనే మనసా స్మరించినా సరే గొప్ప కష్టాలు పడితేనే గానీ రాని వేదాంత విజ్ఞానమును జనులు పొందగలరు. ఈగిరి చుట్టూ మూడు యోజనాలు (24 మైళ్ళు) దూరంలో నివసించే వారంతా ఎటువంటి దీక్షలు లేకపోయినా శివ సాయుజ్యాన్ని పొందగలరని నేను ఆజ్ఞాపించుచున్నాను" పై వాస్తవాలను గ్రహించాలంటే భగవాన్‌ చూపిన మార్గాన్ని అనుసరించాలి.  🔸🔹🔸🔹🔸🔹🔸 "భగవాన్‌ శ్రీ రమణమహర్షు"ల వారు అరుణాచల వైభవాన్ని వర్ణించే వేలాది పురాణ శ్లోకాలను సేకరించారు. ఈ శ్లోకాల వాస్తవాలను వారెన్నో దర్శించారు కూడా. వీటిలో కొన్నిటిని తమిళంలోకి అనువదించగా అవి శ్రీ...

💥సూర్య మంత్రం💥🌅

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః🌹🙏 💥సూర్య మంత్రం💥🌅   నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే! ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!   💥అర్థం: ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు. శాంతిని వొసంగువాడవు. మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము. 🔸🔹🔸🔹🔸🔹🔸🔹 💥సూర్య నమస్కార మంత్రములు💥 ఓం ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణస్సరసిజాసన సన్నివిష్టః| కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః || ఓం మిత్రాయ నమః | ఓం రవయే నమః | ఓం సూర్యాయ నమః | ఓం భానవే నమః | ఓం ఖగాయ నమః | ఓం పూష్లే నమః | ఓం హిరణ్యగర్భాయ నమః | ఓం మరీచయే నమః | ఓం ఆదిత్యాయ నమః | ఓం సవిత్రే నమః | ఓం అర్కాయ నమః | ఓం భాస్కరాయ నమః | ఓం శ్రీసవితృసూర్యనారాయణాయ నమః || ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే || సేకరణ... 💐🙏 ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

💥త్రికాలములలో శ్రీరాముని ధ్యాన శ్లోకములు💥

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 💥🌹💥🌹💥🌹💥🌹 💥త్రికాలములలో శ్రీరాముని ధ్యాన శ్లోకములు💥 (శ్రీరామ కర్ణామృతమునుండి) ధ్యాయే ప్రాతస్సురేశం రవికులతిలకం రంజితానంతలోకం బాలం బాలారుణాక్షం భవముఖవినుతం భావగమ్యం భవఘ్నమ్, దీప్యంతం స్వర్ణక్లప్తై ర్మణిగణనికరై ర్భూషణై రుజ్జ్వలాంగం కౌసల్యాదేహజాతం మమ హృదయగతం రామ మీషత్ స్మితాస్యమ్. 💥దేవతల కధిపతియైనవాడు, సూర్యవంశశ్రేష్ఠుడు, ఎల్లలోకాలనూ ఆనందింపజేయువాడు, బాలుడు, లేతసూర్యుని పోలిన ఎఱ్ఱనైన నేత్రములు గలిగినవాడు, శివాదులచే స్తోత్రము చేయబడువాడు, హృదయమందు ధ్యానింప దగినవాడు, సంసారబాధను పోగొట్టువాడు, శ్రేష్ఠుడు, మణులు పొదగబడిన కనకాభరణములచే ప్రకాశించువాడు, కౌసల్య కుమారుడు, నా హృదయందున్నవాడు, చిరునవ్వు మోమువాడు అయిన రాముని ప్రాతఃకాలమందు ధ్యానము చేయుచున్నాను. మధ్యాహ్నే రామచంద్రం మణిగణలలితం మందహాసావలోకం మార్తాండానేకభాసం మరకతనికరాకార మానందమూర్తిమ్, సీతావామాంకసంస్థం సరసిజనయనం పీతవాసో వసానం వందేఽహం వాసుదేవం వరశరధనుషం మానసే మే విభాంతమ్. 💥మాణిక్యసమూహముచే సుందరుడు, చూపులతో చిరునవ్వులు చిందించువాడు, బహుసూర్యుల కాంతి గలిగిన వాడు, మరకత మణుల ప్రోగువంటి ఆకారము గ...

⚜️🕉️🚩ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః 🌹🙏💥💥శ్రీరాజరాజేశ్వరి అష్టకం💥💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః 🌹🙏 💥🌺💥🌺💥🌺💥🌺 💥సకల భువన బ్రహ్మాండాలకు "రాజరాజేశ్వరీ దేవి" ఆరాధ్య దేవత.  "మహాత్రిపుర సుందరి" గా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది.  ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది.  "రాజరాజేశ్వరి" స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి.  పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం.  ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని "రాజరాజేశ్వరీ దేవి" ఉద్దీపితం చేస్తుంది.  అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత.  బంగారం రంగు చీర ధరించి అమ్మవారు చతుర్భుజాలతో.. ఒక చేతిలో చెరకుగడ, ఇంకో చేతిలో అభయముద్రలతో...  దురహంకారులను శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది. "శ్రీ రాజరాజేశ్వరి దేవి" స్వప్రకాశ జ్యోతి స్వరూపిణిగా కోటి సూర్య సమప్రభగా విరాజల్లుతుంది.  కావున భక్తులతోపాటు రుషులు, మునులు, సిద్ధులు కూడా సిద్ధిధాత్రిని పూజిస్తారు.  ఆమె ప్రశాంతమైన చిరునవ్వు, చల్లని చూపుతో భక్తులను అనుగ్రహిస్తుంది. ...