దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం "శైలపుత్రి"
⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
💥ప్రతీ సంవత్సరం "ఆశ్వీయుజ" శుద్ధ "పాడ్యమి" మొదలు "నవమి" వరకు "దేవీనవరాత్రులు" లేదా శరన్నవరాత్రులని అంటారు.
శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది.
ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి.
అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర.
💥మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.
ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||
🔸🔹🔸🔹🔸🔹🔸🔹
దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం "శైలపుత్రి"
💥శైలపుత్రి:
శైలపుత్రి దక్షుని ప్రథమ పుత్రిక.
శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి.
పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు.
ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి.
ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.
💥శ్రీ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవి:
తొలి రోజు.. విజయవాడ కనకదుర్గ అమ్మవారు..
"శ్రీ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవి"గా భక్తులకు దర్శనం ఇస్తారు.
ఆ రోజు అమ్మను ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించుకోవాలి.
ఎందుకంటే ఎరుపు ఉత్తేజానికి సంకేతం అంటారు.
అలాగే నైవేధ్యం కట్టు పొంగలి, చలిమిడి , వడపప్పు , పాయసం పెట్టాలి.
ఎందుకంటే ఈ పదార్థంలోని మిరియాలు భూత, ప్రేత పిశాచాలను తరమడానికి నైవేద్యంగా పెడతారని పండితులు చెప్పే మాట.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment