💥ఎమ్మెస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా 💥🙏
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺
💥మానవ జన్మ అవరోధాలు, కష్టాలతో నిండి ఉంటే, మన ధర్మం నిర్వర్తించటం ఎలా?
మానసిక దౌర్బల్యం, శారీరక అశక్తత ఉంటే, మన కర్తవ్య పాలన ఎలా?
అందుకనే, మనకు #రామాయణం లో హనుమంతుని పాత్రను ఉంచారు వాల్మీకి మహర్షి.
భగవంతునిపై పరిపూర్ణమైన నమ్మకం, శరణాగతి ద్వారా వానరుడైన హనుమంతుడు ఊహించలేని అవరోధాలను దాటి ధర్మ పాలనలో తన ప్రభువైన రామచంద్రునికి తన వంతు సాయం చేశాడు.
మరి ఆ హనుమంతునికి ఎన్ని అవరోధాలు? -
మొదట కోతి జన్మ వలన చంచలమైన మనస్సు,
తన శక్తి తను తెలుసుకోలేని బుద్ధి.
వీటిని స్థిరపరుచుకొనుటకు రాముని పట్ల అచంచలమైన భక్తి, పూర్తి సమర్పణ ఉపయోగ పడింది.
తరువాత రామభక్తుడనే ముద్ర కలిగి ఉండటం వలన సాగరం దాటే సమయంలో ఎంతోమంది సహాయం పొందుతాడు.
అలాగే, రామ నామ జపంతో రాక్షసులను సంహరించి మాత చెంతకు చేరుతాడు.
తన మనసు చలించినప్పుడల్లా, ఆ ప్రభు నామ స్మరణ, దాని వలన ఆయన పట్ల తన కర్తవ్యము గుర్తుకు వచ్చి ముందుకు సాగుతాడు.
సుందరకాండలో దీనికి ఉదాహరణలు ఎన్నో!!మండోదరిని చూసి సీత అనుకుని భ్రమించటం,
సీతాదేవి కాన రాక, దాని వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఊహించుకొని..
దాని వలన నిరాశ, నిస్పృహ చెందటం, అప్పుడు మరల రామ నామ బలంతో, శుభ సూచనలు కలిగి ముందుకు వెళ్ళటం..
సీతాదేవి ముంగిట రాముని గుణ కీర్తన వలన ఆమెను సంతోషపరచటం.. ఆతృతలో లంకాదహనం కావించి చింతిస్తున్నప్పుడు రాముని స్మరణ వలన..
సీతాదేవికి ఎటువంటి హాని కలుగదు అనే దృఢ విశ్వాసం కలిగే స్థైర్యం కలగటం...
అలాగే యుద్ధ సమయంలో సంజీవని పర్వతం తెచ్చుట..
రామ లక్ష్మణులను మైరావణుని బారి నుండి కాపాడుట..
ఆ శక్తికి మూలం అచంచలమైన రామభక్తి, దాస్యము, శరణాగతి. మరి అంతటి మహనీయుని స్మరిస్తే మన బాధలు, పీడలు తొలగకుండా ఉంటాయా?
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
💥ఎమ్మెస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా 💥🙏
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు
బుద్ధిహీనతను గలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు
జయహనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ
ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ పదవిని సుగ్రీవున నిలిపి
జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక జేరుకొని
సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి
భీమరూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన
సీత జాడ గని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని
సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ
వానరసేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి
హోరుహోరున పోరు సాగిన అసుర సేనల వరుసను గూల్చిన
లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని శ్రీరామబాణము జరిపించెను రావణ సంహారము
ఎదురులేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు జేసిన
సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగిపొరలే
సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం
రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృత పాన
దుర్గమమగు ఏ కార్యమైనా సుగామమే యగు నీ కృపజాలిన
కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న
రామ ద్వారపు కాపరి వైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామజపము విని
ధ్వజా విరాజా వజ్ర శరీరా భుజబల తేజా గదాధరా
ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర
సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు
యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల
సోదర భరత సమానా యని శ్రీరాముడు ఎన్నిక గొన్న హనుమా
సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా
అష్టసిద్ధి నవనిధులకు దాతగ జానకీ మాత దీవించెనుగ
రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసిన
నీ నామ భజన శ్రీ రామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన
ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు
ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన
శ్రద్ధగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తి మీరగా గానము చేయగ ముక్తి గలుగు గౌరీశులు సాక్షిగా
తులసీదాస హనుమాన్ చాలీసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న
మంగళ హారతి గొను హనుమంత సీతా రామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment