💥💥సర్వపాపహరణం షణ్ముఖ దర్శనం💥💥🙏మహిమాన్వితమైన కుమారస్తుతి💥🙏
⚜️🕉️🚩ఓం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏
ఓం గురునాథా సుబ్రహ్మణ్యం I సద్గురునాథా సుబ్రహ్మణ్యం
గజముఖ సోదర సుబ్రహ్మణ్యం I గురువన గురవే సుబ్రహ్మణ్యం
💥💥సర్వపాపహరణం షణ్ముఖ దర్శనం💥💥🙏
తారకాసురుర వధ తర్వాత ఒక రోజు యముడు ఈశ్వరుడితో "పరమేశ్వరా! నీవూ, బ్రహ్మదేవుడూ తీవ్ర తపస్సుకు సంతృప్తి చెందితే...
యజ్ఞాలు, ఉపవాసాలతో విష్ణువు సంతుష్టి చెందుతాడు.
నమస్కారాలతో సూర్యుడు,
అర్ఘ్యపాద్యాలు అర్పించడంతో వినాయకుడు
ఆనందిస్తారు. కానీ
కుమారస్వామికి పూజలూ వ్రతాలూ కూడా అక్కర్లేకుండానే కార్తికంలో దర్శించినంత మాత్రాన సర్వ పాపాలు నశిస్తున్నాయి.
చనిపోయినవాళ్లంతా స్వర్గానికి వెళ్తున్నారు.
అందువల్ల నా విధిని నిర్వర్తించడానికి ఆటంకంగా ఉంది"
అని చెప్పాడు.
అందుకు పరమేశ్వరుడు
దర్శనాచ్ఛ కుమారస్య సర్వే స్వర్గెకసో నరాః
పాపినోపి మహాదేవ జాతా నాస్త్యత్ర సంశయః
"యమధర్మరాజా! ప్రజలకు వారు పుణ్యాత్ములు అయితేనే తీర్థయాత్రలు చేయాలనే కోరిక, సత్కర్మలు చేయాలనే ఆసక్తి కలుగుతాయి.
అలాగే గతంలో మంచి పనులు చేసిన వారికే కుమారస్వామి దర్శనమవుతుంది" అని వివరించాడు.
సుబ్రహ్మణ్యుని "హే స్వామినాథ కరుణాకర దీనబందో" అంటూ ప్రార్థిస్తే ఆశలు నెరవేరతాయని, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
💥మహిమాన్వితమైన కుమారస్తుతి💥🙏
ఓం నమ: ప్రణవార్థాయ ప్రణవార్థ విధాయినే
ప్రణవాక్షర బీజాయ ప్రణవాయ నమో నమ: || 1 ||
🍁ఓంకారము యొక్క అర్థము అయినవాడు,
ఓంకారముయొక్క అర్థమును బోధించువాడు,
ఓంకారములోని బీజాక్షర స్వరూపుడు,
ఓంకారస్వరూపుడు అగు స్కందునకు అనేక నమస్కారములు.
వేదాంతార్థ స్వరూపాయ వేదాంతార్థ విధాయినే
వేదాంతార్థవిదే నిత్యం విదితాయ నమో నమ: || 2 ||
🍁వేదాంతముచే తాత్పర్యభూతముగా ప్రతిపాదింపబడే స్వరూపము గల వాడు, వేదాంత తాత్పర్యమును బోధించువాడు, వేదాంత తాత్పర్యమును తెలిసినవాడు, నిత్యము మహాత్ములచే తెలియబడువాడు అగు స్కందునకు అనేకనమస్కారములు.
నమో గుహ్యాయ భూతానాం గుహాసు నిహితాయ చ
గుహ్యాయ గుహ్యరూపాయ, గుహ్యాగమవిదే నమ: || 3 ||
🍁ప్రాణుల బుద్ధియందు చైతన్యరూపముగా విలసిల్లువాడు, సర్వులచే తెలియబడని వాడు, రహస్యమగు స్వరూపము గలవాడు, రహస్యమగు శాస్త్రములనెరింగినవాడు అగు గుహునకు నమస్కారము.
అణోరణీయసే తుభ్యం మహతోపి మహీయసే
నమ: పరావ(ప) రజ్ఞాయ పరమాత్మ స్వరూపిణే || 4 ||
🍁అతిసూక్ష్మమైన దానికంటె సూక్ష్మమైనవాడు,
మిక్కిలి పెద్ద దారికంటె పెద్దవాడు,
కార్యకారణములనెరింగిన వాడు,
పరమాత్మ స్వరూపుడు అగు నీకు నమస్కారము.
స్కందాయ స్కందరూపాయ మహితారుణ తేజసే
నమో మందారమాలోద్యన్ముకుటాది భృతే సదా || 5 ||
🍁సూర్యుని వలె ఎర్రని కాంతి గలవాడు, సర్వదా మందారమాలతో ప్రకాశించే కిరీటము మొదలగు వాటిని ధరించినవాడు అగు స్కందుని రూపములోనున్న
శివునకు నమస్కారము.
శివశిష్యాయ పుత్రాయ శివస్య శివదాయినే
శివప్రియాయ శివయోరానందనిధయే నమ: || 6 ||
🍁శివునకు శిష్యుడు, శివుని పుత్రుడు, మంగళములనిచ్చువాడు, శివునకు ప్రియమైనవాడు, పార్వతీపరమేశ్వరులకు ఆనందనిధానమైనవాడు అగు కుమారస్వామికి నమస్కారము.
గాంగేయాయ నమస్తుభ్యం కార్తికేయాయ ధీమతే
ఉమాపుత్రాయ మహతే శరకాననశాయినే || 7 ||
🍁గంగాపుత్రుడు, కృత్తికల పుత్రుడు, బుద్ధిశాలి, పార్వతీపుత్రుడు, గొప్పవాడు, రెల్లు గడ్డియందు జన్మించినవాడు అగు నీకు నమస్కారము.
షడక్షర శరీరాయ షడ్విధాధ్వా విధాయినే
షడధ్వాతీత రూపాయ షణ్ముఖాయ నమో నమ: || 8 ||
🍁ఆరు అక్షరముల మంత్రమే శరీరముగా గలవాడు, ఆరు విధముల జ్ఞానమును బోధించువాడు, ఆరు మార్గములకు అతీతమైన రూపము గలవాడు, ఆరు ముఖములు గలవాడు అగు కుమారస్వామికి నమస్కారము.
ద్వాదశాయుత నేత్రాయ ద్వాదశోద్యత బాహవే
ద్వాదశాయుధధారాయ ద్వాదశాత్మన్నమోస్తుతే || 9 ||
🍁ద్వాదశాదిత్యుల రూపములో వెలుగొందు వాడా! పన్నెండు నిడివి కన్నులు గలవాడు, పైకి ఎత్తి పెట్టిన పన్నెండు బాహువులలో పన్నెండు ఆయుధములను దాల్చిన వాడు అగు నీకు నమస్కారము అగుగాక!
చతుర్భుజాయ శాంతాయ శక్తి కుక్కుటధారణే
వరదాయ విహస్తాయ నమో సురవిదారిణే || 10 ||
🍁నాలుగు భుజములు గలవాడు, శాంతస్వరూపుడు, రాక్షసులను సంహరించినవాడు అగు కుమారస్వామికి నమస్కారము
గజవల్లీ కుచాలిప్త కుంకుమాకింత వక్షసే
నమో గజాననానంద మహిమానందితాత్మనే || 11 ||
🍁గజవల్లియొక్క కుచములయందలి కుంకుమచే ఎర్రనైన వక్షఃస్థలము గలవాడు, విఘ్నేశ్వరుని మహిమలను మరియు ఆనందమును చూచి ఉప్పొంగే మనస్సు గలవాడు అగు కుమారస్వామికి నమస్కారము
బ్రహ్మాది దేవముని కిన్నర గీయమాన
గాధావిశేషశుచి చింతిత కీర్తిధామ్నె || 12 ||
🍁బ్రహ్మమొదలగు దేవతలు మునులు కిన్నరులు అను వారిచే గానము చేయబడే గాథలయందు విశేషముగా కీర్తింపబడిన పవిత్రత మరియు కీర్తి అను వాటికి నివాసస్థానమైన వాడవు!
బృందారకమల కిరీట విభూషణస్రక్
పూజాభిరామ పదపంకజ తే నమోస్తుతే || 13 ||
🍁దేవతల స్వచ్ఛమైన కిరీటములయందలి అలంకారమాలలచే పూజింపబడే సుందరమైన పద్మములవంటి పాదములు గలవాడవు అగు నీకు నమస్కారమగు గాక!
#ఫలశ్రుతి:
ఇతి స్కందస్తవం దివ్యం వామదేవేన భాషితం|
య: పఠేత్శృణుయాద్వాపి స యాతి పరమాంగతిం ||మహాప్రజ్ఞాకరం హ్యేతచ్చివభక్తి వివర్దనం |
ఆయురారోగ్య ధనకృత్సర్వ కామప్రదం సదా ||
🍁వామదేవునిచే పఠింపబడిన ఈ దివ్యమైన "స్కందస్తుతి"ని ఎవరైతే పఠించునో, లేదా వినునో వారు ఉత్తమగతిని పొందును.
ఈ స్తోత్రము గొప్ప బుద్ధి ఒసంగును; శివుని యందు భక్తిని వర్ధిల్ల జేయును; ఆయుర్దాయమును, ఆరోగ్యమును మరియు ధనమును కలుగజేయును;
సర్వ కాలములలో కోరికలనన్నింటినీ ఈడేర్చును.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment