రెండవ రోజు (ఆశ్వయుజ శుద్ధ విదియ) విజయవాడ "కనకదుర్గమ్మ" అమ్మవారు "శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి" అలంకారములో భక్తులకు దర్శనం ఇస్తారు.
⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
💥కాలాన్ని స్త్రీ పురుష రూపాత్మకంగా చెబుతారు.
ఏడాదిలో చైత్రం మొదలు భాద్రపదమాసం వరకూ
తొలి అర్ధ భాగం పురుష రూపాత్మకం.
ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు గల
ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మకం.
ప్రత్యేకించి రెండో అర్ధ భాగంలోని తొలి మాసం "ఆశ్వయుజం"
అందుకే అమ్మవారి ఉపాసనకు ఈ నెల చాలా ప్రత్యేకం.
అమ్మవారిని ఇంట్లో ఏర్పాటు చేసుకుని రోజుకు ఒక అవతారం పూజించి, అమ్మకు ఇష్టమైన నైవేద్యాన్ని అందించి నచ్చిన రంగు వస్త్రాలతో అలంకరించి దేవి కృపకు పాత్రులవుదాం.
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
రెండవ అవతారం "బ్రహ్మచారిణి"
💥బ్రహ్మచారిణి:
దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి.
పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది.
ఆకులు కూడా తినకుండా ఉన్నందున #అపర్ణ గా ప్రసిద్ధి.
పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి.
ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది.
ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.
💥శ్రీ బాలా త్రిపురసుందరీదేవి
రెండవ రోజు (ఆశ్వయుజ శుద్ధ విదియ) విజయవాడ "కనకదుర్గమ్మ" అమ్మవారు "శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి" అలంకారములో భక్తులకు దర్శనం ఇస్తారు.
దసరా ఉత్సవాల్లో భక్తులకు పూర్ణ ఫలం ఇచ్చే అలంకారం "శ్రీబాలాత్రిపుర సుందరీ దేవి"
అమ్మకు లేత గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి.
ఇక నైవేద్యంగా పులిహోరను పెట్టాలి. దీన్ని "చిత్రాన్నం" అని కూడా అంటారు.
దీన్ని ద్వారా సకల దోషాలు పోతాయని పండితులు చెబుతారు.
త్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది.
ఆమె ఎంతో మహిమాన్వితమైనది.
సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది.
సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment