మహాలయ అమావాస్య:💥🙏
⚜️🕉️🚩 ఓం భాస్కరాయ నమః🌹🙏
💥పురాణాల ప్రకారం ఏ వ్యక్తి అయినా తమ జీవితంలో మూడు ఋణాలు ఖచ్చితంగా తీర్చుకోవాలి.
దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం.
సనాతన ధర్మం ప్రకారం దేవతల ఆరాధనకు ఎంత ఫలితం లభిస్తుందో దానికంటే 10 రెట్లు పుణ్యఫలం భాద్రపద మాసంలో చేసేటువంటి పితృ దేవతల ఆరాధనకు ఫలితం లభిస్తుంది.
💥పితృదేవత ఆరాధన:
"పితృ దేవత ఆరాధన" అనగా మన 7 తరాలలో గతించినటువంటి తల్లిదండ్రులు, తాతముత్తాతలు, బంధువులు, గురువులు వీరి కోసం వదిలేటటువంటి తర్పణాలు, శ్రాద్ధకర్మలు, చేసేటువంటి దానాలు అని అర్థం.
ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారికి సంవత్సరానికి ఒకసారి ఆ గతించిన తిథి రోజున శ్రాద్ధకర్మలు నిర్వర్తించాలి.
అలా శ్రాద్ధకర్మలు ఆ సంవత్సరంలో ఆ తిథిలో జరపని పక్షంలో...
భాద్రపదమాసంలో కృష్ణపక్షంలో (పితృ పక్షంలో) వచ్చేటువంటి తిథియందు ఆ శ్రాద్ధకర్మలు నిర్వర్తించినట్లయితే సంవత్సరంలో చేసేటటువంటి ఫలితం వారికి లభించును.
💥మహాలయ అమావాస్య:
మహాలయ అమావాస్య అనేది మన జీవితాలకు దోహద పడిన ముందటి తరాలకు చెందిన పూర్వీకులకు మన కృతజ్ఞతలు తెలుపుతూ సమర్పణలు అర్పించడం కోసం అంకితం చేయబడిన ప్రత్యేకమైన రోజు.
పితృపక్షం చివరరోజునే #అశ్వినీఅమావాస్య అంటారు. దీనినే సర్వపితృఅమావాస్య, మహాలయ అమావాస్య అని కూడా అంటారు.
మహాలయ అమావాస్య నాడు ప్రజలు పవిత్ర నదుల్లో స్నానం చేసి... తమ పూర్వీకులకు తర్పణం, పిండదానం, శ్రాద్ధం చేస్తారు.
తద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందడంతోపాటు జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.
ప్రజలందరూ దసరా నవరాత్రులు, విజయదశమి ఇంకా దీపావళి లాంటి పండుగలు జరుపుకోవడం ప్రారంభించడానికి ముందే, మొట్ట మొదటి పంటను, పితరులపై తమకున్న గౌరవానికీ, ఇంకా కృతజ్ఞతా భావనకూ ప్రతీకగా, పిండం రూపంలో వారికి సమర్పిస్తారు.
💥మహాలయం అమావాస్య ప్రత్యేకత
ఏమిటంటే.. ఏ వ్యక్తి అయినా చనిపోయినా.. వారు ఏ తిథిలో చనిపోయారో తెలియకపోతే.. వారు గతించిన సంవత్సంలో.. చనిపోయిన తిథిలో శ్రాద్ధకర్మలు చేయలేని వారు.. కేవలం మహాలయ అమావాస్యరోజున వారికి శ్రాద్ధకర్మలు నిర్వర్తిస్తారు. అలా చేసిన వారికి పితృదేవతల ఆశీస్సులు కలిగి.. శుభ ఫలితాలు పొందుతారు.
శ్రాద్ధకర్మలు చేసి తర్పణాలు విడిచి పెట్టినటువంటి వారు పితృ దేవతలు ఆశీస్సులతో ఉత్తమ ఫలితాలు పొంది.. సుఖసౌఖ్యములు పొందుతారని పురాణాలు తెలియచేసాయి.
సేకరణ... 💐🙏
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
💥💥శ్రీ భాస్కర స్తోత్రం💥💥
హంసాయ భువనధ్వాంతధ్వంసాయాఽమితతేజసే |
హంసవాహనరూపాయ భాస్కరాయ నమో నమః || 1 ||
వేదాంగాయ పతంగాయ విహంగారూఢగామినే |
హరిద్వర్ణతురంగాయ భాస్కరాయ నమో నమః || 2 ||
భువనత్రయదీప్తాయ భుక్తిముక్తిప్రదాయ చ |
భక్తదారిద్ర్యనాశాయ భాస్కరాయ నమో నమః || 3 ||
లోకాలోకప్రకాశాయ సర్వలోకైకచక్షుషే |
లోకోత్తరచరిత్రాయ భాస్కరాయ నమో నమః || 4 ||
సప్తలోకప్రకాశాయ సప్తసప్తిరథాయ చ |
సప్తద్వీపప్రకాశాయ భాస్కరాయ నమో నమః || 5 ||
మార్తాండాయ ద్యుమణయే భానవే చిత్రభానవే |
ప్రభాకరాయ మిత్రాయ భాస్కరాయ నమో నమః || 6 ||
నమస్తే కమలానాథ నమస్తే కమలప్రియ |
నమః కమలహస్తాయ భాస్కరాయ నమో నమః || 7 ||
నమస్తే బ్రహ్మరూపాయ నమస్తే విష్ణురూపిణే |
నమస్తే రుద్రరూపాయ భాస్కరాయ నమో నమః || 8 ||
సత్యజ్ఞానస్వరూపాయ సహస్రకిరణాయ చ |
గీర్వాణభీతినాశాయ భాస్కరాయ నమో నమః || 9 ||
సర్వదుఃఖోపశాంతాయ సర్వపాపహరాయ చ |
సర్వవ్యాధివినాశాయ భాస్కరాయ నమో నమః || 10 ||
సహస్రపుత్రనేత్రాయ సహస్రాక్షస్తుతాయ చ |
సహస్రనామధేయాయ భాస్కరాయ నమో నమః || 11 ||
నిత్యాయ నిరవద్యాయ నిర్మలజ్ఞానమూర్తయే |
నిగమార్థప్రకాశాయ భాస్కరాయ నమో నమః || 12 ||
ఆదిమధ్యాంతశూన్యాయ వేదవేదాన్తవేదినే |
నాదబిందుస్వరూపాయ భాస్కరాయ నమో నమః || 13 ||
నిర్మలజ్ఞానరూపాయ రమ్యతేజస్స్వరూపిణే |
బ్రహ్మతేజస్స్వరూపాయ భాస్కరాయ నమో నమః || 14 ||
నిత్యజ్ఞానాయ నిత్యాయ నిర్మలజ్ఞానమూర్తయే |
నిగమార్థస్వరూపాయ భాస్కరాయ నమో నమః || 15 ||
కుష్టవ్యాధివినాశాయ దుష్టవ్యాధిహరాయ చ |
ఇష్టార్థదాయినే తస్మై భాస్కరాయ నమో నమః || 16 ||
భవరోగైకవైద్యాయ సర్వరోగాపహారిణే |
ఏకనేత్రస్వరూపాయ భాస్కరాయ నమో నమః || 17 ||
దారిద్ర్యదోషనాశాయ ఘోరపాపహరాయ చ |
దుష్టశిక్షణధుర్యాయ భాస్కరాయ నమో నమః || 18 ||
హోమానుష్ఠానరూపేణ కాలమృత్యుహరాయ చ |
హిరణ్యవర్ణదేహాయ భాస్కరాయ నమో నమః || 19 ||
సర్వసంపత్ప్రదాత్రే చ సర్వదుఃఖవినాశనే |
సర్వోపద్రవనాశాయ భాస్కరాయ నమో నమః || 20 ||
నమో ధర్మనిధానాయ నమః సుకృతసాక్షిణే |
నమః ప్రత్యక్షరూపాయ భాస్కరాయ నమో నమః || 21 ||
సర్వలోకైకపూర్ణాయ కాలకర్మాఘహారిణే |
నమః పుణ్యస్వరూపాయ భాస్కరాయ నమో నమః || 22 ||
ద్వంద్వవ్యాధివినాశాయ సర్వదుఃఖవినాశినే |
నమస్తాపత్రయఘ్నాయ భాస్కరాయ నమో నమః || 23 ||
కాలరూపాయ కళ్యాణమూర్తయే కారణాయ చ |
అవిద్యాభయసంహర్త్రే భాస్కరాయ నమో నమః || 24 ||
|| ఇతి భాస్కర స్తోత్రం ||
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment