సంజీవిని పర్వతాన్నే పెళ్ళగించి తెచ్చాడు హనుమంతుడు.🙏
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
ఏకోదేవ స్సర్వద శ్రీ హనుమా |
నేకోమంత్ర శ్రీహనుమత్ర్పకాశః |
ఏకోమూర్తి శ్రీహనూమత్స్యరూపా |
చైకం కర్మ శ్రీహనుమత్సపర్యా ||
సత్య పదార్థమైన బ్రహ్మము ఒకడే, ఆయనే హనుమ.
ఒకటే మంత్రం ఉంది అది శ్రీ హనుమాన్ మంత్రమే.
ఒకటే మూర్తి ఉంది ఆయనే హనుమ.
ఇక మనం చేయవలసింది ఒకటే అది హనుమంతుని సేవ, వారి పూజ అని పరాశరుడు మైత్రేయునికి బోధించినట్లు తెలుస్తుంది.
ఆంజనేయం మహావీర | బ్రహ్మవిష్ణు శివాత్మకం
బాలార్క సదృశాభాసం | రామదూతం సమామ్యహమ్ ||
హనుమ అంటే బ్రహ్మ, విష్ణు శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని,
సృష్టి స్థితి లయకారకుడని, వీరుడంటే బ్రహ్మవేత్త అని, రామదూత అంటే శ్రీరాముని స్వరూప కథనము చేయువాడని, ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది.
యత్రాస్తి భోగో నహి మోక్షః యత్రాస్తి మోక్షోనమి తత్ర భోగః
శ్రీమారుతీస్సేవనం తత్పరాణం | భోగశ్చ మోక్షశ్చ కరస్థఏవ ||
అంటే, కేవలం భోగాలలోనే ఉంటే మోక్షంరాదు.
ఇక ముముక్షువులకయితే భోగాల ప్రసక్తి లేదు. కొందరు దేవతలు కేవలం భోగాలను మాత్రమే ఇస్తారు. మరి కొందరు మోక్షాన్ని ప్రసాదిస్తారు.
ఈ “ఆంజనేయస్వామి” వారు అటు భోగాన్ని, ఇటు మోక్షాన్ని రెంటిని ఇవ్వగల కల్పవృక్షం, కామధేనువు, చింతామణిగా చెప్పుకోవచ్చని అర్థం.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్.
అంటే శ్రీ ఆంజనేయస్వామి వారు...
ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు కీర్తనలు చేస్తూ ఉంటారో! అచ్చోట ఆనంద బాష్పాలతో చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్షమవుతారని భక్తుల గాఢ నమ్మకం.
🔸🔹🔸🔹🔸🔹🔸
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!! 🙏
💥రామ రావణ యుద్ధం ప్రారంభం అయ్యింది.
యుద్దభూమి రక్తపు మడుగై పారుతున్నది.
ఈ వార్త విన్న రావణుడు తన ముద్దుల కుమారుడైన ఇంద్రజిత్తును యుద్దానికి పంపాడు.
ఇంద్రజిత్తు మహామాయలమారి.
మాయావిధ్యలు ఎన్నో తెలిసినవాడు.
అదృశ్యుడై యుద్ధం చేయగల నేర్పరి.
యుద్దభూమిలో ఇంద్రజిత్తును ఎదుర్కొనడానికి లక్ష్మణుడు ధనుర్బాణాలు చేతబట్టి శ్రీరామునికి నమస్కరించి ఆయన ఆశీర్వాదాలు పొంది రణరంగానికి వచ్చాడు.
ఇరువురి మధ్య బీకర యుద్ధం జరుగుతున్నది.
ఇంద్రజిత్తు 'శక్తి' అస్త్రాన్ని ప్రయోగించాడు.
ఆ అస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు.
లక్ష్మణుడు మరణించాడనుకొని రావణ సైన్యం విజయం తమదేనని ఆనందించింది.
💥సోదరుడు మూర్ఛపోయాడన్న వార్త శ్రీరాముడు తట్టుకోలేక పోయాడు.
"లక్ష్మణా! లక్ష్మణా!" అంటూ చిన్న పిల్లాడిలా విలపించాడు. విచారంతో ఎంతో దుఖిస్తున్నాడు.
సూర్యాస్తమయం అయ్యింది.
యుద్ధం ఆనాటికి విరమించారు. లక్ష్మణుని అలా చూసిన సుగ్రీవుడు వానర వైద్యుడైనటువంటి సుషేణునికి కబురు పంపి పిలిపించారు.
తెల్లవారే లోపు సంజీవకరణిమూలికలు తెస్తే లక్ష్మణునికి తెలివి వస్తుందని సుషేణుడు చెప్పాడు.
సంజీవి మూలికలు సంజీవపర్వతం లో ఉన్నాయి.
ఆ పర్వతం ఎన్నో ఆమడల దూరంలో ఉంది.
తెల్లారే లోపు అక్కడకు వెళ్లి వచ్చేవారు ఎవరు?
ఇది సాధ్యమా?
ఈ కార్యం సాధించగలవారెవరు అని వానర యోధులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. శ్రీరాముడు హనుమంతుని వైపు చూశాడు.
💥హనుమంతుడు లేచి "రామచంద్రా! నీ కంట కన్నీరు నేను చూడలేను. తెల్లవారే లోపు సంజీవినిని నేను తెగలను" అని శ్రీరామునికి నమస్కరించి,
సంజీవిని వివరాలు సుషేణుని ద్వారా తెలుసుకుని బయలుదేరాడు. వాయువేగంతో సంజీవిని పర్వతం చేరుకున్నాడు.
అందులో సంజీవిని ఎదో తెలుసుకోవడం కష్టంగా ఉంది హనుమంతునికి. సమయం మించిపోతుంది.
కాలయాపన చేయక సంజీవిని పర్వతాన్నే పెళ్ళగించి తెచ్చాడు హనుమంతుడు.
సంజీవి పర్వతం నేలపై పెట్టడానికి సరిపోదు.
అంత పెద్ద పర్వతం హనుమంతుడు తన అరచేతిలో పట్టుకున్నాడు. సుషేణుడు పర్వతం ఎక్కి సంజీవి మూలికలు తీసుకొని లక్ష్మణునికి వైద్యం చేశాడు.
కొద్దిసేపటికి లక్ష్మణుడు కళ్ళు తెరిచాడు.
హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తిరిగి తీసుకెళ్ళి యధాస్థానంలో ఉంచి తిరిగొచ్చాడు. ఇదంతా తెల్లవారక ముందే జరిగింది.
💥యుద్దభేరి మోగింది.
ధనుర్బాణాలు చేత బట్టిన లక్ష్మణుడు యుద్దభూమిలో ప్రత్యక్షం అయ్యేటప్పటికి ఇంద్రజిత్తు ఆశ్చర్యపోయాడు.
చివరిగా లక్ష్మణుడు ' దివ్యాస్త్రం ' ప్రయోగించాడు.
ఇంద్రజిత్తు శిరస్సు తెగి నేలపై పడింది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment