💥💥యోగాసనంలో అయ్యప్ప దర్శనం💥💥

 ⚜️🕉️🚩ఓం హరిహరాత్మజాయ నమః🌹🙏


💥💥యోగాసనంలో అయ్యప్ప దర్శనం💥💥


హరిహరాదుల అంశతో జన్మించిన శబరిమల అయ్యప్పస్వామి చిన్ముద్రిధారియై భక్తులకు దర్శనమిస్తారు.

స్వామివారు యోగాసనంలో కూర్చుంటారు.

స్వామి మోకాళ్ల చుట్టూ బంధనం ఉంటుంది.

దీన్ని #పట్టబంధనం అంటారు.


మహిషి సంహారం కోసం మానవ రూపంలో అవతరించిన హరిహరసుతుడు పందళరాజు వద్ద పెరిగాడు.

సంతానం లేక బాధపడుతోన్న పందళరాజు అడవిలో దొరికిన బాలుడిని మణికంఠుడిగా పెంచి పెద్ద చేశాడు.


ఆయనకు విద్యాబుద్దులు చెప్పించి, రాజుగా పట్టాభిషేకం చేయాలని భావించాడు.

అయితే తాను హరిహరసుతుడనని, ధర్మసంస్థాపన కోసం మానవ రూపంలో మహిషి సంహారం కోసం అవతరించాననే సత్యాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకున్నారు.

మహిషిని వధించిన అయ్యప్పస్వామి తన అవతారం పూర్తయిందని పందళరాజుకు చెప్పి,

తన కోసం ఆలయాన్ని నిర్మించమన్నారు.

స్వామి కోరిక మేరకు శబరిమలలో పందళరాజు

ఆలయం నిర్మించారు.

అలా చిన్ముద్ర దాల్చి యోగాసనంలో జ్ఞాన పీఠంపై కూర్చుని భక్తులను అనుగ్రహిస్తుంటారు.

శబరిగిరిపై ఆలయం నిర్మించి, స్వామికి ఆభరణాలు సమర్పించేందుకు పద్దెనిమిది మెట్లెక్కి పందళరాజు వస్తారు.


తన పెంపుడు తండ్రి పందళరాజు రాకను గుర్తించిన స్వామి యోగాసనం నుంచి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తారు.

దీంతో పందళరాజు స్వామివారిని నిలువరించి తన భుజాన ఉన్న పట్టు వస్త్రంతో స్వామివారి మోకాళ్లకు చుట్టి బంధిస్తారు.

తాను అయ్యప్పస్వామిని ఏ విధంగా చూసి తరించానో అదే విధంగా భక్తులకు అదే రూపంలో దర్శనం ఇవ్వాలని అయ్యప్పస్వామిని అర్థించడంతో ఆయన అనుగ్రహించారు.

అలా కట్టి ఉన్న దానిని "పట్ట బంధం" అంటారు.


ఇది శివకేశవులను ఐక్య పరిచే బంధమని కూడా అంటారు. తనకు ఎలాంటి భవబంధాలు లేవని చెప్పడానికి

స్వామి ఈ ఆసనంలో కూర్చుంటారని అంటారు.

🔸🔹🔸🔹🔸🔹🔸🔹


💥💥 శ్రీ శబరిగిరీశాష్టకం💥💥


యజన సుపూజిత యోగివరార్చిత యాదువినాశక యోగతనో

యతివర కల్పిత యంత్రకృతాసన యక్షవరార్పిత పుష్పతనో |

యమనియమాసన యోగిహృదాసన పాపనివారణ కాలతనో

జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 1 ||


మకర మహోత్సవ మంగళదాయక భూతగణావృత దేవతనో

మధురిపు మన్మథమారక మానిత దీక్షితమానస మాన్యతనో |

మదగజసేవిత మంజుల నాదక వాద్య సుఘోషిత మోదతనో

జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 2 ||


జయ జయ హే శబరీగిరినాయక సాధయ చింతితమిష్టతనో

కలివరదోత్తమ కోమల కుంతల కంజసుమావలికాంత తనో |

కలివరసంస్థిత కాలభయార్దిత భక్తజనావనతుష్టమతే

జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || ౩ ||


నిశిసురపూజన మంగలవాదన మాల్యవిభూషణ మోదమతే

సురయువతీకృతవందన నర్తననందిత మానస మంజుతనో |

కలిమనుజాద్భుత కల్పిత కోమల నామ సుకీర్తన మోదతనో

జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 4 ||


అపరిమితాద్భుత లీల జగత్పరిపాల నిజాలయ చారుతనో

కలిజనపాలన సంకటవారణ పాపజనావనలబ్ధతనో |

ప్రతిదివసాగత దేవవరార్చిత సాధుముఖాగత కీర్తితనో

జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 5 ||


అపరిమితాద్భుత లీల జగత్పరిపాల నిజాలయ చారుతనో

కలిజనపాలన సంకటవారణ పాపజనావనలబ్ధతనో |

ప్రతిదివసాగత దేవవరార్చిత సాధుముఖాగత కీర్తితనో

జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 6 ||


కలిమల కాలన కంజవిలోచన కుందసుమానన కాంతతనో

బహుజనమానస కామసుపూరణ నామజపోత్తమ మంత్రతనో |

నిజగిరిదర్శన యాతుజనార్పిత పుత్రధనాదిక ధర్మతనో

జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 7 ||


శతమఖపాలక శాంతివిధాయక శత్రువినాశక శుద్ధతనో

తరునికరాలయ దీనకృపాలయ తాపసమానస దీప్తతనో |

హరిహరసంభవ పద్మసముద్భవ వాసవ శంబవ సేవ్యతనో

జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 8 ||


మమకులదైవత మత్పితృపూజిత మాధవ లాలిత మంజుమతే

మునిజనసంస్తుత ముక్తివిధాయక శంకరపాలిత శాంతమతే |

జగదభయంకర జన్మఫలప్రద చందనచర్చిత చంద్రరుచే

జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 9 ||


అమలమనంత పదాన్విత రామ సుదీక్షిత సత్కవిపద్యమిమం

శివ శబరీగిరి మందిర సంస్థిత తోషదమిష్టదమార్తిహరమ్ |

పఠతి శృణోతి చ భక్తియుతో యది భాగ్యసమృద్ధిమథో లభతే

జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 10 ||

ఇతి శ్రీ శబరీగిరిశాష్టకమ్ |

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు