⚜️🕉️🚩ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః 🌹🙏💥💥శ్రీరాజరాజేశ్వరి అష్టకం💥💥

 ⚜️🕉️🚩ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః 🌹🙏

💥🌺💥🌺💥🌺💥🌺


💥సకల భువన బ్రహ్మాండాలకు "రాజరాజేశ్వరీ దేవి" ఆరాధ్య దేవత. 

"మహాత్రిపుర సుందరి" గా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. 

ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. 

"రాజరాజేశ్వరి" స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. 


పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. 

ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది.

ఈమె యోగమూర్తి.

మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని "రాజరాజేశ్వరీ దేవి" ఉద్దీపితం చేస్తుంది. 


అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. 

బంగారం రంగు చీర ధరించి అమ్మవారు చతుర్భుజాలతో.. ఒక చేతిలో చెరకుగడ, ఇంకో చేతిలో అభయముద్రలతో... 

దురహంకారులను శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది.


"శ్రీ రాజరాజేశ్వరి దేవి" స్వప్రకాశ జ్యోతి స్వరూపిణిగా కోటి సూర్య సమప్రభగా విరాజల్లుతుంది. 

కావున భక్తులతోపాటు రుషులు, మునులు, సిద్ధులు కూడా సిద్ధిధాత్రిని పూజిస్తారు. 

ఆమె ప్రశాంతమైన చిరునవ్వు, చల్లని చూపుతో భక్తులను అనుగ్రహిస్తుంది.


💥💥శ్రీరాజరాజేశ్వరి అష్టకం💥💥


అంబా శాంభవి చంద్రమౌళీ రబలా వర్ణా ఉమా పార్వతీ

కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీభైరవీ

సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మి ప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి


అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సందాయనీ

వాణీ వల్లవపాణీ వేణు మురళీగాన ప్రియాలోలినీ

కళ్యాణీ ఉడు రాజబింబ వదనా ధూమ్రాక్ష సంహారిణి

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి


అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హేరావళి

జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ విరాజితా

వీణా వేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి


అంబా రౌద్రాణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ

బ్రహ్మణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా

చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణి వల్లవీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి


అంబా శూలధను: కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ

వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీ రామాసేవితా

మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి


అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా

గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా

ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి


అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా

యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ

యా పంచ ప్రణవాది రేఫ జననీ యా చిత్కళా మాలినీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి


అంబా పాలిత భక్తి రాజి రనిశం అంబాష్టకం యః పఠే

అంబాలోకకటాక్ష వీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా

అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

🔸🔹🔸🔹🔸🔹🔸🔹


💥సమస్త దేవతలకు, సమస్త మూర్తులకు అధిష్ఠానియై శ్రీచక్రస్థిత అయినటు వంటి ఈ రాజరాజేశ్వరి ఉపాసన... 

భవ బంధాలను తొలగించడమే కాకుండా, ఇహపర ముక్తిదాయిని. 


ఈ లోకంలో అత్యున్నత శ్రేణి పదవులను, భోగాలను అందిస్తూ పరలోక ముక్తిని కలిగించే తత్వం ఈ రూపానిదే. 

అందుకే ఈమెను "చిద్రూపి" పరదేవతగా కొలుస్తారు. అన్ని రకాల విజయాలకు మూలమైన ఈ తత్వ ఉపాసన అందరికీ అవసరమే. 

ఆ తల్లిని ఆరాదిద్దాం, సేవిద్దాం, ఆనందిద్దాం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥