💥 అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ 💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏

💥🌺💥🌺💥🌺💥🌺💥


💥 అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ 💥


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ

చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి

పుచ్చినయమ్మ దన్ను లో నమ్మిన వేల్పుటమ్మల

మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ,

కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.


💥భావం:

అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మకు  మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ.


💥వివరణ:


🍁అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ


లలితాసహస్రము  "శ్రీమాతా" అనే నామముతో ప్రారంభమవుతుంది. "శ్రీమాతా" అంటే ’శ’ కార 'ర’ కార ’ఈ’ కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ  ఆయమ్మ  "లలితాపరాభట్టారికా స్వరూపం" ఆ అమ్మవారికి,  దుర్గాస్వరూపమునకు భేదం లేదు. 

"అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ" ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు.

ఈ ముగురమ్మల మూలపుటమ్మ.


🍁చాల బెద్దమ్మ


మహాశక్తి అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన శక్తిస్వరూపము. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదము లేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉన్నది.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని,  లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.


🍁సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ


సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ దితి. దితి ఏడిచేటట్లుగా కడుపు శోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.


🍁దన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ


బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.

ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు.

వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు.

ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.


🍁దుర్గమాయమ్మ

ఈ దుర్గమ్మే "లలితా పరాభట్టారిక" ఆ అమ్మ మాయమ్మ.


🍁కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్


ఆవిడ దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇచ్చెయ్యాలి.

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸


💥అమ్మవారికి "శాక్తేయప్రణవములు" అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి.

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః - ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములని పిలుస్తారు.


మహత్వమునకు బీజాక్షరము 'ఓం’

కవిత్వమునకు బీజాక్షరము 'ఐం’

పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము  'హ్రీం”,

సంపదలు లక్ష్మీదేవి 'శ్రీం’ 


'ఓంఐంహ్రీంశ్రీం’ అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రే నమః’  


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ -  అనుకుంటుంటే మీరు మరో రూపంలో

'ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’

'ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’

అంటూ ఎప్పుడూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. 


'ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు.  'అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ’ అనడానికి కష్టం ఉండదు. 


               💥సర్వేజనాః సుఖినోభవంతు💥🙏

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు