💥సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం💥భావం🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
🔱🌹🔱🌹🔱🌹🔱🌹🔱
💥సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం💥🙏
(బ్రహ్మ వైవర్త పురాణం)
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే।
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే॥
🍁భావం:
భగవతీ! అంబా ! క్షమాశీలా ! పరాత్పరీ మమ్ములను క్షమింపుము. శుద్ధ సత్వస్వరూపిణీ ! కోపాదులను పరిత్యజింపుము.
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే।
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలం।
🍁భావం:
సర్వసాధ్వులందు శ్రేష్ఠురాలా సర్వ దేవతా పూజితురాలా నీవు లేనిదే సర్వ జగములు మృత్యు తుల్యములై నిష్ఫలములు కాగలవు.
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ।
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః॥
🍁భావం:
దేవీ ! నీవు సంపత్స్వరూపిణివి, సర్వులయందు సర్వ రూపిణివి. రాసేశ్వర్యాధి దేవీ ! నీకళలనుండే సర్వులుద్భవించిరి
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా।
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే॥
🍁భావం:
కైలాసంలో పార్వతివి నీవే, క్షీరసాగరమును సింధు కన్యకవు నీవే, స్వర్గమునందు స్వర్గ లక్ష్మివి నీవే, భూలోక మందు మర్త్యలక్ష్మివి నీవే.
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ।
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః॥
🍁భావం:
వైకుంఠమందు మహాలక్ష్మివి నీవే దేవ దేవివైన సరస్వతివి నీవే, గంగవు, తులసి, బ్రహ్మ లోకమందు సావిత్రివి నీవే.
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయం।
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే॥
🍁భావం:
గోలోకమందు నీవే స్వయముగ కృష్ణ ప్రాణాధి దేవి వైన రాధవు, రాసమండలమందు రాసేశ్వరివి, బృందావనమందు బృందవునీవు.
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే।
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ।
🍁భావం:
భాంఢీర వనమందు కృష్ణ ప్రియవు నీవే, చందన కాననమందు చంద్రవు నీవే, చంపక వనమందు విరజా దేవివి నీవే. శతశృంగమందు సుందరివి నీవే.
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే।
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే॥
🍁భావం:
పద్మవనమందు పద్మావతివి, మాలతీ వనమందు మాలతివి, కుంద వనమందు కుందదంతివి, కేతకీ వనమందు సుశీలవు నీవే.
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ।
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే॥
🍁భావం:
కదంబ కాననమందు నీవే కదంబమాలవు, రాజు గృహమందు రాజలక్మివి, గృహములందు గృహలక్ష్మివి నీవే.
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా।
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః॥
🍁భావం:
ఇట్లు సర్వ దేవతలు, మహర్షులు, మనువులు స్తుతించి రోదించుచు నమ్ర వదనులై శుష్క కంఠోష్ఠ తాలుకా యుక్తులై అమ్మయెదుట నిలువబడిరి.
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం।
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువం॥
🍁భావం:
పుణ్యమయమైన, శుభప్రదమైన సర్వదేవతలు స్తుతించిన యీ లక్ష్మీస్తోత్రమును ప్రాతః కాలమున పఠించువారికి సర్వమనొ వాంఛితలు తప్పక లభింపగలవు.
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం।
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీం॥
🍁భావం:
భార్య లేని వారికి వినీతురాలైన, సతియైన, సుశీలయైన, సుందరియైన, సుప్రియవాదినియైన,
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం।
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం॥
🍁భావం:
శుద్ధురాలైన, ఉత్తమకుల సంజాతయైన పుత్రపౌత్రనతియైన భార్య లభింపగలదు. పుత్రులు లేని వారికి వైష్ణవుడైన, చిరంజీవియైన
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినం।
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియం॥
🍁భావం:
పరమైశ్వర్య యుక్తుడైన యశస్వియైన, విద్యావంతుడైన పుత్రుడు లభింపగలదు.
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్॥
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువం॥
🍁భావం:
బంధువియోగము సంభవించిన వారికి బంధువులు, ధన భ్రష్టులకు ధనము లభింపగలదు. కీర్తిహీనులకు కీర్తి ప్రతిష్ఠలు నిశ్చయముగ లభింపగలవు.
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనం।
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదం॥
🍁భావం:
సర్వ మంగళప్రదమైన యీస్తోత్రము శోకసంతాప నాశకము, హర్షానందకరము, ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదింపగలదు.
॥ ఇతి సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్ ॥
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment