మూడవ రోజు (ఆశ్వయుజ శుద్ధ తదియ) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ "గాయత్రీదేవి"గా సాక్షాత్కరిస్తుంది.
⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
సర్వం రూపమయీ దేవీ, సర్వం దేవమయం జగత్
అతోహం విశ్వరూపాం, తాం నమామి పరమేశ్వరీమ్
💥నవరాత్రులలో ముగ్గురమ్మల మూలపుటమ్మకు తోడుగా ఆమెతో పాటు తొమ్మిది శక్తులు ఉంటాయని దేవీపురాణం చెబుతోంది.
దుష్టశిక్షణ, లోక సంరక్షణ కోసం శక్తిస్వరూపణి ఎత్తిన అవతారాలే నవదుర్గలు.
ఆ తొమ్మిది రూపాలను షోడశోపచారాలతో పూజించి ఆరాధించే పర్వదినాలే శరన్నవరాత్రులు.
🍁అమ్మవారి మూడో అవతారం "చంద్రఘంట"
💥చంద్రఘంట:
పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
శిరస్సుపై అర్థచంద్రుడిని ధరించి ఉంటుంది.. అందుకే ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది.
ఈ రూపాన్ని దర్శించుకున్నవారికి అన్నపానీయాలకు లోటుండదు.
ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం.
ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయ ఘంట మోగుతూ ఉంటుంది.
🍁శరన్నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు
(ఆశ్వయుజ శుద్ధ తదియ) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ "గాయత్రీదేవి"గా సాక్షాత్కరిస్తుంది.
💥గాయత్రీదేవి
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రంకపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే
వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ తల్లి.. ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది.
పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలూ తొలగుతాయనీ, బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల నమ్మకం.
💥గాయత్రీదేవి విశిష్టత:
సకల వేద స్వరూపం గాయత్రీదేవి.
అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత.
ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది.
ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది.
సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి.
బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది.
గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేదం పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.
💥మంత్రం:
"ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యసధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అమ్మను ధ్యానించాలి.
💥కాషాయ లేదా నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే ఈ రంగు ఆటంకాలను తొలగించి.. విజయాలను చేకూరుస్తుంది.
కొబ్బరి అన్నాన్ని, పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. ఎందుకంటే పూర్ణఫలాన్ని పొందడానికి ఈ నైవేద్యాన్ని పెడతారన్నది పండితుల మాట.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment