💥💥సదాశివుడు💥💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺


💥🔱సదా శివం🔱💥


ఓ ప్రసిద్ధ శ్లోకంలో పరమశివుడి విశ్వరూపాన్ని వివరించారు.


ఆ పాతాళ నభః స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర

జ్యోతిః స్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతైః

అస్తోకాప్లుత మేకమీకమనిశం రుద్రానువాకం జపన్

ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివమ్


పాతాళం నుంచి ఆకాశం చిట్టచివరి కొనవరకూ బ్రహ్మాండమైన ఆకారంలో శుద్ధ స్ఫటిక లింగరూపంగా పరమేశ్వరుడు ఆవిర్భవించాడు.

శిరస్సుపై కొలువైన చంద్రమండలం నుంచి వెలువడుతున్న అమృతధారలు ఆ స్వామికి చేస్తున్న అభిషేకంలా ప్రకాశిస్తున్నాయి.

విశ్వమంతా తానొక్కడై నిండిన ఆ రుద్రమూర్తిని

నా కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నాను.

-- అంటూ చేసిన వర్ణన ఆయన సర్వ వ్యాపకత్వాన్ని నిరూపిస్తుంది.


💥💥సదాశివుడు💥💥


"శివ" అనే పదానికి "ఏది లేదో... అది" అనే అర్థం ఉంది. అంటే అఖండ శూన్యం అనుకోవచ్చు.

కంటికి కనిపించని అనంతమైన ఆ చీకటిలో నుంచే తేజోమయ ప్రపంచం అంతా ఆవిర్భవిస్తోంది.

నక్షత్ర మండలాలు, కృష్ణ బిలాలు, సకల జీవరాశులు అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి.

అందులోనే లీనమై పోతున్నాయి.

ఆ సువిశాలమైన శూన్యాన్నే 'శివ' అంటారు.

అంటే అన్నీ శివుడి నుంచే వచ్చి, తిరిగి ఆయనలోనే కలిసిపోతున్నాయని అర్థం చేసుకోవాలి.


శివ అంటే "చలనంలేని వాడు" అనే మరో అర్థం

కూడా ఉంది. ఇక్కడ చలనం లేకపోవడమంటే

జడత్వం అని కాదు.

సృష్టిలోని అణువణువులోనూ ఉన్న పరమేశ్వరుడు

కదలటానికి అవకాశం ఎక్కడ?

అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది.


నిరంతరం ఉంటాడు కాబట్టే ఆయన్ని సదా శివుడని అంటారు. జగత్తులో కదిలేది.. కదలనిది..

అంతా ఆయనే కదా.


💥మనలో ఉండే పంచకర్మేంద్రియాలు (వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ),

పంచజ్ఞానేంద్రియాలు (చర్మం, కన్ను, నాలుక, చెవి, ముక్కు),

"మనస్సు", "జీవుడు"... ఈ పన్నెండింటిలో నిండి ఉండేది పరమేశ్వరుడే కాబట్టి మనలోని శివతత్త్వం

ద్వాదశజ్యోతిర్లింగస్వరూపాలకు ప్రతీకలని చెప్పొచ్చు.


💥మనలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానమనే పంచప్రాణాలు ఉన్నాయి.

మరో అయిదుఉపప్రాణాలు ఉన్నాయి.

అవి.. నాగ (త్రేన్పుగా వచ్చే గాలి),

కూర్మ (రెప్పపాటుకు కారణమైన గాలి),

కృకర (తుమ్ము),

ధనుంజయ (హృదయనాడులను తెరుస్తూ, మూస్తూ ఉండే వాయువు),

దేవదత్తం (ఆవులింతలోని గాలి)

వీటితో పాటు ఆత్మ...

ఈ పదకొండు ప్రాణశక్తులు ఏకాదశరుద్రులకు ప్రతీక.


💥భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం... వీటిలో ఉండే శక్తి అంతా పరమేశ్వర స్వరూపమే.


💥మనలోనూ, ప్రకృతిలోనూ పరమేశ్వరుడిని దర్శించమని మనిషికి బోధించడమే ఇందులోని అంతరార్థం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥