శ్రీవేంకటేశ్వర శరణాగతి స్తోత్రం💥💥 (సప్తర్షి కృతం)
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏
💥🌷💥🌷💥🌷💥🌷💥
💥అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు...
కోరిన కోర్కెలీడేర్చే దేవుడు..
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు..
భక్తుల పాలిట కొంగు బంగారం..
కలియుగ ప్రత్యక్ష దైవం... ఆ తిరుమలేశుడు.
పిలిచినంతనే పలికే దేవుడు.. భక్త జనులకు కొండంత అండ ఆయనే..
సకల జనులను నిత్యం కాపాడే గోవిందుడు..
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడు.
ఆ కమలనాభుని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం.
ఒక్క క్షణం ఆ తిరుమలేశుని దర్శనం అయితే చాలు.. సకలం.. సర్వం మరచి.. భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఆ వేంకటేశ్వరుని దర్శనం కాగానే... సకల భక్త కోటి అణువణువూ పులకించిపోతుంది.
వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే, ఈశ్వరుడు అంటే దేవుడు.
భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామము ప్రసిద్ధి చెందింది.
మానవ జీవితంలో కలిగే ఆపదలను తొలగించే దేవునిగా, ఆపదమొక్కుల వాడిగా జగత్ప్రసిద్ధి.
🔸🔹🔸🔹🔸🔹🔸🔹
💥💥శ్రీవేంకటేశ్వర శరణాగతి స్తోత్రం💥💥
(సప్తర్షి కృతం)
శేషాచలాసమాసాద్య కశ్యపాద్యా మహర్షయః |
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా || 1 ||
కలిసంతారకం ముఖ్యం స్తోత్రమేతత్ జపేన్నరః |
సప్తర్షి వా ప్రసాదేన విష్ణుః తస్మై ప్రసీదతీ || 2 ||
కశ్యప ఉవాచ –
కారి హ్రీమంత విద్యాయాః ప్రాప్యైవ పరదేవతా |
కలౌ శ్రీవేంకటేశాఖ్యః త్వామహం శరణం భజేత్ || 3 ||
అత్రీ ఉవాచ –
అకారాది క్షకారాంత వర్ణైః యః ప్రతిపాద్యతే |
కలౌ శ్రీవేంకటేశాఖ్యః శరణం మే రమాపతీ || 4 ||
భరద్వాజ ఉవాచ –
భగవాన్ భార్గవీకాంతో భక్తాభీప్సితదాయక |
భక్తస్య వేంకటేశాఖ్యో భరద్వాజస్య మే గతిః || 5 ||
విశ్వామిత్ర ఉవాచ –
విరాట్ విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞానవిగ్రహః |
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుః సదా || 6 ||
గౌతమ ఉవాచ –
గౌర్గాలీశప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః |
శరణం గౌతమాస్యాస్త వేంకటాధి శిరోమణిః || 7 ||
జమదగ్నిరువాచ –
జగత్కర్తా జగత్భర్తా జగన్నాథో జగన్మయా |
జమదగ్నిః ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వరః || 8 ||
వసిష్ఠ ఉవాచ –
భక్తిజ్ఞానమాత్రం చ యన్ నిర్విశేషం సుఖం చ సత్ |
తత్ర హైవాహమస్మీతి వేంకటేశం భజేత్ సదా || 9 ||
సప్తర్షిరచితం స్తోత్రం సర్వదా యః పఠేన్ నరః |
సోఽభయం ప్రాప్నుయాన్ సత్యం సర్వత్ర విజయీ భవేత్ || 10 ||
ఇతి శ్రీవేంకటేశశరణాగతిస్తోత్రమ్ సంపూర్ణమ్ |
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment