💥కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి💥
⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏
మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ ।
మహీదేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలమ్ ||
💥తమిళనాడులో ఆరు "సుబ్రహ్మణ్య" క్షేత్రాలను కలిపి "ఆరుపడైవీడు" అని వ్యవహరిస్తారు. ఆ ఆరు క్షేత్రాలను స్వామి వారి ఆరు ముఖాలుగా చెప్తారు.
అలాగే కర్ణాటకలో మూడు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలను విశేషంగా కొలుస్తారు.
1) ఆది సుబ్రహ్మణ్య - కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య
2) మధ్య సుబ్రహ్మణ్య - ఘాటి సుబ్రహ్మణ్య
3) అంత్య సుబ్రహ్మణ్య - నాగలమడక
ఈ మూడు క్షేత్రాలు, స్వామిని సర్ప రూపంలో చూస్తే
ఆది, మధ్య, అంత్యములుగా చెప్తారు.
చాలా చాలా శక్తివంతమైన క్షేత్రాలు.
💥కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి💥
కుక్కేలో స్వామి మొదట ఒక పుట్టగా మాత్రమే వెలిశారు. దానినే "ఆది సుబ్రహ్మణ్య" అని పిలుస్తారు.
ఇక్కడ ఇచ్చే మూల ప్రసాదం (పుట్టమన్ను) చాలా చాలా శక్తివంతమైనది.
గర్భగుడిలో వాసుకి, ఆపైనా ఆదిశేషుడూ, ఆపైన సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉంటారు.
వాసుకి, ఆదిశేషు, సుబ్రహ్మణ్యులను కలిసి ఒకేసారి చూడడం పరమ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం.
💥స్థల పురాణం:
సుబ్రహ్మణ్య ఆలయం గురించి "స్కాందపురాణం"లో సనత్‌కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణంలో తెలుపబడింది.
పూర్వం తారకుడు, శూరపద్మసుర అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి (కుక్కే సుబ్రహ్మణ్య గ్రామంలో) ధారానదిలో శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ తరువాత ఈ కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా ఆయన అంగీకరిస్తాడు.
💥గరుడుని దాడి నుంచి తప్పించుకోవటానికి సర్ప రాజు వాసుకి కుక్కే సుబ్రమణ్య క్షేత్రము లోని బిల ద్వారా గుహలలో శివ తపస్సు చేస్తుంటాడు.
వాసుకి తపస్సుకు ప్రసన్నించిన శివుడు, షణ్ముఖుడిని ఎల్లప్పుడూ తన ప్రియ భక్తుడు వాసుకికి అండగా, తోడుగా ఉండమని చెపుతాడు
ఆ తరువాత వాసుకి తపస్సుకు మెచ్చి వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించడం వల్ల ఈ క్షేత్రం వెలసింది.
💥క్షేత్రంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఆలయానికి పశ్చిమాన ఉన్న ద్వారం నుండి ప్రవేశిస్తాము.
ఆపైన ప్రదక్షిణ చేస్తూ తూర్పుద్వారం గుండా గర్భాలయంలోకి ప్రవేశిస్తాము.
💥అక్కడ స్వామి వారి ఎదురుగా ఉన్న ధ్వజస్థంభాన్ని "గరుడ స్థంభం" అని పిలుస్తారు.
అది వెండితో చేయబడి ఉంటుంది.
ఈ స్థంభం యొక్క విశిష్టత ఏమిటంటే, వశీకరించబడిన ఈ గరుడ స్తంభం, లోపల నివాసం ఉన్న మహా సర్పం వాసుకి ఊపిరి నుండి వెలువడే విషకీలల నుండి భక్తులను కవచంలా కాపాడటానికి ప్రతిష్ఠించబడింది అని నమ్మకం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment